Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఆ సీటు తెరాసకే దక్కాలిట!
posted on: Sep 11, 2014 1:49PM
.jpg)
కేసీఆర్ మరియు ఆయన కుటుంబ సభ్యుల మాటకారితనం గురించి ప్రజలకు తెలియంది కాదు. ఎటువంటి ఇబ్బందికరమయిన విషయాన్నయినా చాలా అలవోకగా తమకు అనుకూలంగా సమర్దించుకొంటూ చెప్పగల సమర్ధులు వారు. అందుకు మరో మంచి ఉదాహరణగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న సంగారెడ్డి బహిరంగ సభలో చెప్పిన మూడు ముక్కలు గురించి చెప్పుకోవచ్చును.
ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ “మెదక్ లోక్ సభ సీటు నేను ఖాళీ చేయడం వలననే ఈ సీటుకి మళ్ళీ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కనుక సహజంగానే ఈ సీటు మళ్ళీ తెరాసకే ఇవ్వాలి. ఇదివరకు నన్ను ఎంత భారీ మెజార్టీతో గెలిపించారో, అంతకు మించిన మెజార్టీతో తెరాస అభ్యర్ధిని గెలిపించుకోవాలి. లేకుంటే మనల్ని చూసి నవ్వుకొంటున్న వాళ్ళ ముందు మనం చులకన అయిపోతాము,” అని ప్రజలకు హితబోధ చేయడం చాల విచిత్రంగా ఉంది. ఆ లెక్కన చూసుకొంటే ఇక దేశంలో ఎక్కడా ఎప్పుడూ ఎన్నికలే నిర్వహించనవసరం ఉండదు. ఎందుకంటే ఒకసారి ఓ పార్టీకి చెందిన అభ్యర్ధి ఒక నియోజక వర్గం నుండి గెలిచినట్లయితే, కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఈ సరికొత్త సిద్దాంతం ప్రకారం ఇక అది ఎప్పటికీ ఆ పార్టీకే స్వంతమవుతుంది. ఇది కేసీఆర్ సిద్దాంతీకరించడం, దానిని అంతకంటే లౌక్యంగా ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేయడం కేవలం కేసీఆర్ కే చెల్లు.


.jpg)
.jpg)


