15 వ అంతస్తు నుండి పడి.. వైద్యవిద్యార్ధి మృతి.. కారణం ఇదే..  

వాళ్ళ టైం వస్తే ఎవరైనా చనిపోవసిందే.. కానీ కొన్ని సార్లు మన అజాగ్రత్త కూడా మన ప్రాణాలు తెస్తుంది.. కళ్ళు మోసి తెరిచేలోపు ఏం జరిగిందో అర్థం కాదు. ఈ మధ్య కాలంలో జరిగే రోడ్ ఆక్సిడెంట్ కావచ్చు.. అనుమానాస్పద మరణాలు కావచ్చు.. సమాజంలో ఎక్కువైనాయి తాజాగా ఒక విద్యార్థిని తన జాగ్రత్త వాళ్ళ 15 వ అంతస్తు మీది నుండి కిందపడి చనిపోయింది. అసలు ఆ ఎందుకు చెనిపోయింది..? ఎలా చనిపోయింది ? తన మరణం వెనక ఇంకేమైనా కారణాలు ఉన్నాయి తెలుకోవాలంటే ఈ వార్త చదవండి.. 

ఓపెన్ చేస్తే.. అది కృష్ణా జిల్లా. హనుమాన్‌ జంక్షన్‌. ఈ ప్రాంతానికి చెందిన భాస్కరరాజు భార్య, కూతురు అమూల్యతో కలిసి మంగళగిరిలోని డీజీపీ కార్యాలయం సమీపంలో ఆత్మకూరు పరిధిలో గల మిడ్‌వ్యాలీ సిటీలోని కైలాస్‌ బ్లాక్‌లో 1506 ఫ్లాట్‌లో నివాసముంటున్నారు. భాస్కరరాజు దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా.. పెద్ద కూతురికి వివాహమైంది. రెండో కూతురు అమూల్య విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్‌ సెకండియర్ చదువుతోంది. లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటుంది.. అయితే  శనివారం అర్ధరాత్రి తమ ఫ్లాట్‌ బాల్కనీలో పిట్టగోడపై కూర్చుని చదువుకుంటుంది.. 

కట్ చేస్తే.. తల్లి దండ్రులు కొద్దీ సేపటికి కూతురు కూర్చున్న వైపు చేశారు. అక్కడ కనిపించలేదు.. ఆ తల్లిదండ్రులు కంగారు పడ్డారు అమూల్య. అమ్యుల్య అని పిలిచారు. పలకలేదు..కంగారు పడ్డారు.. అమూల్య కూర్చున్న చోటుకి వెళ్లి చేశారు.. 15 వ అంతస్తు మీది నుండి చేస్తే .. అమూల్య రక్తపు మారకపు మడుగులో పడి ఉంది.. అప్పటికే  ప్రమాదవశాత్తు కిందకి పడిపోయింది. తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అమూల్య మృతదేహాన్ని శవ పరీక్ష కోసం మంగళగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.