మావిగన్ ప్రతిపాదన.. ట్రోలింగ్ మెటీరియల్ గా మారిన జగన్!

posted on: Apr 2, 2026 7:02AM

 మాజీ ముఖ్యమంత్రి  జగన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు  రాష్ట్ర వ్యాప్తంగా  హాట్ టాపిక్ గా మారింది. ఐదేళ్ల పాటు మూడు రాజధానుల అంశంతో రాష్ట్రంలో అభివృద్ధి ఆనవాలు లేకుండా చేసిన జగన్ ఇప్పుడు తాజాగా   మావిగన్  అంటూ ఒక విచిత్ర, వింత, విడ్డూర క్యాపిటల్ కాన్సెప్ట్ ను తెరమీదకు తీసుకు వచ్చారు.  ఆ కాన్సెప్ట్ పై నెటిజన్లు ఓ రేంజ్ లో సెటైర్లు గుప్పిస్తున్నారు. విశ్లేషకులు సైతం జగన్ నాన్ సీరియస్ పొలిటీషియన్ అంటూ విశ్లేషణలు చేస్తున్నారు.  

జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. పార్లమెంట్  చేసిన చట్టాన్ని రాష్ట్ర అసెంబ్లీ మార్చలేదన్న కనీస అవగాహన కూడా జగన్ కు లేదని ఎద్దేవా చేస్తున్నారు. మొత్తం మీద జగన్ తన మావిగన్ వ్యాఖ్యలతో నెటిజనులకు ఒక ట్రోలింగ్ మెటీరియల్ గా మారిపోయినట్లు కనిపిస్తోంది.  

 మరో వైపు వైసీపీ శ్రేణులు కూడా జగన్ మావిగన్ వ్యాఖ్యలతో డిఫెన్స్ లో పడ్డారు. గతంలో మూడు రాజధానులంటూ జగన్ చేసిన నిర్వాకం నుంచే ఇంకా పార్టీ తేరుకోలేదనీ, ఇప్పుడీ కొత్త ప్రతిపాదన పార్టీని మరింత పతనానికి తీసుకువెళ్లేలా ఉందని మధనపడుతున్నారు.   జగన్ ఇప్పటికైనా తన పంథా మార్చుకోకుంటే వైసీపీ పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ కే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.   అమరావతిపై జగన్ అనుసరిస్తున్న వైఖరి,  మావిగన్ లాంటి ప్రతిపాదనపై  సామాన్య జనం సైతం అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి.  మొత్తం మీద జగన్ తీరు పట్ల, ఆయన మావిగన్ వ్యాఖ్యల పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. 

జగన్ కు రాష్ట్ర ప్రయోజనాల కంటే.. తన పంతం నెగ్గించుకోవాలన్న మంకు పట్టుదల ఎక్కువగా కనిపిస్తోందంటున్నారు. ఇక జగన్ మావిగన్ ప్రతిపాదనపై జనసేనాని పవన్ కల్యాణ్ ఒక్క నవ్వుతో జగన్ ను, ఆయన పార్టీ నేతలు, శ్రేణులూ సిగ్గుతో తలదించుకునేలా చేశారు. ఆయన నవ్వులో ఎగతాళి కంటే.. పాపం జగన్ స్థాయి ఇదా అన్న జాలి కనిపించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...