ఈడు మ‌గాడ్రా .. బుజ్జే ! 

బ‌స్సుల్లో, ఆటోల్లో చాలాసార్లు మ‌నం చాలాసార్లు రూపాయి, రెండురూపాయ‌లు వదిలేస్తూ ఉంటాం. చిల్ల‌ర లేద‌ని డ్రైవ‌ర్లు నొక్కేస్తుంటారు. కానీ తుంగ‌నాధ్ చ‌తుర్వేదీ ఇర‌వై రూపాయ‌ల కోసం ఏకంగా రైల్వే వారిని క‌న్స్యూమ‌ర్ కోర్టుకు ఈడ్చాడు. ఇర‌వ‌య్యేళ్లు కేసు న‌డిచిన త‌ర్వాత ఆయ‌న‌కు రూ.15000 చెల్లించ‌మ‌ని కోర్టు ఆదేశించింది. దేశంలో క‌న్స్యూమ‌ర్ చ‌ట్టం అంటూ ఒక‌టి ఉంద‌ని చాలామంది ఇప్ప‌ టికైనా తెలుసు కుంటే మంచిది.

చ‌తుర్వేది అనే లాయ‌రు 1999లో మ‌ధుర‌నుంచి మొరాదాబాద్‌కు రైల్లో వెళ్లారు. టిక్కెట్ విష‌యంలో పెద్ద గొడ‌వే జ‌రిగింది. అప్ప‌ట్లో మ‌ధుర నుంచి  మొరాదాబాద్‌కు టిక్కెట్‌  35 రూపాయ‌లు. కానీ బుకింగ్ కౌంట‌ర్ లో ఇర‌వై రూపాయ‌లు ఎక్కువ తీసుకున్నారు. ఆయ‌న వంద‌రూపాయ‌లు ఇస్తే 70 రూపాయ‌లు తీసుకోవా ల్సింది 90 రూపాయ‌లు తీసుకుని ప‌ది రూపాయ‌లు ఇచ్చారు. చ‌తుర్వేది రైల్వే అధికారుల‌కు ఫిర్యాదు చేస్తే భ‌య్యా, జ‌ర లైట్ తీసుకో అన్నార‌ట‌. ఆయ‌న‌కి కోపం వ‌చ్చింది. అంతే వెంట‌నే ఈశాన్య రైల్వే బుకిం గ్ క్ల‌ర్క్ మీద క‌న్స్యూమ‌ర్ కోర్టులో కేసు వేశారు. వందకు మించి కోర్టు వాద‌న‌లు జ‌రిగాయి. అన్ని రోజు లు అన్నిసార్లూ చ‌తుర్వేది కోర్టుకు వెళ్లారు. ఆయ‌న‌ నిజానికి అంత ఆరోగ్య‌వంతుడు కాదు. అయినా రైల్వే క్ల‌ర్కుకు, రైల్వే వారికి బుద్ధిచెప్పాల‌న్న ప‌ట్టుద‌ల‌తోనే చాలా స‌హ‌నం ప్ర‌ద‌ర్శించారు. 

ఈ కేసు 22 ఏళ్లు న‌డిచింది. చివ‌రికి సుప్రీంకోర్టు 2021లో ఇచ్చిన ఒక కేసు తీర్పు ఆధారంగా ఇలాంటి కేసులు క‌న్స్యూమ‌ర్ కోర్టు తీర్పు ఇవ్వ‌చ్చ‌ని తేలింది. అంతే రైల్వేవారికి గుండెల్లో రాయి ప‌డింది. అస‌లు అప్పుడే ఆ ఇర‌వై రూపాయ‌లు ఇచ్చుంటే స‌రిపోయేది. ఏదో ముస‌లాయ‌న క‌దా ఏం చేస్తాడులే అని క్ల‌ర్కు లు ద‌బాయించారు. కానీ క‌న్స్యూమ‌ర్ కోర్టు తీర్పు తాట‌తీసింది. చ‌తుర్వేదీకి వ‌డ్డీతో స‌హా 15000 నెల రోజుల లోపు  చెల్లించాల‌ని ఆదేశించింది. మొన‌గాడంటే ఈడ్రా బుజ్జీ అన్నారు మ‌ధుర‌ వారంతా!