Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నన్ను ఎలా తిట్టారో చూడండి...
posted on: Dec 9, 2017 3:47PM
.jpg)
ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ నేత మణిశంకర్ అయ్యర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే కదా. ప్రధాని మోదీని ‘నీచ జాతికి చెందిన వ్యక్తి’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీనికి గాను కాంగ్రెస్ పార్టీనే మణిశంకర్ అయ్యర్ పై సీరియస్ అయ్యి.. మోడీకి క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. ఈ క్రమంలో మణిశంకర్ అయ్యర్ కూడా మోడీకి క్షమాపణలు చెప్పారు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఆయనను సస్పెండ్ చేసింది.అయితే కాంగ్రెస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన మణిశంకర్ తనపై చేసిన ‘నీచ్’ వ్యాఖ్యలతో ఢిల్లీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇక ఈ వ్యాఖ్యలపై స్పందించిన మోడీ.. గుజరాతీలకు జరిగిన అవమానమని, కాంగ్రెస్ నేతల మొఘల్ ఆలోచనకు ఇది ప్రతిరూపమని సూరత్ అన్నారు. ఎన్నికల్లో బీజేపీకి ఓటేయటం ద్వారా కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. అంతేకాదు ఇప్పుడు మరో అస్త్రాన్ని బయటకు తీశాడు మోడీ. వివిధ సందర్భాల్లో కాంగ్రెస్ నేతలు తనను తిట్టిన తిట్ల జాబితాను సిద్దం చేశారు. లప్రస్తుతం గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నికోల్‌లో నిర్వహించిన ర్యాలీలో మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్ నేతల తిట్ల దండకాన్ని ప్రజల ముందు ఉంచారు. మోడీని కాంగ్రెస్ తిట్టిన తిట్లు మీరు కూడా చూడండి...
పాకిస్థాన్‌లో మణిశంకర్ అయ్యర్ మాట్లాడుతూ నన్ను తమ దారి నుంచి అడ్డు తొలగిస్తామన్నారు.
* కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఇతర నేతలు కూడా నన్ను ‘నీచ్’ అన్నారు.
* తక్కువ కులంలో పుట్టడం, పేద కుటుంబంలో జన్మించినందుకే వారు నన్ను అలా పిలుస్తున్నారు.
* కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ నన్ను చాలా అసభ్యంగా పేర్కొంటూ ట్వీట్ చేశారు. అది చెప్పడానికి కూడా నోరు రావడం లేదు.
* ఒక గుజరాతీ, పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడని దిగ్విజయ్ సింగ్ నన్ను ఉద్దేశించి ట్వీట్ చేశారు.
* 'మోదీ సర్కారు రాక్షస రాజ్యం. మోదీ రావణుడు' అని దిగ్విజయ్ నన్ను అభివర్ణించారు.
* మోదీ హిట్లర్, ముస్సోలిని, గడాఫీ.. అని యూపీ కాంగ్రెస్ హెడ్ ప్రమోద్ తివారీ అన్నారు.
* మరో నేత నన్ను కోతి అన్నారు.
* జైరామ్ రమేశ్ నన్ను భస్మాసురుడిగా అభివర్ణించారు.
* బేణీ ప్రసాద్ వర్మ నన్ను పిచ్చి కుక్క అన్నారు. పిచ్చి కుక్కను గెలవనివ్వబోమని శపథం కూడా చేశారు.
* ఇమ్రాన్ మసూద్ అయితే నన్ను ఖండఖండాలుగా నరుకుతానని అన్నారు.
* రేణుకా చౌదరి నన్ను వైరస్ అన్నారు.
* మొన్న అయ్యర్ నన్ను నీచ్ జాతి వ్యక్తినని అన్నారు.. అంటూ కాంగ్రెస్ నేతలు వివిధ సందర్భాల్లో తనను అన్న మాటలను బయటపెట్టారు.
మొత్తానికి మోడీ.. చిన్నపిల్లాడు నన్ను తిట్టారనో.. కొట్టారనో పితురీలు చెప్పినట్టుగా నన్ను ఎలా తిట్టారో అని అందరికి చూపించడం బలే కామెడీగా ఉంది.



.jpg)


