వన్ ఇయర్..  ఆమెకు షేక్ చేతిలో నరకం 

ఒకటి కాదు రెండు కాదు. ఏడాది పాటు ఆమె నరకం అనుభవించింది. స్వదేశంలో పూట గడవక. కాస్త పక్కదేశానికి వెళ్లి డబ్బులు సంపాదించుకుందాం.. అనే ఆడవాళ గోసలు అంత ఇంత కాదు. గల్ఫ్ లో ఆడవాళ్ళ కష్టాలు పగవాడికి కూడా రావద్దని అక్కడి నుంచి తిరిగి వచ్చిన బాధితులు చెబుతుంటారు. తాజాగా స్వదేశం తిరిగి వచ్చి ఓ మహిళ తన కష్టాలను మీడియా ముందు వెళ్లి బుచ్చుకుంది. దుబాయి అనగానే అందరికీ గుర్తొచ్చేది. అద్దాల మేడలు, కాసుల గల గలలు మాత్రమే కానీ, ఆ అద్దాల మేడలా వెనుక ఆడవాళ్ళ కష్టాలు అంత ఇంత కాదు. ఆ చీకటి ప్రపంచం మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఎంతో మంది మహిళలు అక్కడ పనుల కోసం వెళ్లి, లైంగిక వేధింపులకు గురై చివరకు స్వదేశానికి బ్రతుకు జీవుడా అని చేరుకున్నారు. అలాంటి ఓ దీనగాథ చూద్దాం.

అది తూర్పుగోదావరి జిల్లా.  సఖినేటిపల్లి మండలం. పేరు సుజాత ( పేరు మార్చాం) అక్కడ ఇక్కడ వంట పని చేసేది. భర్త అకాల మరణంతో కుటుంబభారం ఆమె మీద పడింది. కూతురు పెళ్లి కోసమని దాదాపు 3 లక్షల దాకా ఖర్చు కావడంతో  చాలా చోట్ల అప్పులు చేసింది. తాను చేసే వంట పనితో ఇక తాను చేసిన అప్పులు తీర్చడం అసాధ్యమని భావించిన సుజాత, ఎలాగైనా ఆ అప్పుల నుండి ఈ కష్టాల నుంచి బయటపడాలనుకుంది. అందుకోసం స్థానిక ఏజెంట్ ద్వారా దుబాయి వెళ్లి సంపాదించాలనుకుంది. అప్పుడే తన అప్పులు తీరుతాయని భావించింది. ఏజెంట్ ద్వారా హైదరాబాద్ చేరుకున్న సుజాత తన ఇల్లు, పొలం, బంగారం తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులతో దుబాయి ప్రయాణం అయ్యింది.

దుబాయ్ లో స్థానికంగా ఉన్న ఓ రెస్టారెంట్ లో హౌస్ కీపర్ గా జీవితం స్టార్ట్ చేసింది. మొదటి రెండు నెలల పాటు అదే రెస్టారెంట్ లో పనిచేసింది. అయితే ఆ రెస్టారెంట్ క్లోజ్ చేయడంతో. కాస్త బెంగపడింది.  ఆ తర్వాత ఔట్ సోర్సింగ్ కంపెనీ వారు ఓ ఇంట్లో వంట మనిషి కింద ఉద్యోగం కుదిర్చారు. సుజాత యూఏఈలోని ఓ షేక్ ఇంటలో పని కుదరింది. మొదట్లో ఆ ఇంట్లో అంతా బాగానే చూసుకున్నారు. కానీ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ దుబాయి షేక్ కుమారుడు లండన్ నుంచి ఇంటికి వచ్చాడు. అతడి వయస్సు కేవలం 21 సంవత్సరాలు మాత్రమే. నిత్యం పబ్స్, గర్ల్ ఫ్రెండ్స్ , మాదక ద్రవ్యాలతో మునిగి తేలే ఆ షేక్ తనయుడి కన్ను సుజాత పై పడింది. 

కట్ చేస్తే..  ఓ  రోజు తన బెడ్రూంలో నుంచి సుజాతకి టీ తీసుకురమ్మని చెప్పాడు. సుజాత వెంటనే టీ కప్పుతో భయం భయంగా అతడి గదిలోకి వెళ్ళింది. అప్పటికి  ఆ షేక్ కుమారుడు డ్రగ్స్ తీసుకొని మైకంలో ఉన్నాడు. సుజాత ను ఒంటి మీద దుస్తులు తీసేయమన్నాడు. అందుకు సుజాత నిరాకరించింది. అతని మాట వినకపోయి సరికి షేక్ కొడుకు కోపం వచ్చింది. దాంతో బెల్టు తీసకొని ఆమెను చితకబాదాడు. ఆ విషయాన్నీ సుజాత , షేక్ కు చెప్పింది, అయినా ఫలితం లేకుండా పోయింది. పైగా తన కొడుకు చెప్పినట్లు నడుచుకోమని ఆదేశించాడు షేక్.  ఇక సుజాత ఆ నరక బాధలు భరించలేకపోయింది. షేక్ కుమారుడు తనకు ఎప్పుడు మూడ్ వస్తే అప్పుడు ఆమెను గదిలోకి పిలిచి అత్యాచారం చేసేవాడు. ఆమెను మంచానికి కట్టేసి గంటల తరబడి సెక్స్ చేసేవాడు. అంతే కాదు తన స్నేహితులను పిలిచి సైతం సుజాత పై అత్యాచారానికి దిగేవాడు.

ఈ నరకబాధలను సుజాత  సంవత్సరం పాటు భరించింది. ఒకే రోజు దాదాపు 12 మంది వరకూ సుజాత లైంగిక అవసరాలకు వాడుకునే వారు. పేదరికంతో సుజాత వారిని కాదనలేక పోయింది. ఆమె అనారోగ్యం పాలవడంతో షేక్ కుటుంబం తమకు ఇంకో పనిమనిషి కావాలని, సుజాత ని తరిమిగొట్టి, పంపేసింది.  దీంతో ఆమె స్థానిక హోటల్ లో మరో ఆరు నెలల పాటు పనిచేసింది. చివరకు వీసా గడువు పూర్తి కావడంతో ఆమె స్వదేశానికి తిరిగి వచ్చింది. తన వయస్సు కన్నా చాలా చిన్నవాడైన షేక్ కుమారుడు అలా పశువులా మీద పడి అనుభవిస్తున్నా...పేదరికంతో పాటు నిస్సహాయత తోడైన నరకం చూశానని వాపోయింది.