Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రేవంత్ రెడ్డిని సీఎం చేసింది నేనే...మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు
posted on: Mar 23, 2026 5:01PM
.webp)
హైదరాబాద్ అసెంబ్లీ లాబీలో మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తానే ముఖ్యమంత్రిని చేశానంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్డి సామాజిక వర్గంలో రేవంత్ రెడ్డి తప్ప మరెవరూ పవర్‌ఫుల్ నాయకులు లేరని, ఆ విషయాన్ని రెడ్డి సంఘం సమావేశంలో తానే చెప్పానని తెలిపారు.
అదేవిధంగా “ఎవరు ఏమన్నా, నేను – రేవంత్ రెడ్డి అన్నదమ్ములమే” అంటూ తన సాన్నిహిత్యాన్ని వ్యక్తం చేశారు. రాజకీయాల మధ్యలోనే సినిమాల విషయాన్ని ప్రస్తావిస్తూ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో విలన్ పాత్ర కోసం దర్శకుడు హరీష్ శంకర్ తనను సంప్రదించారని, అయితే తాను ఆ ఆఫర్‌ను తిరస్కరించానని వెల్లడించారు. భవిష్యత్తులో సినిమాల్లో ముఖ్యమంత్రి పాత్ర చేయాలనే ఆసక్తి ఉందని కూడా చెప్పారు. మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి.
అయితే ఈ సందర్భం గా అక్కడే ఉన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సరదాగా స్పందించారు. మల్లారెడ్డి ముఖ్యమంత్రి పాత్రకు సెట్ కాదని, సినిమాల్లో సీఎం పాత్రలు రెండు నిమిషాలే ఉంటాయని చమత్కరిం చారు. “నీకు విలన్ పాత్రే బాగా సెట్ అవుతుంది… ఎలివేషన్ కూడా విలన్ పాత్రలోనే ఉంటుంది” అంటూ నవ్వులు పూయిం చారు. నీ హైట్‌కు విలన్ పాత్రే సరిపోతుందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ సరదా చిట్‌చాట్ అసెంబ్లీ లాబీలో ఉన్న వారిని అలరించగా, రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.






