బెజవాడ టెర్రర్ లింకుల కేసులో కీలక పురోగతి.. హైదరాబాద్ లో సైదాబేగం అరెస్టు

posted on: Mar 25, 2026 2:12PM

బెజవాడ  టెర్రర్ లింకుల కేసు విచారణలో పోలీసులు కీలక పురోగతి సాధించారు ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 13 మంది నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. దేశ భద్రతకు సంబంధించిన సున్నిత అంశంగా భావిస్తున్న ఈ కేసును పోలీసులు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని దర్యాప్తు సాగిస్తున్నారు.

ఇప్పటికే పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే...  తాజాగా హైదరాబాద్‌కు చెందిన సైదా బేగం అనే మహిళను అదుపులోనికి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం దేశవ్యాప్తంగా విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు.  ఈ కేసులో విదేశీ హ్యాండ్లర్ పాత్ర కూడా ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం

. దీంతో పోలీ సులు మరింత అప్రమత్తమై, వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.  మొత్తం 9 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి తెలంగాణ, బిహార్, ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.   ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ కేసులో ఏ4గా ఉన్న దిల్ఖాష్  ఏ5గా ఉన్న హైదరాబాద్ కు చెందిన సైదా బేగం, ఏ6గా ఉన్న విదేశీ హ్యాండ్లర్  ఆల్ హకీమ్ షుకూర్ , ఏ7గా ఉన్న ఢిల్లీకి చెందిన  లక్కీ అహ్మద్ , ఏ8 బీహార్ కు చెందిన అస్మానుల్లా ఖాన్, ఏ9 రాజస్థాన్ కు చెందిన జిషణ్  , ఏ10 గా పశ్చిమ బెంగాల్ కు చెందిన  మీరా ఆసిఫ్ అలీ , ఏ11 కర్నాటకకు చెందిన అబ్దుల్ సలాం, ఏ12  మహారాష్ట్రకు చెందిన షారక్ ఖాన్, A14 మహారాష్ట్రకు చెందిన షేక్ ఫీజర్ రెహమాన్  లను గుర్తించారు.

ఇప్పటికే అదుపులో ఉన్న నిందితులను స్థానిక పోలీసుల సహకారంతో ప్రత్యేక బృందాలు  విచారిస్తున్నాయి. కేసుకు సంబంధించిన నెట్‌వర్క్, లింకులు, ఆర్థిక లావా దేవీలు, కమ్యూనికేషన్ డేటా వంటి అంశాలను కూడా అధికారులు లోతుగా పరిశీలిస్తున్నారు మొత్తం నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని  అంటున్నారు.అదలా ఉండగా బెజవాడలో అరెస్టు చేసిన వారి నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా మంగళవారం (మార్చి 24) రాత్రి ఆమెను హైదరాబాద్ చంచల్ గూడలో అరెస్టు చేసి బెజవాడకు తరలించారు. ప్రస్తుతం ఆమెను రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది.   

google-ad-img
    Related Sigment News
    • Loading...