ఎమ్మెల్సీలుగా రామచంద్రయ్య, హరిప్రసాద్ ఏకగ్రీవం!

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండు స్థానాలకు ఈ ఇద్దరి నుంచే నామినేషన్లు రావడంతో, ఇద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. సార్వత్రిక ఎన్నిలకు ముందు ఎమ్మెల్సీలుగా వున్న సి.రామచంద్రయ్య, షేక్ మహ్మద్ ఇక్బాల్ వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. వారిలో ఇక్బాల్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. రామచంద్రయ్య మీద అనర్హత వేటు పడింది. అలా ఖాళీ అయిన రెండు స్థానాలు ఉప ఎన్నికలు లేకుండానే ఏకగ్రీవంగా భర్తీ అయ్యాయి. తెలుగుదేశం సీనియర్ నాయకుడు రామచంద్రయ్యకు ఎన్డీయే కూటమి మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. మరో అభ్యర్థి పి.హరిప్రసాద్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి రాజకీయ కార్యదర్శి.
Publish Date: Jul 5, 2024 6:32PM

పట్టిసీమ పైప్ లైన్ లీక్

పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లా రైతులకు  సాగునీరు, తాగునీటికి ఊరటనిచ్చే  పట్టిసీమ ఎత్తిపోతలతో పథకాన్ని గత అయిదేళ్లుగా ప్రభుత్వం పక్కన పెట్టివేసింది. గత ఏడాది తాగునీటి ఎద్దడిని తట్టుకోలేక  కొద్ది రోజులు పట్టిసీమను  వినియోగించి ప్రభుత్వం మమ అనిపించింది.  ఈ ఏడాది నాగార్జున  ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరటంతో .. కృష్ణా, గుంటూరు జిల్లాలు  తాగునీటి కోసం తల్లడిల్లిపోతున్నాయి. కనీసం కృష్ణాజిల్లా  రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో   పట్టిసీమ మోటార్లతో  నీటి తరలింపు ప్రారంభించారు. ఏలూరు జిల్లా పోలవరం  మండలం విక్కిసిరావుపేట వద్ద శుక్రవారం ఉదయం పట్టిసీమ  పైప్ లైన్ పగిలిపోయింది. ఎయిర్ వాల్ లీక్  ఘటనతో  20 అడుగులు ఎత్తులో  నీళ్లు ఎగిసి పడుతున్నాయి. పట్టిసీమ ఎత్తిపోతల నుంచి పైప్ లైన్ ద్వారా కుడి కాల్వలోకి నీళ్లు వెళ్లే మార్గంలో పైప్ లైన్ ధ్వంసమైంది. జగన్ సర్కార్ నాలుగేళ్లుగా పట్టిసీమను నిర్లక్ష్యం చేసి వినియోగించకుండా వదిలేయడం వల్లే ఈ ఘటన జరిగిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైప్ లైన్ లీక్ తో   గోదావరి జలాలు పంట పొలాలను ముంచెత్తుతున్నాయి.  గోదావరి నది నుంచి పోలవరం కుడి కాల్వ వరకు డెలివరీ ఛానల్‌ ఏర్పాటు చేశారు. రెండు రోజుల కిందట  మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి 2,800 క్యూసెక్కుల గోదావరి జలాలు పోలవరం ప్రాజెక్టు కుడి కాలవకు  విడుదల చేశారు.   పట్టిసీమ వద్ద గోదావరి నీటిమట్టం 14.74 మీటర్లకు పైబడి ఉండడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 8 పంపులు 8 మోటార్ల ద్వారా నీటి పంపిణీ చేశారు. ఈ క్రమంలోనే పైప్‌లైన్ లీకేజీ జరిగింది. ఇటుకల కోట డెలివరీ ఛానల్‌కు వెళ్లే పైపు లైన్ వాల్ ప్లేట్ ఊడిపోయింది.      పైప్ లైన్ లీకేజీతో తమ పొలాలు మునిగిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు నీటి లీకేజీ అరికట్టాలని కోరుతున్నారు. మరోవైపు పైప్‌లైన్ పగిలిపోయిన ప్రాంతానికి వెళ్లే మార్గం కూడా మూసుకుపోయింది. చెట్లు, పొదలతో నిండిపోయిన ప్రాంతానికి చేరాలంటే జంగిల్ క్లియర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మోటార్లను నిలుపుదల చేస్తే తప్ప ఏ లైన్ పగిలిందో గుర్తించలేని పరిస్థితి ఉంది. దీంతో జలవనరుల శాఖ అధికారులు పైప్‌లైన్లలో ఏ మేరకు నష్టం జరిగిందో గుర్తించే పనిలో పడ్డారు.  అటు, ఈ ఘటనపై స్పందించిన మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత జలవనరుల శాఖ ఇంజినీర్‌లతో నిమ్మల ఫోన్‌లో మాట్లాడారు. వెంటనే లీకేజిని అరికట్టాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాలతో లీకేజీ నివారించే చర్యలను అధికారులు చేపట్టారు. నీటి విడుదలను తాత్కాలికంగా నిలిపి జలవనరుల శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు.  
Publish Date: Jul 5, 2024 5:21PM

కాంగ్రెస్ లోకి విజయమ్మ అడుగు.. జగన్ నెత్తిన పిడుగు

ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఎప్పుడైనా త‌ప్పద‌న్నా..  చేసిన పాపాలకు  అస‌లు వ‌డ్డీతో టి సిస‌లుగా ఫ‌లితంబు అనుభ‌వించుట త‌ధ్య‌మ‌న్నా.. అంటూ సీనియ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన ఓ సినిమాలో ఓ పాట ఉంది.  జీవితంలో మ‌నంచేసే మంచి చెడుల‌కు ఫ‌లితాలు త‌ప్ప‌కుండా అనుభ‌వించాల్సి వ‌స్తుంద‌ని  దీని సారాంశం.   ఈ పాట మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి  అతికినట్లు సరిపోతుంది. అధికారంలో కొన‌సాగిన ఐదేళ్లూ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. త‌న మాట‌కు అడ్డుచెప్పిన వారిని చిత్ర‌హింస‌ల‌కు గురిచేసి రాక్ష‌సానందం పొందారు. ఈ కోవ‌లో ప్ర‌తిప‌క్ష పార్టీల్లోని నేత‌లే కాదు.. సొంత పార్టీలోని కొంద‌రు నేత‌లు సైతం జ‌గన్ బాధితులుగా మారిపోయారు. వీరితో పాటు సొంత తల్లి, చెల్లిని సైతం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అమానించారు. ఫ‌లితంగా సొంత చెల్లి, త‌ల్లిసైతం జ‌గ‌న్ పార్టీకి దూరంగా వెళ్లిపోయారు. త‌ప్పుల‌కు త‌ప్ప‌నిస‌రిగా దండ‌న ఉంటుంద‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం. ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మితో దెబ్బ‌తిన్న జ‌గ‌న్‌కు.. వ‌రుస‌గా షాక్‌ల మీద షాక్‌లు త‌గులుతున్నాయి. 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారంలోకి రావ‌టానికి వైఎస్ ష‌ర్మిల‌, విజ‌య‌మ్మ కూడా ఓ కార‌ణం. అదే స‌మ‌యంలో 2024 ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోర ఓట‌మికి కూడా వారిద్ద‌రూ ఓ కార‌ణం అని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. ఎన్నిక‌ల‌కు కొద్ది నెల‌ల ముందు ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టిన ష‌ర్మిల‌.. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి టార్గెట్ గా త‌న రాజ‌కీయ అడుగులు వేశారు. ష‌ర్మిల‌కు మ‌ద్ద‌తుగా విజ‌య‌మ్మ‌ నిలిచారు. అధికారంలో ఉన్న‌న్ని రోజులూ త‌ల్లి, చెల్లి విలువ‌ను గుర్తించ‌లేని జ‌గ‌న్‌.. ఇప్పుడు వారిని మ‌చ్చిక చేసుకునేందుకు పావులు క‌దుపుతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే, ఏపీలో కాంగ్రెస్ పార్టీని బ‌లోపేతం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకెళ్తున్న వైఎస్ ష‌ర్మిల జ‌గ‌న్ ద‌రిదాపుల్లోకి వెళ్లేందుకు  ఇష్ట‌ప‌డ‌టం లేదు. ఇటీవ‌ల స‌యోధ్య‌ కోసం జ‌గ‌న్ మ‌ద్ద‌తుదారులు ప్ర‌య‌త్నించ‌గా.. ష‌ర్మిల ఛీకొట్టిన‌ట్లు స‌మాచారం. దీనికి తోడు ష‌ర్మిల మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. జులై 8వ తేదీన దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌యంతి. ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వాడ వేదికగా  కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ష‌ర్మిల నిర్ణయించారు. ఈ కార్య‌క్ర‌మానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి నేత‌ల‌తోపాటు, తెలుగు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నేత‌ల‌ను స్వ‌యంగా వెళ్లి  మరీ ష‌ర్మిల ఆహ్వానించారు. ష‌ర్మిల నిర్వ‌హించే వైఎస్ఆర్ జ‌యంతి కార్య‌క్ర‌మం స‌క్సెస్ అయితే వైసీపీ మ‌నుగ‌డ‌కే ప్ర‌మాద‌మ‌ని ఆ పార్టీ నేత‌లు ఆందోళ‌న చెందుతున్నారు. దీనికి తోడు గ‌త ఐదేళ్ల కాలంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సీఎంగా త‌న తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి త‌ర‌హాలో పాల‌న అందించ‌లేకపోయాడు. దీంతో వైఎస్ఆర్ అభిమానులుసైతం జ‌గ‌న్ పై ఆగ్ర‌హంతో ఉన్నారు. ప్ర‌స్తుతం ఏపీలో వైసీపీ పాల‌న మ‌ళ్లీ రావాలంటే కాంగ్రెస్ తోనే సాధ్య‌మ‌ని వైఎస్ జ‌యంతి కార్య‌క్ర‌మం వేదిక‌గా ష‌ర్మిల ఏపీ ప్ర‌జ‌ల‌కు బ‌లంగా చెప్ప‌బోతున్నారు. ప్ర‌జ‌లు ష‌ర్మిల మాట‌ల‌ను విశ్వ‌సిస్తే.. జ‌గ‌న్ పార్టీ మ‌నుగ‌డ  క‌ష్ట‌మేన‌న్న వాద‌న ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ష‌ర్మిల దూకుడుకు త‌ల ప‌ట్టుకుంటున్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, వైసీపీ నేత‌ల‌ నెత్తిన మ‌రో పిడుగు పడింది.  ష‌ర్మిల నిర్వ‌హించే కార్య‌క్ర‌మంలో వైఎస్ఆర్ స‌తీమ‌ణి విజ‌య‌మ్మ పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. తద్వారా తాను వైసీపీకి కాదు కాంగ్రెస్ కే మద్దతు పలుకుతున్నానని చెప్పకనే చెప్పడానికి నిర్ణయించుకున్నారని తేటతెల్లమౌతోంది.  ష‌ర్మిల నిర్వ‌హించేది పూర్తిగా కాంగ్రెస్ కార్యక్రమం. అందుకే ఆమె కాంగ్రెస్ అగ్రనేతలను ఈ వేడుకలకు హాజరు కావాలంటూ ప్రత్యేకంగా కలిసి కోరారు.   ష‌ర్మిల నిర్వ‌హించే వైఎస్ఆర్ జ‌యంతి కార్య‌క్ర‌మానికి విజయమ్మ హాజర‌యితే.. అది జగన్ రెడ్డికి కోలుకోలేని దెబ్బే. కొంతకాలంగా  విజయమ్మ రాజకీయంగా షర్మిలకే  అండగా నిలుస్తున్నారు. ప్ర‌స్తుతం జ‌రిగే వైఎస్  జ‌యంతి కార్య‌క్ర‌మంలో విజ‌య‌మ్మ పాల్గొంటే.. రాష్ట్రంలో వైసీపీని కాదని కాంగ్రెస్ ను బలపరచాలని విజయమ్మ పిలుపునిచ్చినట్లే అర్ధం.   అంటే ఏపీలో వైసీపీ భూస్థాపితానికి బీజం ప‌డిన‌ట్లే. ప్ర‌స్తుతం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఎదుర‌వుతున్న ఇబ్బందుల‌ను చూస్తున్న ఏపీ ప్ర‌జలు.. ఎవ‌రు చేసిన క‌ర్మ వారు అనుభ‌వించ‌క త‌ప్ప‌దు.. అంటూ సాగే పాట‌ను గుర్తు చేసుకుంటున్నారు.
Publish Date: Jul 5, 2024 4:21PM

గిన్నెలో కోడి కాదు.. గిన్నీస్‌లో కోడి!

కోడి సాధారణంగా పొయ్యి మీద వున్న గిన్నెలోకి చేరుతుంది.. కానీ, బ్రిటీష్ కొలంబియాలో ఒక కోడి గిన్నిస్ బుక్కులోకి చేరింది. ప్రపంచం మొత్తంలో అంకెలను, రంగులను గుర్తుపట్టి చెప్పగలిగే కోడిగా ఈ కోడి గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించింది. ఈ కోడి ఈ ఘనతను సొంతగా ఏమీ సాధించలేదు. ఎమీలా అనే ఒక పశువైద్యురాలికి, కోడికి అంకెలను, రంగులను గుర్తుపట్టే విధంగా ట్రైనింగ్ ఇస్తే ఎలా వుంటుందన్న ఆలోచన వచ్చింది. ఆమె వెంటనే తన ఆలోచనని అమల్లో పెట్టేసింది. దీని కోసం ఒక కోడి గుడ్డును ఎంపిక చేసుకుంది. ఆ గుడ్డులోంచి కోడిపిల్ల బయటకి వచ్చినప్పటి నుంచి దానికి ట్రైనింగ్ ఇవ్వడం ప్రారంభించింది. ఆ కోడి పిల్ల పెరిగి కోడి పుంజు అయ్యే నాటికి చాలా అంకెలని, రంగులని గుర్తుపట్టగలిగే టాలెంట్ సంపాదించుకుంది. అందుకే, గిన్నెలోకి వెళ్ళాల్సిన ఆ కోడి గిన్నిస్ బుక్కులోకి చేరింది. ఈ కోడిని కోసుకుని కూర వండుకునే ఉద్దేశం తనకు ఎంతమాత్రం లేదని, అది బతికి వున్నంతకాలం తనతోనే వుంచుకుంటానని డాక్టర్ ఎమీలా చెబుతోంది.
Publish Date: Jul 5, 2024 4:18PM

జైల్లో రేపిస్టు సుధాకర్‌.. పరామర్శకు వెళ్లనున్న జగన్?

గత మూడేళ్ళుగా మైనర్ బాలికను వేధిస్తున్న కోడుమూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ జరదొడ్డి సుధాకర్‌ని పోలీసులు అరెస్టు చేశారు. పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కి పంపించారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి రిమాండ్‌లో వున్న రేపిస్టు సుధాకర్‌ని పరామర్శించాల్సిన అవసరం వుంది. హత్యాయత్నం కేసులో జైల్లో వున్న తన పార్టీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పాతిక  లక్షల రూపాయల ఖర్చు పెట్టించి పరామర్శించిన జగన్, ఇప్పుడు రేప్ కేసులో అరెస్టు అయిన సుధాకర్‌ని కూడా పరామర్శించాలి. పిన్నెల్లిని పరామర్శించి బయటకి వచ్చిన తర్వాత జగన్, పిన్నెల్లి ఈవీఎంలు పగలగొట్టడాన్ని సిగ్గులేకుండా సమర్థించారు. అలాగే రేపిస్టు సుధాకర్ని పరామర్శించి, జైల్లోంచి బయటకి వచ్చిన తర్వాత సుధాకర్ చేసిన రేప్‌ని కూడా సమర్థిస్తూ మాట్లాడాలి. ‘‘పాపం సుధాకర్‌కి రేప్ చేయక తప్పని పరిస్థితి వుంది కాబట్టి రేప్ చేశాడు... రేప్ చేయాల్సిన అవసరం లేకపోతే ఎందుకు రేప్ చేస్తాడు?’’ అని సిగ్గులేకుండా మాట్లాడే శక్తి జగన్‌కే వుంది కాబట్టి... జగన్ అలా మాట్లాడాలి. చంద్రబాబుని తిట్టడానికి జగన్ ఏ సాకు దొరుకుతుందా వెతుక్కుంటున్నాడు కదా... ఈ రేపిస్టు దగ్గరకి వెళ్ళినప్పుడు కూడా, ‘‘ఇదంతా వైసీపీ వాళ్ళమీద చంద్రబాబు కుట్ర’’ అని రంకెలు వేయాలి.. ఇదంతా విని జనం జగన్ ముఖం మీద మరోసారి ఊయాలి!
Publish Date: Jul 5, 2024 3:28PM