Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మళ్ళీ లాక్‌డౌన్...అసలు నిజం ఇదే!
posted on: Mar 26, 2026 3:58PM

దేశవ్యాప్తంగా మరోసారి 'లాక్‌డౌన్' అనే పదం మార్మోగుతోంది. సరిగ్గా ఆరేళ్ల క్రితం 2020, మార్చి 24న భారత్‌లో అమలైన కఠిన లాక్‌డౌన్ రోజులను గుర్తు చేస్తూ, మంగళవారం రోజంతా గూగుల్ వంటి సెర్చింజన్లలో నెటిజన్లు దీని గురించి ఆరా తీశారు. సోషల్ మీడియా వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుగా చిత్రీకరించడంతో ఈ గందరగోళం మొదలైంది.
ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై పార్లమెంటులో ప్రసంగించిన ప్రధాని మోదీ, అంతర్జాతీయంగా ఇంధన సరఫరా వ్యవస్థలో తలెత్తిన ఆటంకాలను ప్రస్తావించారు. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి గతంలో కోవిడ్ సమయంలో ప్రజలు చూపిన ఐక్యత, సహనం మరియు సంసిద్ధతను ఇప్పుడు కూడా ప్రదర్శించాలని కోరారు. అయితే, ఆయన 'కోవిడ్' అనే పదాన్ని వాడటంతో, అది కొత్త లాక్‌డౌన్‌కు సంకేతమని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం మొదలైంది.
దీనికి తోడు అంతర్జాతీయ ఇంధన సంస్థ తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాలు కూడా ఈ రూమర్లకు ఆజ్యం పోశాయి. ఇంధన పొదుపు కోసం ఐఈఏ చేసిన 10 సూచనలను 'కోవిడ్ తరహా చర్యలు'గా అభివర్ణించింది. అందులో ఉన్న 'స్వచ్ఛంద అనే పదాన్ని తొలగించి, ప్రభుత్వం వీటిని 'తప్పనిసరి చేయబోతోందంటూ కొందరు తప్పుడు పోస్టులు పెట్టారు. దీంతో సామాన్యులు ఆందోళనకు గురై అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఇంటర్నెట్‌లో భారీగా వెతకడం ప్రారంభించారు.
గతంలో లాక్‌డౌన్ సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, వలస కూలీల కష్టాలు, ఆకస్మికంగా ఆగిపోయిన రవాణా వ్యవస్థ వంటి చేదు జ్ఞాపకాలను నెటిజన్లు గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం మళ్ళీ వస్తుందా? అనే చర్చ కూడా సాగింది. అయితే ప్రభుత్వం నుండి లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ఎలాంటి అధికారిక ప్రకటన లేదని, కేవలం పాత పరిస్థితులతో ప్రస్తుత సంక్షోభాన్ని పోల్చడం మాత్రమే జరిగిందని స్పష్టమవుతోంది.
ప్రస్తుతానికి దేశంలో లాక్‌డౌన్ విధించే ఆలోచన లేదని, కేవలం ఇంధన వినియోగంపై అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారాన్ని నమ్మి ఆందోళన చెందవద్దని, అధికారిక వర్గాల సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. ప్రజలు కూడా ఇలాంటి సెన్సిటివ్ విషయాలపై షేర్ చేసే ముందు వాస్తవాలను సరిచూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


.webp)
.webp)


