Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...లగడపాటీ.. నువ్ మంచిగుండాలె!
posted on: Nov 23, 2013 12:20PM
.jpg)
లగడపాటి అన్నా.. మంచిగున్నవా? తబీయెత్ ఠీక్ వున్నదా? వ్యాపారాలు.. ఆమ్దానీ మంచిగున్నదా? నువ్వు మంచిగనే ఉంటవ్‌లే అన్నా. నువ్వు ఎప్పటిలెక్క మంచిగనే ఉండాలని ఆ జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లికి దండాలు పెడతాండ అన్నా! గిందేంటా బై తెలంగాన వాల్లు నన్ను ఎప్పుడు చూసిన తిడ్తా వుంటరు గదా.. గిప్పుడేంటీ ఈ పోరడు మంచిగ అన్నా అంటుండని డౌటయితందా? నేను గిట్ల నిన్ను ప్యార్ సే అన్నా అని పిలుస్తున్ననో నీకు సంఝయ్యేట్టు చెప్త! చెప్పాలనుకుంది బరాబర్ చెప్త.
అన్నా.. గింతకుముందు నిన్ను మా విభజనవాదులందరూ మంచిగ తిట్టుకునేటోళ్ళం. రాష్ట్రాన్ని ముక్కలు చేసి తెలంగాన ఇవ్వనికి నువ్వు ఒప్పకోవని, ఢిల్లీల పుల్లలు పెడ్తుంటవని నిన్ను అనెటోళ్ళం! తెలంగానకి నిన్ను శత్రువని చెప్పెటోళ్ళం. అయితే అప్పుడు నిన్ను గట్ల సమఝ్ చేసుకున్నందుకు మేం ఇప్పుడు చానా ఫీలవుతున్నం అన్నా. నువ్వు తెలంగాన బిడ్డలకి శత్రువువి కావన్నా.. నువ్వు మాకు మంచి దోస్తువన్నా. అది ఎట్లంటవా? గిప్పుడు తెలంగాన ఇంత ఈజీగా వచ్చుడుకు నువ్వు కూడా కారణమన్నా. మేం విభజన ఉద్యమం చేస్తున్నప్పుడు అటు పక్క సీమాంధ్ర వాల్లు కూడా సమైక్య ఉద్యమం చేస్తే వాళ్ళకి మంచిగ ఉండేటిది. ఇప్పుడు కొంప మునగకుండా ఉండేటిది. వాల్లు నిన్ను, నీలాంటోళ్ళని నమ్మి, మీరేదో ఊడపొడిచేస్తరని సప్పుడు జేయకుండా కూర్చున్నరు.
తెలుగు తల్లి ఒడిలో ఆయుధం, స్టార్ బ్యాట్స్ మన్ అని ఏవేవో కబుర్లు చెప్పి నువ్వు సీమాంధ్ర వాళ్ళని కూల్ చేసినవ్. అందుకే వాల్లు ఇప్పుడు ఏడుస్తున్నరు. సమైక్య ఉద్యమం చల్లబడనికి నువ్వు కూడా మంచిగ కృషి చేసినవ్ లగడపాటి భయ్యా. సీమాంధ్రోల్లు నీ మాటలు నమ్మకుండా సొంతగా ఆలోచించి వుంటే ఇప్పుడు వీధుల్లో పడి ఏడవాల్సి వచ్చేటిది కాదు. వేర్పాటు వాదం ఈ రేంజ్‌కి వచ్చేటిదీ కాదు. అంద్కని ఇంతకాలం సీమాంధ్ర వాల్ల చెవులల్ల పూలు పెట్టినంద్కు మీకు మా విభజనవాదులందరి దిక్కుకెల్లి థాంక్స్ చెప్తన్ననన్నా! నువ్వు ముందు ముందు కూడ గిట్లనే మా విభజనవాదులకి హెల్ప్ చేయన్నా. నువ్వు గిట్లనే మాకు హెల్ప్ చేస్తే మేం భీ నీకు హెల్ప్ చేస్తమన్నా. రేపు తెలంగాన వచ్చినంక హైదరాబాద్ల వున్న నీ ఆస్తుల జోలికి మేం రామన్నా. మనిద్దరిమధ్య ఈ ఒప్పందం కుదిరినట్టు ఎవలికీ చెప్పకన్నా.. ఇంకోపాలి థాంక్యూ లగడపాటి భయ్యా. ఇట్లు...
-విభజనవాది


.jpg)
.jpg)


