రామమందిరంపై లడ్డూ ప్రభావం!

తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం ప్రభావం అయోధ్య రామమందిరంపైనా పడింది. లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో  అయోధ్య బాల రాముడికి ఆలయ పూజారుల సమక్షంలో తయారు చేసిన ప్రసాదాలనే నైవేద్యంగా పెట్టాలని ఆలయ నిర్వాహకులు నిర్ణయించారు. ఈ మేరకు బయటి సంస్థలు తయారు చేసిన ప్రసాదాల నైవేద్యంపై నిషేధం విధించారు.  ఈ మేరకు ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ ఓ ప్రకటన విడుదల చేస్తూ, దేశ వ్యాప్తంగా అన్ని ఆలయాలలోనూ ఇదే పద్ధతి పాటించాలని డిమాండ్ చేశారు.  తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలపై దేశవ్యాప్తంగా భక్తులు, సాధుసన్యాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు.