కైఫోసిస్ వస్తే జీవితం దుర్భరం.....


కైఫోసిస్ విశ్లేషణ....
కైఫోసిస్ పుట్టిన పిల్లల నుండి వయస్సు మీద పడ్డ వారిని వేదించే సమస్య  కైఫోసిస్. కైఫో సిస్  వల్ల ప్రపంచ వ్యాప్తంగా ౦.౦4 నుండి 1౦% మంది స్చూలుకు వెళ్ళే పిల్లలు  దీనిబారిన పడుతున్నట్లు గణాంకాలు చెపుతున్నాయి. కాగా అమెరిక సంయుక్త  రాష్ట్రాలలో 5. 6 మిలియన్ల ప్రజలు కైపో సిస్,పురుషులను  చికాకు పెట్టిస్తుంది. సంవత్సరానికి 3 మిలియన్ల ప్రజలు బాల్యం లోను, లేదా వ్రుదాప్యం లోనో కైపోసిస్  బారిన పడుతున్నారు.కైఫోసిస్ వల్ల ఊపిరి తిరిగి రావడం,వారి జీవితం ఆరోగ్యం ఒకరి దయా దాక్షిణ్యా ల  పైన ఆధార పడి జీవించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఒక సామెత గుర్తుకు వస్తోంది మొక్కై వంగనిది మానై వంగునా అన్నట్లు  పుట్టుకతోనే కైపో సిస్ ను గుర్తించి వారి లోపాన్ని ప్రాధమిక స్థాయిలో  గుర్తిస్తే  పిల్లలు  వయాసు పెరిగి కౌమార దశకు చేరే సరికి కైఫోసిస్ వారిని దీర్ఘకాలిక సమస్యగా కాకుండా వారిని కాపాడుకోవచ్చుఅనేవిషయం స్పష్టం చేసేందుకు ఈ అంశాన్ని ఎంచుకున్నాము. సహజంగా నేడు పాట శాలకు వెళ్ళే పిల్లలలో కైపోసిస్ బారిన పడే అవకాసం ఉందని వైద్యులు  నిర్ధారించారు. ఉదాహరణకు పుట్టుకతోవచ్చిన కైపోసిస్ కన్నా కిలోలకొద్దీ బరువులు మోసే  పటశాల  పిల్లలు  ఆబరువును మోయలేకా నడుము వంగిపోయి దీర్ఘకాలంగా తీవ్ర ఇబ్బందులు  పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరించారు. ఈమేరకు ప్రతి పాట శాల లోని పిల్లలలో ఉన్న వివిదరాకల కైపోసిస్ ను గుర్తించడం వారికి సరైన చికిత్స అందించడం ద్వారా భావితరాన్ని కైఫోసిస్ బారిన పడకుండా ఉండేందుకు ఆరోగ్య సలహాలు సూచనలు ఇవ్వాల్సిన అవసరాన్ని గణాంకాలు సూచిస్తున్నాయి. 

భారాత్ లో కైఫోసిస్....

భారాత్ లో 2౦౦ 6-2౦12  మధ్యలో కైఫోసిస్ పై నిర్వహించిన సమాచారం  ఆందోళన కలిగిస్తుంది. భారాత్ లో పుట్టుకతోనే స్కలియో సిస్ సర్జరీ చేయించు కున్న 119 మంది    మెడికల్ రికార్డులను 
పరిశీలించారు. రేడియో గ్రాఫ్స్,ఎం ఆర్ ఐ స్కాన్ లో త్రో రాకో లంబార్ లో  వంపు చాలా సహజంగా వస్తుంది. త్రోరాకో లంబార్ వంపు ను 43.6 % రోగులను గుర్తించారు. స్కలియో సిస్ వల్ల వచ్చే వైకల్యం కైఫోసిస్26% రోగులలో, సరిగా పెరగక పోవడం సహజమే అయినా వెన్నెముక సరిగా లేని వారు51% రోగులు ఉన్నారు. వెన్నుపూస్ భాగంలోని ఎముకల వరుస సరిగా సహజంగా వంపు కలిగిన వారు 66.3% రోగులు ఉన్నట్లు గుర్తించారు. త్రోరాసిక్ స్పైన్ 63.2% ఇంట్రాన్సప్లనల్ ఎన్మిలిన్ 47% రోగులు,పుట్టుకతోనే వచ్చే వెన్నుపూస సరిగా లేకపోవడం వంటి ఇంట్రోస్పైనల్ అబ్నర్మాలిటీ సమస్యలు ఇంత్రాస్పైనల్ వర్టిబ్రా వెన్నెముక సమస్యలు ఉన్నవారు  48.2 % మంది .ని గుర్తించారు. సెగ్మెంటేషన్  మిక్సర్ డి ఫామి టిస్  ఎక్కువగా ఉన్నవారి శాతం 65% నుండి 87%సరిగా కనతువంటివి 34% వారిలో కైపోసిస్ డి ఫామిటి  ఉన్నవారి గణాంకాలు ఇవి. 

అసలు కైఫోసిస్ అంటే ఏమిటి ?....

కైఫోసిస్ అంటే వెన్నెముక పై భాగంలో కొంచం వగివంపు తిరిగి నట్లుగా ఉంటుంది. అది చాలా చిన్నవంపు కావచ్చు.సమాస్య తీవ్రతను బట్టి ఆ వంపు పెద్దదిగా ఉండచ్చు. ఏది ఏమైనా ప్రతి ఒక్కరికీ కొందరిలో వంపు సహజంగా ఉంటె ఇంకొందరిలో ఎక్కువ వంపు ఉంటుందని అంటున్నారు. దీనికారణం గానే మీ వెన్నెముక నిలకడగా ఉండదు. చాలా నొప్పిగా ఉంటుంది. మీరు ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా డాక్టర్ ను తప్పనిసరిగా చూడాల్సిందే.

డాక్టర్ల నిర్వచనం....

డాక్టర్లు దీనిని ఎక్సేసివ్ ఫార్వార్డ్ కర్వేచర్ కైపోసిస్ లేదా హైపెర్ కైపోసిస్ వెన్నెముకలో భంగిమ లు సరిగా లేకపోవడం గా  నిర్వచించారు. ఈ సమస్య నుండి బయట పడాలంటే కైపోసిస్ నిర్ధారణ చికిత్స పద్దతులను తెలుసుకుందాం.

కైఫోసిస్ లక్షణాలు....

కైఫోసిస్ ను ప్రాధమికంగా గుర్తించాలంటే వెన్నెముక వెనుక పై భాగంలో కొంచం వంపు తిరిగి ఉంటుంది. అలాగే భుజాలు గుండ్రంగా ముందుకు వస్తాయి.చాలా తక్కువ మందిలో వెన్నెముక పై భాగం పెద్దగా గుర్తించలేము అయితే ఆ వ్యక్తిని చూసినప్పుడు కొంచం ముందుకు వంగి ఉండడం గమనించవచ్చు.కైపోసిస్ ఏ లక్షణాలు లేకుండా కూడా వస్తుంది. అయితే దీప్రత్యేక మైన లక్షణాలు గుర్తించవచ్చు. ముఖ్యంగా తీవ్రమైన నొప్పి  ఎముకలలో దృడంగా లేదా స్తిఫ్ఫ్ గా ఉండడం. వీపు వెనుక భాగం గుండ్రంగా ఉండడం గమనించవచ్చు కొందరిలో  ,వెన్నుపూస  భాగం లో పగుళ్ళు.లేదా విరిగినట్లు గుర్తిస్తారు. హైపర్ కైపోసిస్ వేరే యాంగిల్ లో ఉండవచ్చు. కొందరిలో ఆ యాంగిల్ 3.8 డిగ్రీలు ఉండచ్చు.

కైఫోసిస్ కారణాలు- రకాలు....

మనకు తెలిసినంత వరకు వెన్నెముక ఎముకలతో ఏర్పడింది.వెన్నుపూస పై భాగం,కింది భాగం సరిగా నిర్మించాబదితేనే వెన్నెముక నిలబడి ఉంటుంది. ఎటువైపు అయినా తిరుగుతుంది. అంటే దీనిఆర్ధం స్పైన్ అంటే రక రకాల మార్పులు జరుగుతాయన్నది వాస్తవం. దీనివల్ల నష్టం జరుగుతుందని అర్ధం చేసుకోవచ్చు.

కైఫోసిస్ రకాలు...

వాస్తవానికి ఒక్కొకరిలో వారి వారి  శరీర ఆకృతిని బట్టి ఆధార పడి ఉంటుంది. ఒక్కొకరికి ఒక్కోరకమైన కైపోసిస్ ను గుర్తించవచ్చు.

భంగిమలలో వచ్చేది....

పోస్చరల్ కైపోసిస్  ఇది చాలా సహజమైన సమస్య,ఇది తరచుగా యుక్త వయస్సులో ఉన్న వాళ్ళలో ఎప్పుడైతే కండరాలు వెన్నెముక చుట్టూ, ఆయా పక్క ప్రాంతాలలో వేరువేరుగా వృద్ది   చెందుతూ  ఉంటుంది దీనికారణం గానే భంగిమ అంటే పో శ్చర్ లో సహజంగా  నిలబడలేదు.

స్లౌచింగ్.... ముందుకు వంగిపోవడం....

వెన్నుపూస  ముందుకు వంగి పోతూ ఉండడం, ఈకారణంగా వెన్నుపూసలోలేగిమెంట్స్ బలహీన పడడం వల్లే వెన్నెముక నిలబదేలేక పోవడం గమనించవచ్చు ఈకారణంగా ఎదో ఒక ఆధారం తో నిలబడాల్సిన పరిస్థికి చేరతారు.  దీనిని ప్రాధమిక స్థాయిలో గుర్తించగలిగితే తీవ్రత నుండి బయట పడవచ్చు. ముఖ్యంగా వయస్సు మళ్ళిన వాళ్ళలో వెన్నుపూస పాక్షికంగా,లేదా పూర్తిగా సాగి వంగిపోతూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం కండరాలు బలహీన పడడం కీలకమని చెప్పాలి.

స్చేవేర్మొన్న్స్ కైపోసిస్....

చికాకు వల్ల వచ్చే కైపోసిస్ ఇది ఎక్కువగా టీన్ ఏజ్ అంటే యుక్త వయస్సులో వచ్చే సమస్యగా డాక్టర్స్ గుర్తించారు.పోస్చరల్ కైపోసిస్ కన్నా చాలా తీవ్రంగా ఉంటుంది.అయితే దీనికి గల కారణాలు ఏమిటి అన్న డాక్టర్లు గుర్తించ లేదు. 

వయస్సు రీత్యా వచ్చే కైపోసిస్....

దీనికి కారణం వెన్నెముకలో వంపు ఉండడమే.వయస్సు పెరిగే కొద్దీ మార్పులు వస్తూ ఉంటాయి. వృద్ధాప్యం వచ్చేసరికి ఎముకల పై ముఖ్యంగా వెన్నెముకలో కండరాలు,ఎముకలు బలహీన పడడం వల్ల సహజంగా వచ్చే ఆస్టియో ప్రోరోసిస్ వల్ల ఎముకలు గుల్లబారి పోతాయి శక్తి క్షీణించి ఎముకల సాంద్రత తగ్గిపోతుంది. ఈ కారణంగానే వయస్సు మళ్ళిన వాళ్ళలో  వెన్నెముక కైపోసిస్ వస్తుంది.

పుట్టుకతోనే వచ్చే కైపోసిస్....

పుట్టుకకు ముందే వెన్నెముక సరిగా పెరగక పోవడం అంటే గర్భంలోనే బిడ్డ పెరుగుదల లో వెన్ను పూస సరిగా వృద్ధి కాక పోవడం గమనించవచ్చు.కైపోసిస్ తో పుట్టిన పిల్లలలో వయస్సు పెరిగే కొద్దీ అది మరింత తీవ్రంగా తయా రై ఇబ్బందికి గురిచేస్తుంది.

కైఫోసిస్ ఎవరికీ వస్తుంది?....

డాక్టర్స్ కు ఇప్పటికీ అర్ధం కాని విష యం ఏమిటి అంటే కొందరిలో కైపోసిస్ ఎందుకు వస్తుంది.?
కొందరిలో ఎందుకు రాదు? ఏది ఏ మైనప్పటికి పోస్చరల్ కైపోసిస్ చాలా సహజం అని పేర్కొన్నారు.ముఖ్యంగా  యుక్త వయస్సులో ఉన్న వారికి 4౦ సంవత్సరాలు పై బడిన వారికి. స్త్రీలలో కైపోసిస్ వస్తుంది.  స్త్రీలకంటే ముందుగా పురుషులలో కైపోసిస్ చాలా సహజంగావచ్చె అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే పురుషులు ఎదుర్కుంటున్నారని డాక్టర్స్ చాలా కేసులను 13 సంవత్సరాల నుండి 16 సంవత్సరాల వయస్సులో ఉన్నవారికి వస్తున్నట్లు గుర్తించారు. ఆస్టియో ప్రోరోసిస్ ఉన్నవారిలో వయస్సు సంబంధిత కైపోసిస్ వృద్ధులలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్త్రీల లో మేనోపాజ్ స్టేజి తరువాత సహజంగా వీరిలో  ఈస్ట్రో జన్ శాతం తక్కువగా ఉన్నవారిలో కైపో సిస్ వస్తుందని నిర్దారించ్గారు. 

కైఫోసిస్ ను ఎలానిర్దారిస్తారు ?....

వైద్యులు శారీరక పరీక్ష ద్వారా కైపోసిస్ ను గుర్తిస్తారు. కొన్ని రకాల వ్యాయామాల ద్వారా అసలు శరీరం తీరు తెన్నులు వెన్నుపూస నిటారుగా ఉందా లేదా, కొన్ని రకాల భంగిలలో వెన్నెముక సహక రిస్తున్న తీరు,మరో పరీక్షలో నేలపై పడుకోపెట్టి వెన్నెముక లో ఎలాంటి వంపులు ఉన్నాయి వాటి శాతం ఏమిటి ప్రస్తుతం ఉన్న స్థితి భవిష్యత్తులో దాని పనితీరును సైతం అంచనా వేస్తారు.కైపోసిస్ లేదా నిర్మాణం లోపాలు,ఉన్నాయా సాధారణం గా ఉందా లేదా అన్న విష యం గమనిస్తారు. దీనికోసం అవసరమైన పక్షంలో ఎక్స్ రే, లేదా ఎం ఆర్ ఐ స్కాన్ ద్వారా వెన్నెముక స్వరూపం ఎలా ఉందొ గుర్తించి తీవ్రత ఎక్కువగా ఉన్న కేసులలో రక్త పరీక్షలు అంటే లంగ్ ఫంక్షన్ నిర్ధారణ పరీక్షలు, చేస్తారు.

కైఫోసిస్ కు చికిత్సలు....

ఏ రకమైన కైపోసిస్ తో బాధపడుతున్నారో నిర్ధారించి న తరువాతే చికిత్స ఆధార పడి  ఉంటుంది. కైపోసిస్ దాని తీవ్రత ఆధారంగా అలాగే వెన్ను పూస వెన్నెముకలో వంకర తిరిగి ఉండడం.ఆధారంగా చికిత్స చేయాల్సి ఉంటుంది. 

కైఫోసిస్ కు సర్జరీ లేని చికిత్స....

ప్రతి ఒక్క వ్యక్తికి ఆయా కైపోసిస్  లక్ష నాలు,తీవ్రత ఆధారంగా చికిత్స నిర్ధారిస్తారు. కొందరిలో సాధారణంగా,సహాజంగా వచ్చే కైపోసిస్, వయస్సు రీత్యా వారి వెన్నుపూస లో వచ్చిన మార్పులు 
ఆధారంగా చికాకు కలిగించే కైపోసిస్ ఉంటె లేదా వెన్నుపూసలో వంపు ఇతర లక్షణాలకు సంబంధం లేకుంటే అప్పుడు చికిత్స అవసరం లేదని నిర్ధారిస్తారు. 

పరిశీలన....

కైఫోసిస్ ఎంత తక్కువ ఉంటె వెన్నులో లేదా వెన్నెముక వంపులో మార్పులు ఉంటె డాక్టర్స్ కొన్నాళ్ళు నిశితంగా గమనిస్తారు.ఒకవేళ వెన్నుపూస వంపు ఇతర లక్షణాలకు సంబంధం లేకుంటే  అప్పుడు చికిత్స అవసరం లేదని నిర్ధారిస్తారు. 

ఫిజియో తెరఫి చికిత్స....

వెన్నెముక పై భాగం లో ఉన్న ప్రాధాన కండరం పై ఫిజియో తెరఫి చేయడం ద్వారా ఆయా భంగిమలలో ఉన్న సమస్యను సరిచేస్తూ భంగిమను అభివృ ధీ చేసే ప్రయత్నం  చేస్తారు.

బ్రేసింగ్ పద్దతిలో చికిత్స....

కొంతమందిలో కైపోసిస్  చికాకు కలిగిస్తుంది. ఈ సమస్యకు బ్రేసింగ్ చికిత్స అంటే స్పైన్ బ్రేసింగ్ కు సూచించవచ్చు. ఒక్కోసారి స్పైన్ పెరుగుతూ ఉండవచ్చు. స్పైనల్ బ్రేసింగ్ వేన్నేముక వెనుక భాగం సహకరించ వచ్చు.ఒక్కోసారి వేరే రకంగా దాని స్థానం మారి పోవచ్చు. దీనివల్ల వంపు మరింత పెరిగే అవకాశమూ ఉండవచ్చు. 

కైఫోసిస్ కు అండర్ ల్యింగ్ చికిత్స....

వయస్సు మళ్ళిన వాళ్ళు ఆస్టియో ప్రోరోసిస్ లేదా ఇతర పరిస్థితుల వల్ల వెన్నుపూస వెన్నెముక బలహీన పడి అది దాని ఆకారం మార్పు చెంది ఉండవచ్చు. దీనిని అండర్ ల్యింగ్ డి జార్దర్ గా నిర్ధారించి దాని వృదిని జరగ కుండా వెన్నుపూస వంపు గుర్తించిన వెంటనే చికిత్స చేయవచ్చు.బరువును మోయగలిగే శారీరక వ్యాయామం స్త్రీలకు హార్మోన్ తెరఫీ సూచించవచ్చు.

శస్త్ర చికిత్సలు.....

ఎవరైతే పుట్టుకతోనే కైపోసిస్, లేదా కైపోసిస్ తో చికాకుకు గురిఅవుతున్నారో, వారికి చికిత్స వల్ల లాభం కలగవచ్చు.శాస్త్రచికిత్స లక్ష్యం వెన్నెముక లో ఉన్న వంపును తగ్గించడమే. కైపోసిస్ వల్ల నొప్పి ఉంటె ఉపసమనం  ఇవి కీలక మైన సర్జరీలు సహజంగా డాక్టర్లు మొగ్గు చూపుతారు. లేదా సందర్భాన్ని బట్టి మొగ్గుచూపక పోవచ్చు. అసలు సర్జరీ సద్ధ్యా అసాధ్యాలు పూర్తిగా పరిశీలించి ఎక్కడ ఎలా సాధ్యమౌతుందో నిర్ధారించుకుని సర్జరీని సూచిస్తారు.

కైఫోసిస్ వల్ల సమస్యలు.....

కైఫోసిస్ వల్ల కొన్నిరకాల సమస్యలు తీవ్రంగా ఉండవచ్చు. వెనుకభాగం లో వెన్నుపూసలో వంపు వ్యతిరేక ధోరణి ఉండవచ్చు. అదేపనిగా వెన్నులో వీపు నొప్పి రావచ్చు ఇది భరించరానిదిగాను ఉండవచ్చు. వెన్నెముకలో ఉన్న వంపు వల్ల శ్వాస సమస్యలు తలెత్తవచ్చు. గుండెకు సంబందించిన సమాస్యలు ఇబ్బంది పెట్టవచ్చు., కైపోసిస్ వల్ల వచ్చినా వైకల్యం జీవన ప్రామాణ స్థాయి పై పడుతుంది.జీవించాలన్న ఆత్మవిశ్వాసం  తగ్గిపోతుంది. ఒక్కోసారి సర్జరీ చేసిన తరువాత కూడా ఒక్కోసారి వికటించవచ్చు. శాస్త్రచికిత్స తరువాత ఇన్ఫెక్షన్ రాకుండా జాగ్రత్త పడాలి. సర్జరీ జరిగిన ప్రాంతంలో రక్త స్రావం వంటి సమస్యలు రావచ్చు.

కైపోసిస్ కు ప్రాధాన కారణం స్పైనల్ కార్డ్ నొక్కుకు పోవచ్చు. కాలికి సంబందించిన నరాలు,శరీరం కింది భాగం బలహీన పడి, చేతులు,కాళ్ళు, తిమ్మిరిగా ఉండవచ్చు. బ్లాడర్ కంట్రోల్ లో ఉండక పోవడం. వెన్నెముక స్థిరంగా ఉండక పోవడం. ఈ రకమైన లక్షణాలు ఎవరికైనా ఉంటె వెన్నుపూసలో వంపు ఉంటె వైద్యం పై దృష్టి పెట్టాలి.లేదా మీ స్థితిని బట్టి డాక్టర్ సర్జరీ సూచించవచ్చు. లేదా స్పెషల్ కంప్రెషన్ చికిత్స తీసుకోవాలి పుట్టుకతోనే వచ్చే కైపోసిస్ వయస్సువల్ల వచ్చే కైపోసిస్ నుండి బయట పద్దలంటే నిపుణులైన సమర్ధులైన వైద్యుల సూచనలు పాటించండి వైకల్యం బారిన పడకండి.