గోరంట్ల కు స్వాగతం ప‌లికిన కురుబ సంఘం

యుద్ధ‌భూమినుంచి విజేత‌లై వ‌చ్చేవారికి అధికా రులు, ప్ర‌జ‌లు వేయిక‌ళ్ల‌తో ఎదురు చూస్తారు, మ‌హాఘ‌న‌త సాధించిన‌వారిని స‌త్క‌రించ‌డానికి వేచి ఉంటారు. కానీ మ‌న దేశంలో ఎప్పుడైనా ఎవ‌రికోస‌మైనా స్వాగ‌తం ప‌ల‌క‌డానికి సిద్ధంగా ఉంటార‌న్న‌ది గోరంట్ల విష‌యంలోనే బ‌య‌ట‌ ప‌డింది. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్ వీడియో లోక‌మంతా చూసి నిర్ధారించిన త‌ర్వాత కూడా ఇంకా దానిపై విచార‌ణ జ‌ర‌గాలి, త్వ‌ర‌ప‌డి ఆయ‌న‌ మీద యాక్ష‌న్ తీసుకోలేమ‌ని జ‌గ‌న్ స‌ర్కార్ మీన‌మేషాలు లెక్క‌వేస్తోంది. ఇది కేవ‌లం కాల‌ యాప‌న మార్గ‌మేన‌ని విశ్లేష‌కులు అంటున్నారు. వీడియోలో గోరంట్ల మాధవ్‌ పూర్తి నగ్నంగా కనిపించారు. మహిళతో మాట్లాడుతూ అసభ్య చేష్టలకు పాల్పడ్డారు. ఈ దూమారానికి తాత్కాలి కంగా తెర పడిన తర్వాత ఆయన హిందూ పురానికి వస్తున్నారు. 

పుల్లూరు టోల్‌ప్లాజా దగ్గర ఎంపీ గోరంట్ల మాధవ్‌కు కురుబ సంఘం నేతలు స్వాగతం పలికారు. ఈ  జిల్లాకు వస్తున మాధవ్‌కు కురుబ సంఘం నేతలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాధవ్ మీడియాతో మాట్లాడుతూ ఫేక్ వీడియోపై దుష్ప్రచారం సరి కాదన్నారు. పోలీసులను స్వతంత్రంగా దర్యాప్తు చేయించాలన్నారు. బీసీలను అనగదొక్కేందుకే తనపై దుష్ప్రచారం చేస్తు న్నా రని గోరంట్ల  విమర్శించారు. 

గోరంట్ల మాధవ్‌ నగ్న వీడియో ఒక ఫోన్లో ప్లే అవుతుండగా మరో ఫోన్‌ ద్వారా రికార్డు చేశారని... సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నది అదే కాబట్టి, దానిని ఒరిజినల్‌ అనలేమని పోలీసులు తేల్చేశారు. మాధవ్‌ ‘ఊహించిన విధంగానే’ భారీ ఊరట కల్పించారు. ‘ఆ వీడియో ఒరిజినల్‌ కాదని ఎస్పీ చెప్పేశారు’ అంటూ గోరంట్ల మాధవ్‌ కూడా తనకు క్లీన్‌చిట్‌ వచ్చేసినట్లుగా ప్ర‌చారం చేయించుకున్నారు. కానీ, ఇదంతా ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా పోలీసులు చేసిన‌ నిర్వాక‌మ‌ని రాజ కీయ విశ్లేషకులు, ఫోరెన్సిక్‌ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

గోరంట్ల మాధవ్‌ గతంలో పోలీసు శాఖలో పని చేశారు. 1998లో ఆయన ఎస్‌ఐగా ఉద్యోగంలో చేరారు. కడప జిల్లాలో ఐదేళ్లు పని చేశారు. అప్పట్లో వ్యక్తిగత ఆరోపణలు రావడంతో ఆయనను అనంతపురం జిల్లాకు బదిలీ చేశారు. ఆ తర్వాత సీఐగా పదోన్నతి పొంది... అనంతపురం, కదిరిలో పని చేశారు.  కదిరి సీఐగా పనిచేసినపుడే గోరంట్ల మాధవ్‌పై ‘రాసలీల’ ఆరోపణలు వెల్లు వెత్తా యి. ఎంపీ అయిన తర్వాత కూడా అవి కొనసాగాయి. నోట్ల రద్దు సమయంలో అనంతపురంలో బ్యాంకు వద్ద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని విచక్షణారహితంగా కొట్టి సస్పెన్షన్‌కు గురయ్యారు. ఎన్నికల ముందు టీడీపీ నేత జేసీ దివాకర్‌రెడ్డిపై మీసాలు దువ్వి సవాలు విసిరిన గోరంట్ల.. వైసీపీ దృష్టిని ఆకర్షించారు. ఎంపీ టికెట్‌ పొందారు.