అమూల్ బేబీలా నువ్వు కూడా ఏంటి కేటీఆర్...

 

సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఎవరి అభిప్రాయాలను వారు పంచుకునే స్వాతంత్ర్యం వచ్చింది. ఏం జరిగినా.. జరుగుతున్నా ఒక్క సోషల్ మీడియాను ఫాలో అయితే చాలు...అన్ని విషయాలు తెలిసినట్టే. కంటెంట్ కాస్త వెరైటీగా ఉండాలే కానీ... చూడటానికి జనాలు రెడీగా ఉన్నారు. అయితే ఇది ఒక్కోసారి వర్కవుట్ అవుతుంది.. కానీ.. కొన్ని సార్లు మాత్రం బుక్కవ్వాల్సి వస్తుంది. ఇలాంటి విషయాల్లో సామాన్యుల సంగతేమో కానీ.. కాస్త ప్రముఖులు, రాజకీయ నేతలు లాంటి వాళ్లయితే చాలా కష్టం. వారిని బద్నాం చేస్తారు నెటిజన్లు. ఇప్పుడు అలాగే బుక్కయ్యాడు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్.

 

నిన్న గురజాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే కదా. ఇక కౌంటింగ్ మొదలైన దగ్గర నుండి అందరూ టెన్షన్ తోనే గడిపారు. క్షణక్షణానికి ఫలితాలు మారుతూ చెమటలు పట్టించాయి. ఇక ఈ ఎన్నికల ఫలితాలపై.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కేటీఆర్ ఓ ట్వీట్ చేశాడు. గుజరాత్ ఎన్నికల ఫలితాలకు సంబందించి టీవీల్లో వస్తున్న న్యూస్ పై.. గుజరాత్.. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు తనను కన్ప్యూజ్ అయ్యేలా చేస్తున్నాయని ఓ ట్వీట్ ట్వీటారు.  ఏ ప్రాంతంలో ఎవరు ముందంజలో ఉన్నారో.. ఎవరు వెనుకంజలో ఉన్నారో తనకు అస్సలు అర్థం కావటం లేదన్నారు. అంతే.. ఆయన చేసిన ట్వీట్ పెద్ద కామెడీగా మారింది నెటిజన్లకు. కేటీఆర్ ట్వీట్ కు స్పందించిన కొందరు టీవీని స్విచాఫ్ చేయాలని అన్నారు. ఇంకా.. అన్నింటిని వదిలేసి ఈసీ ఫలితాల్ని ఫాలో కావాలన్నారు. ఎందుకు.. గంట.. రెండు గంటలు ఏదైనా పనిలో బిజీగా ఉంటే సరిపోతుంది కదా? అని మరికొందరు ఇలా కేటీఆర్ ట్వీట్ కు పంచ్ ల మీద పంచ్ లో వేశారు.

 

నిజానికి ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో... ప్రజలు ఎవరిని అధికారంలో కూర్చోబెడతారో ఊహించడం చాలా కష్టం. ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవ్వడం చాలా చూశాం. అలాంటిది.. ఎన్నికల ఫలితాలప్పుడు ఇలాంటి కన్ఫ్యూజన్, టెన్షన్ అందరికీ ఉంటుంది. ఎందుకంటే.. రిజల్ట్ విడుదలయ్యే వేళ.. ఒక్కో మీడియా ఒక్కో అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుంటుంది. ఎవరి స్టైల్ వారిదే. కొందరు ఈసీ అధికారికంగా వెల్లడించిన సమాచారాన్ని మాత్రమే టెలికాస్ట్ చేస్తుంటారు.  ఇంకొంకదు ఇంకోలా. ఇలాంటి విషయాలన్నీ మీడియాలోని వారికి.. కేటీఆర్ లాంటి అన్ని తెలిసిన నేతలకు బాగా తెలిసిన విషయాలు. ఇన్ని తెలిసిన తర్వాత కూడా అమాయకంగా అమూల్ బేబీ మాదిరి గుజరాత్ ఫలితాలు కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయంటూ పోస్ట్ పెట్టటం చాలా కామెడీగా ఉందంటున్నారు. మొత్తానికి మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ ఫ్యూచర్ లీడర్ గా తన ఇమేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్న కేటీఆర్... ఏదో కాసేపు సైలెంట్ గా ఉంటే సరిపోయేది. అలాకాకుండా.... ఇలాంటి ట్వీట్లు చేస్తే ఇలానే రియాక్ట్ అవుతారు. ఇది కేటీఆర్ కూడా అర్ధమయ్యే ఉంటుంది.