Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జీఈఎస్ సాక్షిగా కేటీఆర్ కు అవమానం...
posted on: Nov 30, 2017 5:02PM

హైదరాబాద్ లో రెండు రోజుల పాటు జీఈఎస్ సమ్మిట్ జరిగిన సంగతి తెలిసిందే కదా. రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ ట్రంప్ కూడా రావడంతో ప్రత్యేకత చోటుచేసుకుంది. ఇక ఇవాంక వస్తున్నందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం చేసిన హడావుడి అంతా ఇంతాకాదు. ఆమె కోసం దాదాపు వంద కోట్లుపైనే ఖర్చు చేశారు. హైదరాబాద్ ను ముస్తాబు చేశారు. బెగ్గర్స్ ఫ్రీ చేశారు. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రకరకాల వంటకాలు తయారు చేయించారు. మొత్తానికి ఇవాంకాకు ఎలాంటి లోటు రాకుండా చేశారు. ఇక ఇవాంక కూడా వచ్చింది.. సమ్మిట్ లో పాల్గొంది.. ఆడవారి గురించి గొప్పగా మాట్లాడింది. ఇక మోడీ, కేసీఆర్, కేటీఆర్ కూడా ఆడవారి గురించి గొప్పగా చెప్పుకొచ్చారు.
ఇక్కడి వరకూ బాగానే ఉన్నా... ఈ సదస్సులో భాగంగా కేసీఆర్ ప్రభుత్వానికి మాత్రం... అవమానం జరిగినంత పనైంది. అదేంటంటే.. ఆడవారి సామర్థ్యాన్ని, మహిళా సాధికారత పై పెద్ద ఉపన్యాసం చేస్తున్న కేటీఆర్ ఒక్కసారిగా షాక్ తగిలింది. ఎందుకంటే... జీఈఎస్ లో మీ ప్రభుత్వంలో మహిళా మంత్రి ఎందుకు లేరు అనే ప్రశ్న ఎదురైంది....ఈ ప్రశ్నకు కేటీఆర్ కంగుతిన్నారు. మా ప్రభుత్వంలో మహిళా ఎమ్మెల్యేలు లేరు.. దానిపైన ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని ఏదో కవరింగ్ ఇచ్చారు. అయితే ఈ సమాధానం అంత సంతృప్తికరంగా లేదు అని కేటీఆర్ కు కూడా తెలుసు. దీంతో మరి ఇప్పుడైనా కేసీఆర్ దీనిపై ఆలోచిస్తే మంచిది అని అనుకుంటున్నారు. ఎలక్షన్స్ కేవలం ఏడాదిన్నర మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే మరో కాబినెట్ విస్తరణ ఉండకపోవచ్చు అనే ఇండికేషన్ ఇచ్చారు ముఖ్యమంత్రి. ఎన్నికల దగ్గరలో క్యాబినెట్ విస్తరణ అంత తేలిక కాదు కూడా. అయితే ఈ విమర్శను కరెక్ట్ చేసుకుని ఎన్నికలకు వెళ్తే మంచిదే. చూద్దాం మరి కేసీఆర్ దీనిపై ఏం యాక్షన్ తీసుకుంటారో...






