ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ టాప్ 5లో కోహ్లీ, రోహిత్, గిల్

posted on: Mar 21, 2026 6:46AM

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో టీమ్ ఇండియా ఆటగాళ్లు సత్తా చాటారు.  ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ 5లో ముగ్గురు టీమ్ ఇండియా బ్యాటర్లు స్థానం సంపాదించుకుని ఆధిపత్యాన్ని చాటారు.   ప్రపంచంలోని అత్యుత్తమ ఐదుగురు వన్డే బ్యాటర్ల జాబితాలో  స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ  రెండో స్థానంలో నిలవగా, కెప్టెన్ రోహిత్ శర్మ, యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కూడా టాప్-5లో నిలిచారు. 

ప్రస్తుత ర్యాంకింగ్స్ ప్రకారం, న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ వరుసగా నాలుగు, ఐదు స్థానాలలో నిలిచారు.  ఇక టీమ్ ఇండియా అయితే ఇటు వన్డే, అటు టి20లలో వరల్డ్ నంబర్ వన్ గా ఉంది.  ఇక బౌలింగ్ విభాగంలో టీమ్ ఇండియా స్టార్ స్పిన్నర్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ టాప్ 10లో స్థానం సంపాదించుకున్నాడు. ఐసీసీ ర్యాంకింగ్ లలో కులదీప్ యాదవ్ బౌలింగ్ విభాగంలో  ఎనిమిదో స్థానంలో నిలిచి.. టాప్ 10లో చోటు దక్కించుకున్న ఏకైన టీమ్ ఇండియా బౌలర్ గా నిలిచాడు.  ఈ జాబితాలో  బంగ్లాదేశ్ కెప్టెన్ మెహిదీ హసన్ మిరాజ్   ఏడో ర్యాంకును కైవసం చేసుకున్నాడు. ఆల్ రౌండర్ల జాబితాలోనూ మిరాజ్ రెండో స్థానంలో ఉన్నాడు. ఆల్ రౌండ్ క్యాటగిరీలో టీమ్ ఇండియా ప్లేయర్   అక్షర్ పటేల్ పదో స్థానం దక్కించుకున్నాడు. 

ఇక టీ20 ఫార్మాట్ విషయానికి వస్తే.. బౌలింగ్ విభాగంలో  భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా  టాప్ 5లోనిలిచాడు.  ఈ విభాగంలో టీమ్ ఇండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి టాప్ 2గా ఉన్నాడు.   ఇక బ్యాటింగ్ విషయంలోకి వస్తే..   యంగ్ సెన్సేషన్స్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వరుసగా మొదటి రెండు స్థానాల్లో నిలిచారు.   తిలక్ వర్మ ఆరో స్థానం దక్కించుకున్నాడు.  టి20 వరల్డ్ కప్ లో టీమ్ ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించిన సంజు శాంసన్ 21వ ర్యాంకు దక్కించుకున్నాడు.

ఇక టెస్టు  క్రికెట్‌లో టీమిండియా  నాలుగో స్థానంలో ఉంది.   వరల్డ్ కప్ సన్నాహాల దిశగా టీమిండియా సరైన మార్గంలోనే పయనిస్తోందని ఈ ర్యాంకింగ్స్ నిరూపిస్తున్నాయి. రాబోయే మ్యాచుల్లో విరాట్ కోహ్లీ అగ్రస్థానాన్ని చేరుకోవాలని, బుమ్రా మరిన్ని వికెట్లతో బౌలింగ్‌లో నంబర్ వన్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...