పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు ఏవి?

పిల్లలు కొందరు ఆరోగ్యంగా పుడితే ఇం కొందరు ఎదో ఒక వైకల్యం తో పుడతారు.
వాటిలో ముఖ్య మైనది కాంజేనిటల్ హార్ట్ డిసీజ్ అంటారు.
అంటే గుండె కవాతలకు వచ్చే జబ్బు. కోరోనరీ ధామానికి వచ్చే జబ్బు. మెడికల్ ట్రీట్మెంట్ కోసం గాని,సర్జరీ కోసం గాని డాక్టర్ల వద్దకు వచ్చే రోగుల ను గమనించినప్పుడు పుట్టుకతో వచ్చే గుండె జబ్బులకు సంబందించిన వాళ్ళు 25% ఉంటె గుండె కవాటాల రోగులు 35%ఇతర కోరోనరీ ధామానికి సంబందించిన వాళ్ళూ ఉండడం గమనించ వచ్చు. పుట్టుకతో వచ్చే గుందేలోపాలకు అంతగా తెలీదు.పూర్వ కాలంలో అవి వారసత్వంగా  వచ్చే జబ్బుగా అనుకునే వాళ్ళు.అది సరైన అభిప్రాయం కాదని,బహుశా గర్భంలో ఉండగా ఇన్ఫెక్షన్ కావడం వల్ల,,లేదా మేనరికపు వివాహాల వల్ల కావచ్చనేది మరో అభిప్రాయం. లేదా గర్భంలో ఉండే లోపాలు సరిగా ఎదుగుదల లేకపోవడం వంటిలోపాల మూలంగా కావచ్చునని  అభిప్రాయ పడ్డారు.
వైద్యులు శాస్త్రజ్ఞులు చేపుతునా ఆమ్సాల ప్రాతిపదికన ఏ ఇన్ఫెక్షన్ మూలంగా నైనా సరే శరీరంలో  లోపల యన్టీ బాడీ తయారైతే అది గుండెను కూడా డ్యామేజ్ చేస్తుంది.అన్డుజే గొంతు ఇన్ఫెక్షన్  ను నిర్లక్ష్యం చేయవద్దు అంటున్నారు వైద్యులు. గుందేకవాటాల జబ్బులో 9౦ %రుమాటిక్ గుండె జబ్బులే ఇవి ఎక్కువగా  గొంతు ఇన్ఫెక్షన్ కావటం మూలంగా వస్తాయని నిపుణుల అంచనా. గొంతు మాటిమాటికీ ఇన్ఫెక్షన్ కు గురి అవుతుంటే ఆక్రమంలో కొన్నాళ్ళకి గుండె తీవ్రంగా దెబ్బతినే అవకాసం ఉంది. ఈ సమస్య ముఖ్యంగా మధ్య తరగతి,కింది మధ్య తరగతి కుటుంబాల వాళ్ళుఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. కీళ్ళ నొప్పులు జ్వరం ఇన్ఫెక్షన్ కూడా ఈ వ్యాధిని కలగ జేసే అవకాసం ఉంది. కోరోనరీ ధమనికి వచ్చే వ్యాధుల గురించి మరింత వివరంగా చూద్దాం.