కామారెడ్డి ఘటనలో ముగ్గురు దుర్మరణానికి కారణం ఇదే...

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కామారెడ్డి జిల్లా అడ్లూర్ ఎల్లారెడ్డిలోని పెద్ద చెరువులో ముగ్గురు దుర్మరణానికి మిస్టరీ వీడింది.  బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.  ముగ్గురు మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ , ఎస్ఐ సాయికుమార్ మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. మాట్లాడుకోవడానికి వీరు చెరువు వద్దకు చేరుకున్నారు.  ముగ్గురి మధ్య మాటామాటా  పెరగడంతో శృతి చెరువులోకి దూకేసింది. ఆమెను కాపాడటానికి నిఖిల్ దూకేసాడు. వీరిద్దరికి ఈత రాదు. వీరిని కాపాడటానికి ఎస్ ఐ సాయికుమార్ చెరువులో దూకాడు. ఈత రాకపోవడంతో సాయికుమార్ నీటిలో మునిగిపోయాడు. శృతి ఆత్మహత్య చేసుకుంటే నిఖిల్ , సాయికుమార్ రక్షించే క్రమంలో మునిగిపోయారు.   
Publish Date: Dec 28, 2024 3:50PM

ఈ నెల 30న  తెలంగాణ కేబినెట్ భేటీ

ఈ నెల 30 తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రదానకార్యదర్శి  శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయ వేదికగా భేటీ జరుగనుంది. రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులపై ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరుగనుంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో మిగిలిపోయిన హామీలపై  ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. సంక్రాంతి నుంచి అమలు చేయనున్న రైతు భరోసాపై చర్చించనున్నారు. ఏడాదికి  ఎకరానికి 15 వేలు భూమిలేని రైతుకు 12 వేల రూపాయలు ఈ పథకం క్రింద ఇవ్వనున్నారు.సంక్రాంతి నుంచి ఈ పథకం అమలు చేయనున్నారు.  
Publish Date: Dec 28, 2024 2:01PM

మన్మోహన్ అంత్యక్రియలకు కేసీఆర్ డుమ్మా.. కారణమేంటంటే?

రాజకీయ నాయకులలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ది ఓ ప్రత్యేక శైలి. అవసరార్ధం ఆయన ఎంతకైనా తెగిస్తారు.. ఎంతకైనా దిగజారుతారని రాజకీయవర్గాలలో ఎప్పుడూ చర్చ జరుగుతూ ఉంటుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన ఒక సారి కాంగ్రెస్ తో జట్టు కట్టారు. ఆ తరువాత తెలుగుదేశం, బీజేపీలతో పొత్తు పెట్టుకున్నారు. ఇదేమిటని అడిగిన వారికి తన లక్ష్యం తెలంగాణ సాధన.. ఆ లక్ష్య సాధన కోసం అవసరమైతే బొంత పురుగును కూడా ముద్దెట్టుకుంటా అని సమాధానం ఇచ్చారు. సరే సుదీర్ఘంగా ఆయన నాయకత్వంలో కొనసాగిన తెలంగాణ ఉద్యమ ఫలితమైతేనేం, కాంగ్రెస్ తన రాజకీయ లబ్ధి కోసమైతేనేం తెలంగాణ సాకారమైంది. ఇది జరిగి పదేళ్లు దాటింది.  తెలంగాణ సాకారమైన సమయంలో కేసీఆర్ సకుటుంబ  సపరివార సమేతంగా అప్పటి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిసి కృతజ్ణతలు తెలిపి మరీ వచ్చారు. అంతకు ముందు తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని కూడా అన్నారు. అయితే తెలంగాణ ఆవిర్బావం తరువాత వరుసగా పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న కేటీఆర్.. ఆ సమయంలో  కాంగ్రెస్ ను రాష్ట్రంలో నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా పావులు కదిపారు. సరే ఇక ప్రస్తుతానికి వస్తే.. ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్న సహయంలోనే  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ ఏర్పాటుకు అప్పటి ప్రధాని మన్మోహన్: నేతృత్వంలోనే కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అంటే తెలంగాణ ఆవిర్భావానికి ప్రధాని మన్మోహన్ సింగ్ కారణం. ఈ విషయాన్ని కేసీఆర్ స్వయంగా చెప్పారు. మన్మోహన్ మృతికి సంతాపం తెలుపుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ అందించిన సహకారాన్ని తెలంగాణ సమాజం ఎన్నటికీ మరచిపోదని పేర్కొన్న కేసీఆర్ మన్మోహన్ అంత్యక్రియలకు మాత్రం హాజరు కాలేదు. తనకు బదులుగా తన కుమారుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి అయిన కేటీఆర్ నేతృత్వంలోని ఒక బృందాన్ని పంపారు. దీనిపై బీఆర్ఎస్ వర్గాలు సహా రాజకీయ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మన్మోహన్ అంత్యక్రియలకు కేసీఆర్ స్వయంగా హాజరై ఉండాల్సిందన్న భావనే సర్వత్రా వ్యక్తం అవుతోంది.  అయితే కేసీఆర్ సీతయ్య లాంటి వారు. ఎవరి మాటా వినరు. తనకు ఏది తోస్తే అదే చేస్తారు. గత ఏడాది ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ పరాజయం పాలై అధికారాన్ని కోల్పోయిన నాటి నుంచీ కేసీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారనే చెప్పాలి. అలాగని పూర్తిగా రాజకీయ సన్యాసం చేయలేదు. తాను కలవాలనుకున్నప్పుడల్లా పార్టీ నేతలను ఫామ్ హౌస్ కు పిలిపించుకుని గంటల తరబడి మంతనాలు జరుపుతున్నారు. ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావ సమయానికి ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు  కేసీఆర్ గైర్హాజర్ కావడం ఏ మాత్రం హుందాగా లేదని రాజకీయవర్గాలు అంటున్నాయి. పరాజయంతో ముఖం చెల్లకుండా ఫామ్ హౌస్ కు పరిమితమైన కేసీఆర్.. మన్మోహన్ అంత్యక్రియలకు సైతం దూరంగా ఉండటానికి కారణం ముఖ్యమంత్రి హోదాలో  ఉన్న రేవంత్ ను ఫేస్ చేయడానికి ఇష్టపడకపోవడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే తాను సీఎంగా ఉండగా ప్రొటోకాల్ ను సైతం ధిక్కరించి ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనలకు వచ్చిన సమయంలో ఆయనకు స్వాగతం పలకలేదు. ఆ విషయాన్ని కూడా గుర్తు చేస్తూ పరిశీలకులు ఇప్పుడు మోడీకి ఎదురుపడి అవమానపడటం కంటే దూరంగా ఉండటమే మేలని కేసీఆర్ భావించి ఉంటారని అంటున్నారు. మొత్తం మీద మన్మోహన్ అంత్యక్రియలకు కేసీఆర్ గైర్హాజర్ కావడం ఆయన ప్రతిష్టను మరింత మసకబార్చిందని అంటున్నారు.  
Publish Date: Dec 28, 2024 1:54PM

వైసీపీకి మాజీ ఐఏఎస్ ఇంతియాజ్ అహ్మద్ రాజీనామా

మాజీ ఐఏఎస్ అధికారి  ఇంతియాజ్ అహ్మద్ వైసీపీకి రాజీనామా చేశారు. కన్ ఫర్డ్ ఐఏఎస్ అయిన ఇంతియాజ్ అహ్మద్ గత ఎన్నికలకు ముందు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వైసీపీ తీర్థం పుచ్చుకుని మరీ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికలలో ఆయన ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు.  తొలి నుంచీ వైఎస్ కుటుంబానికి విధేయుడిగా ముద్రపడిన ఇంతియాజ్ అహ్మద్   వైసీపీ హయాంలో   కీలక జిల్లాలకు కలెక్టర్ గా పని చేశారు. ప్రభుత్వంలో అన్నీ తానే అన్నట్లుగా వ్యవహరించారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్ కూడా ఇంతియాజ్ అహ్మద్ కు ఎక్కడ లేని ప్రాధాన్యతా ఇచ్చే వారు. అటువంటి ఇంతియాజ్ అహ్మద్ తనకు ఎన్నికలలో పోటీ చేయాలని ఉందన్న ఆసక్తి కనబరచగానే జగన్ ఓకే అనేశారు. అంతే ఆఘమేఘాల మీద  వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వైసీపీ గూటికి చేరిపోయారు. కర్నూలు, లేదా నంద్యాల నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావించారు. అయితే చివరకు జగన్ ఆయనకు సిట్టింగ్ ఎమ్మెల్యేను కూడా పక్కన పెట్టి కర్నూలు నుంచి పోటీ చేయడానికి అవకాశం ఇచ్చారు. అయితే ఇంతియాజ్ అహ్మద్ ఓడిపోవడం, అలాగే వైసీపీ కూడా అధికారంలోకి రాకపోవడంతో జగన్ ఇంతియాజ్ అహ్మద్ ను పట్టించుకోవడం మానేశారు.  దాంతో పార్టీ నుంచి కూడా ఆయనకు ఎటువంటి సహకారం అందడం లేదు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇంతియాజ్ అహ్మద్ వైసీపీకి రాజీనామా చేశారు. తాను ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించేశారు.
Publish Date: Dec 28, 2024 1:01PM

సంక్రాంతి తరువాత షెడ్యూల్.. ఫిబ్రవరిలో తెలంగాణ పంచాయతీ ఎన్నికలు!

తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ సంక్రాంతి తరువాత వెలువడే అవకాశం ఉంది.   మొత్తం  మూడు విడతల్లో  ఈ ఎన్నికలు జరగనున్నాయి. కాగా పంచాయతీ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ ద్వారానే  జరగనున్నాయి.  రాష్ట్ర వ్యాప్తంగా  12,815 గ్రామ పంచాయతీలు, 1.14లక్షల వార్డు సభ్యుల స్థానాలకు వచ్చే ఏడాది ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. పంచాయతీ ఎన్నికల తర్వాత ఎంపిటిసి, జడ్‌పిటిసి ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్, నగర పాలక సంస్థల ఎన్నికలను వరుసగా నిర్వహించేందుకు  కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఉన్న సానుకూలతను సొమ్ము చేసుకుని పంచాయతీ ఎన్నికలలో జయకేతనం ఎగురవేయాలన్న కృత నిశ్చయంతో  కాంగ్రెస్ సర్కార్ ఉంది.   ఇప్పటికే  పంచాయతీరాజ్ చట్ట సవరణకు అవసరమైన ప్రక్రియను పూ ర్తి చేసిన ప్రభుత్వం ఈ ఎన్నికల్లో  సత్తా చాటేందుకు భారీ ప్రణాళిక రూపిందించింది.    ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి కులగణనకు సంబంధించి పూర్తి నివేదిక అందింది.  ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. అదే విధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లకు సమాయత్తమౌతోంది.   ఈ సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీతో సర్పంచు ల పదవీ కాలం ముగియగా, జూలై 3వ తేదీన ఎం పిటిసి, జడ్పిటిసి సభ్యుల పదవీ కాలం ముగిసిం ది. దీంతో అప్పటి నుంచీ స్థానిక ప్రజాప్రతి నిధుల స్థానంలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది.  ఈ నేపథ్యంలో ఎన్నికల కు అవసరమైన ఏర్పాట్లను ఎన్నికల సంఘం చేప డుతోంది.  జనవరి 14వ తేదీన ఎన్నికల షెడ్యూల ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి మండలానికి కనీసం ఐదు ఎంపిటిసి స్థానాలు ఉండేలా అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 
Publish Date: Dec 28, 2024 11:54AM