చేనేతకు చేయూతనిద్దాం.. నారా భువనేశ్వరి!

‘‘తెలుగు రాష్ట్రాల ప్రజలకి నా హృదయపూర్వక నమస్కారాలు.. దసరా శుభాకాంక్షలు. నా ‘నిజం గెలవాలి’ పర్యటన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నేను తిరిగినప్పుడు చేనేత కార్మికులు చాలామందిని కలిసి, వాళ్ళు పడే ఇబ్బందులు, కష్టాలను నేను తెలుసుకున్నాను. చేనేత వస్త్రాలు మన తెలుగు రాష్ట్రాల్లో మంగళగిరి, వెంకటగిరి, ఉప్పాడ, పోచంపల్లి, సిరిసిల్ల, గద్వాల్ ఖాదీ ప్రసిద్ధి చెందినవి. నూలు సేకరించినప్పటి నుంచి బట్ట నేసేవరకూ ఆ కార్మికుడు పడే కష్టాలు, ఇబ్బందులు ఎన్నో. అతను యాసిడ్, బ్లీచింగ్ మధ్య నిల్చుని ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా చేనేత కార్మికులు వస్త్రాలు రూపొందిస్తున్నారంటే మనమంతా ఒకటే ఆలోచించాలి. తమ బిడ్డల కోసం, తమ కుటుంబం కోసం చేనేత  ఇన్ని సమస్యలు ఎదుర్కొని ముందుకు వెళుతున్నారు. అందుకే నేతన్నలకు సంఘీభావంగా రాబోయే పండుగలకు మనం చేనేత వస్త్రాలను ధరిద్దాం. చేనేత వస్త్రాలు కొనుగోలు చేయడం ద్వారా నేతన్నల ఆనందంలో మనం కూడా పాలుపంచుకుందాం. మన చేనేత, మన సంస్కృతి, మన సంప్రదాయం’’ అంటూ నారా భువనేశ్వరి వివరించారు.
Publish Date: Sep 28, 2024 10:28PM

అక్రమ కట్టడాలను మాత్రమే కూలుస్తున్నాం:హైడ్రా

  ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, డిజాస్టర్ మేనేజ్మెంట్ తమ బాధ్యత అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. తప్పుడు సర్వే నెంబర్లతో అక్రమ కట్టడాలను నిర్మించిన వాటిని మాత్రమే కూల్చుతున్నట్లు ఆయన చెప్పారు. ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్లలో ఉన్న సామాన్య ప్రజానీకాన్ని డిస్టర్బ్ చేయడం లేదన్నారు. రెండు నెలలనుంచి హైడ్రా కూల్చివేతలు ప్రారంభించినట్లు ఆయన చెప్పారు.  మూసీ సుందరీ కరణ కోసమే  హైడ్రా కూల్చివేతలు చేపట్టడం లేదని ప్రభుత్వ భూముల పరిరక్షణ ప్రధాన ఉద్దేశ్యమన్నారు. . కూకట్ పల్లిలో బుచ్చవ్వ ఆత్మహత్య బాధకలిగించిందన్నారు. కూతుళ్లకు ఇచ్చిన ఇల్లు బఫర్ జోన్ లో ఉందన్నారు. స్థానికులు భయాందోళనలకు గురి చేయడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని రంగనాథ్ వివరించారు
Publish Date: Sep 28, 2024 5:39PM

వైఎస్సార్సీపీ ఉన్నది జాగ్రత్త... చంద్రబాబు!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వేగంగా వ్యాప్తి చేయాలని అనుకుంటున్న అబద్ధాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులను హెచ్చరించారు. ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన వైఎస్సార్సీపీ చేస్తున్న అబద్ధాల ప్రచారాన్ని తిప్పికొట్టడానికి అనుసరించాల్సిన వ్యూహం మీద పలు సూచనలు చేశారు. మనం ప్రజలకు వాస్తవాలు చెప్పే లోపు జగన్ అబద్ధాలను భారీ స్థాయిలో ప్రచారం చేయాలని చూస్తున్నారని చంద్రబాబు హెచ్చరించారు. ప్రభుత్వం - పార్టీ సమన్వయంతో పనిచేసి జగన్ కుట్రలను సమర్థంగా తిప్పికొట్టాలని చంద్రబాబు సూచించారు. 
Publish Date: Sep 28, 2024 5:21PM

జగన్ తానా అన్నా.. తందానా అనని నాని, వంశీ!

వైసీపీలో జగన్ ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటించే వారు, జగన్ చూసి రమ్మంటే కాల్చి వచ్చేంతటి వీరభక్త హనుమాన్ లలో గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముందు వరుసలో ఉంటారు. అయితే పార్టీ ఓటమి తరువాత వారిద్దరూ కూడా జగన్ మాటకు పూచికపుల్ల పాటి విలువ కూడా ఇవ్వడం లేదని తాజాగా తేటతెల్లమైంది.  అసలే తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం విషయంలో జగన్ నిండా మునిగిపోయారు. ఈ వివాదం నుంచి బయటపడటమెలాగో తెలియక గిలగిలా కొట్టుకుంటున్నారు. అలవాటైన డైవర్షన్ పాలిటిక్స్ తో ఈ వివాదం నుంచి బయటపడదామని ఆయన చేస్తున్న ప్రయత్నాలు బూమరాంగ్ అవుతున్నాయి. సరిగ్గా అదే సమయంలో పార్టీలోని కీలక నేతల నుంచి ఎదురౌతున్న ధిక్కారం ఆయనను మరింత కుంగ దీస్తున్నది. ఎలాగోలా లడ్డూ వివాదం నుంచి బయటపడటానికి ఆయన ప్రాయశ్చిత పూజలు అంటూ పార్టీ నేతలు శ్రేణులకు పిలుపు నిచ్చారు. ఈ దీక్షను తాను ముందుండి నిర్వహస్తానని ప్రకటించిన జగన్ తిరుమల వెంకటేశ్వరుడిపై విశ్వాసం ఉంది అంటూ డిక్లరేషన్ ఇవ్వడానికి ఇష్టం లేక ఏకంగా తన తిరుమల యాత్రనే రద్దు చేసుకున్నారు. నాయకుడే జారిపోయే సరికి ఆయన ఆదేశాలను పాటించే విషయంలో పార్టీ నేతలు కూడా లైట్ తీసుకున్నారు. అలా లైట్ తీసుకున్న వారిలో జగన్ వీర భక్త హనుమాన్ లుగా పేరు గాంచిన కొడాలి నాని, వల్లభనేని వంశీ కూడా ఉండటం గమనార్హం.   జగన్ తిరుమల యాత్ర రద్దు అయినా.. ఆయన  పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు, శ్రేణులు ఆలయాల్లో ప్రాయశ్చిత పూజలు చేయాలన్న నిర్ణయంలో మాత్రం ఎలాంటి మార్పూ లేదని జగన్ ప్రకటించారు. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వైసీపీ నేతలు, శ్రేణులు తూతూ మంత్రంగా ప్రాయశ్చిత దీక్షలు చేశారు. కానీ జగన్ ఆదేశాలను కొడాలి నాని, వల్లభనేని వంశీ బేఖాతరు చేశారు. కనీసం పట్టించుకోలేదు. జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఆయన మొప్పు కోసం బూతులు, దాడులు, దౌర్జన్యాలతో రెచ్చిపోయిన వీరిరువురూ ఎన్నికలలో పార్టీ ఓటమి తరువాత చేసిన తప్పులకు ప్రాయశ్చితం ఇదే అనుకున్నారో ఏమో పూర్తిగా మౌనం వహించారు.  ఎంతో అత్యవసరమైతే తప్ప ఆంధ్రప్రదేశ్ పొలిమేరల్లోకి కూడా రావడానికి సాహసించడం లేదు. ఈ తరుణంలో తాజాగా తాడేపల్లిలో జగన్ ఆధ్వర్యంలో జరిగిన పార్టీ రివ్యూ మీటింగ్ కు వీరిరువురూ హాజరయ్యారు. ఆ సమావేశం తరువాత కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. ఆయన మాటల్లో మునుపటి ఫైర్ లేదు. ధీమా లేదు. మీడియా ముందుకు వచ్చాను కనుక తెలుగుదేశం, చంద్రబాబుపై విమర్శలు చేయాలి కనుక చేస్తున్నా అన్నట్లుగా మాట్లాడి మమ అనిపించారు. వల్లభనేని వంశీ అయితే మీడియా ముందు నోరెత్తే ధైర్యం కూడా చేయలేదు. ఇలా వచ్చారు.. అలా వెళ్లారు అన్నట్లుగా తాడేపల్లి నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు. కనీసం తమ నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఓటమి తరువాత కొడాలి నాని, వల్లభనేని వంశీ తీరుతో వారి వారి నియోజకవర్గాలలో వైసీపీ కార్యకర్తలు తీవ్ర నిరుత్సాహంలో కూరుకుపోయారు. ఇప్పుడు జగన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ చేపట్టిన ప్రాయశ్చిత దీక్షలకు డుమ్మా కొట్టడం ద్వారా వారు జగన్ మాటకు పూచికపుల్ల విలువ కూడా ఇవ్వడం లేదని తేటతెల్లమైపోయింది.  
Publish Date: Sep 28, 2024 4:12PM

జీహెచ్ఎంసీ పరిధిలో వాల్ పోస్టర్లపై నిషేధం

భాగ్యనగరంలో గోడలపై వాల్ పోస్టర్లు అంటించడాన్ని నిషేధిస్తూ గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ అమ్రపాలి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేషేధం ఏమీ ఈరోజు విధించినది కాదు. ఎప్పుడో 2016 నుంచే భాగ్యనగరంలో గోడలపై వాల్ పోస్టర్లు, అడ్డర్టైజ్ మెంట్లు, పెయింటింగ్ లపై నిషేధం ఉంది. అయితే ఆ నిషేధాన్ని అమలు చేసే విషయంలో ఇప్పటి వరకూ ఎవరూ ఎటువంటి శ్రద్ధా పెట్టలేదు. ఇప్పుడు జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి నగరంలోని గోడలపై పోస్టర్లు, పెయింటింగ్ లు, అడ్డర్టైజ్ మెంట్లు కనిపించకూడదంటూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సినిమా పోస్టర్లు కూడా ఈ నిషేధం కిందకి వస్తాయి. ఇందుకు సంబంధించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసిన జీహఎచ్ఎంసి కమిషనర్ అమ్రపాలి.. దీనిని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అంతే కాకుండా నిషేధాన్ని ఉల్లంఘించి నగరంలో గోడలపై వాల్ పోస్టర్లు అంటించినా, పెయింటింగ్ లు, అడ్డర్టైజ్ మెంట్లు కనిపించినా భారీ జరిమానా విధిస్తామని, ఈ మేరకు అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు, సినిమా ఎగ్జిబిటర్లకు అవగాహన కల్పించాల్సిందిగా అమ్రపాలి అధికారులను ఆదేశించారు.   ఈ ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలని, ఈ విషయాన్ని పోస్టర్ ప్రింటింగ్ ఏజెన్సీలకు నోటీసు ద్వారా తెలియజేయాల్సిందిగా అధికారులను  ఆదేశించారు. పోస్టర్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు కారణంగా నగరం అందవికారంగా అపరిశుభ్రంగా కనిపిస్తున్నది అనడం వాస్తవం. నగరంలోని గోడలపై పోస్టర్లు నిషేధించడాన్ని నగర వాసులు స్వాగతిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా పోస్టర్లను తొలగించి నగరం  సుదరంగా కనిపించేలా చేయాలని కోరుతున్నారు.  
Publish Date: Sep 28, 2024 3:25PM

జాని మాస్టర్ అక్టోబర్ 3 వరకు రిమాండ్ 

పోలీస్ కస్టడీ శనివారంతో ముగియడంతో కొరియోగ్రాఫర్  జాని మాస్టర్ ను రంగారెడ్డి కోర్టుకు హాజరుపరిచారు. పోలీస్ కస్టడీని కొనసాగించాలని పోలీసులు న్యాయస్థానాన్ని కోరినప్పటికీ ఫలితం లేకపోయింది. జాని మాస్టర్ ను  అ క్టోబర్ మూడు వరకు     చెంచల్ గూడా జైలుకు తరలించాలని న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. మహిళా అసిస్టెంట్ పై రేప్ కేసులో అరెస్ట్ అయిన కొరియోగ్రాఫర్ జాని మాస్టర్ అరెస్ట్ అయి రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 25న నాలుగురోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగించిన న్యాయస్థానం శనివారం ఆ గడువు ముగిసింది. మరో మారు పోలీస్ కస్టడీకి ఇవ్వాలన్న  పోలీసుల అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. 
Publish Date: Sep 28, 2024 2:25PM