Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కేశినేని చిన్ని వర్సెస్ కొలికపూడి శ్రీనివాసరావు.. మళ్లీ రచ్చకెక్కిన విభేదాలు
posted on: Mar 3, 2026 10:05AM

విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. తాజాగా దైవ సన్నిధిలో వీరిరువురి మధ్యా విభేదాలు రచ్చకెక్కాయి. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో ఎంపీ చేతిలో ఉన్న పట్టువస్త్రాలను ఎమ్మెల్యే కొలికపూడి బలవంతంగా లాక్కుని సమర్పించడం వివాదానికి దారి తీసింది. వివరాలిలా ఉన్నాయి.
నెమలి వేణుగోపాలస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం (మార్చి 2) రాత్రి స్వామివారి కల్యాణం జరిగింది. దీనికి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా, స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఆలయ పురోహితులు ఎంపీ చిన్ని దంపతులకు అందజేశారు. అయితే, తనకు కూడా వస్త్రాలు ఇవ్వాలని ఎమ్మెల్యే పట్టుబట్టారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం ఒకరికే ఇస్తారని చెప్పిన ఆలయ అధికారులు, ఆయనకు తలంబ్రాలు అందించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ చేతిలోని పట్టువస్త్రాలను బలవంతంగా లాక్కుని తన తలపై పెట్టుకున్నారు.
దీంతో ఎంపీ, ఎమ్మెల్యే వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్యా తోపులాట జరిగింది. పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. ఎంపీ కేశినేని చిన్ని సంయమనంతో వ్యవహరించి తన తన వర్గీయుల వారించి ఘర్షణ జరగకుండా నివారించారు. అనంతరం కల్యాణ మండపంలో ముందు వరుసలో ఎమ్మెల్యే దంపతులు, వెనుక వరుసలో ఎంపీ దంపతులు కూర్చున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేశారు.






