Latest News
సరికొత్త రోగం : కేజ్రీవాల్ ఫోబియా
posted on: Apr 8, 2014 4:09PM
.jpg)
ప్రపంచ వైద్య చరిత్రలో ఒక సరికొత్త రోగం తెరమీదకి వచ్చింది. ఆ రోగం పేరు ‘కేజ్రీవాల్ ఫోబియా’. ఇది ఒక మానసిక రోగం. మానడానికి ఎంతమాత్రం అవకాశం లేని రోగం. జనం నమ్మకాన్ని వమ్ము చేసిన రాజకీయ నాయకులకు మాత్రమే ఈ రోగం వచ్చే అవకాశం వుంది. ఈ రోగ లక్షణాలు ఎలా వుంటాయంటే, తాను జనం మధ్యలో వుండగా ఎవరో ఒక సామాన్యుడు తన ముందుకు వచ్చి చెంప చెళ్ళుమనిపిస్తాడని సదరు రాజకీయ నాయకుడు ఎప్పుడూ భయపడుతూ వుంటాడు. పైకి మాత్రం ‘నేను ప్రజాసేవకుడిని, సమస్యల పరిష్కరామే నాకు ముఖ్యం. నన్ను ఎవరు, ఎక్కడకి రమ్మన్నా వస్తా. ఇష్టం వచ్చినట్టు కొట్టుకోండి’ అని కేజ్రీవాల్ తరహాలో స్టేట్‌మెంట్లు ఇస్తూ వుంటారు. ఈ రోగం ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కి మొట్టమొదటిసారి వచ్చంది కాబట్టి దీనికి ‘కేజ్రీవాల్ ఫోబియా’ అని పేరు పెట్టడం జరిగింది. భవిష్యత్తులో ఈ రోగం సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, జై సమైక్యాంధ్ర పార్టీ నాయకులకు వచ్చే అవకాశం వుంది. ఎందుకంటే ఈ మూడు పార్టీల నాయకులు సీమాంధ్ర ప్రజలకు తీరని ద్రోహం చేశారు. రాష్ట్రం అన్యాయంగా ముక్కలయ్యేందుకు సహకరించారు. ప్రజల మనసులను గాయపరిచారు. ఎన్నికల సందర్భంగా ఇప్పుడు ప్రజల్లోకి ఎలా వెళ్ళాలో అర్థంకాకుండా వున్నారు. నమ్మకద్రోహం చేసిన తమకు ప్రజల నుంచి ‘చెంపదెబ్బ’ లాంటి సత్కారాలు జరుగుతాయేమోనని భయపడుతూ వున్నారు. ఇలా భయపడీ భయపడీ వీళ్ళకు ‘కేజ్రీవాల్ ఫోబియా’ వచ్చే అవకాశం వుంది.


.jpg)
.jpg)


