Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కేసీఆర్ నిర్వేదం!
posted on: Apr 7, 2014 4:03PM
.jpg)
మీడియాతో ఎప్పుడు మాట్లాడినా బోలెడంత పౌరుషంగా మాట్లాడే కేసీఆర్ సడెన్‌గా నిర్వేదంగా, నిరాసక్తంగా, నీర్సంగా, నిస్తేజంగా మాట్లాడారు. ఆయన గొంతులో ‘ఏంటో పాడు పాలిటిక్స్’ అనే ధోరణి వినిపించింది. ఎన్ని తంటాలు పడినా, ఎంత ప్రాంతీయ విద్వేషాలు రగిల్చినా చివరికి ఎన్నికల్లో అవమానం తప్పదన్న బాధ ఆయన గొంతులో వినిపించింది.
సోమవారం ఆయన మాట్లాడుతూ, నా పని నేను చేస్తున్నాను ఇక ఫలితం ఇచ్చేది ఆ పైవాడే అన్నట్టుగా మాట్లాడారు. తెలంగాణ తెచ్చానన్న ఖ్యాతి నాకు మిగిలింది అది నాకు చాలు అనే మాట ఆయన నోట్లోంచి వచ్చినప్పుడు ఆ మాట విన్నవాళ్ళ మనసులో ఎన్నో ఆలోచనలు కలిగాయి. తెలంగాణ తెచ్చానన్న ఖ్యాతి తప్ప తనకేమీ మిగలదని కేసీఆర్ చెప్పకనే చెబుతున్నారా అనే సందేహాలు కలిగాయి. ఈ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి ‘వస్తే’ అభివృద్ధి జరుగుతుందని కూడా ఆయన అన్నారు. నిన్నటి వరకూ తెరాస అధికారంలోకి వస్తుంది, ముఖ్యమంత్రి అయిపోతానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ‘వస్తే’ అనడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
అంటే కేసీఆర్ టీఆర్ఎస్ అధికారంలోకి రాదన్న విషయాన్ని ఒప్పుకుంటున్నట్టే వుందని అందరూ అనుకుంటున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, కార్యకర్తలు వద్దంటున్నా టీడీపీ, బీజేపీ ఎన్నికల పొత్తు కుదుర్చుకున్నాయని అని బిక్కముఖం వేసుకుని చెప్పారు. అప్పటిగ్గానీ అసలు విషయం క్లియర్‌గా అర్థం కాలేదు. అసలే ఇప్పటికే విజయావకాశాలు అంతంతమాత్రంగానే వున్న టీఆర్ఎస్‌కి టీడీపీ, బీజేపీ కలయిక దారుణమైన నష్టం తెచ్చే అవకాశం వుంది. అందుకే కేసీఆర్ గొంతులో నిరాశ, నిర్వేదం ధ్వనించాయి.


.jpg)



