Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...డాడీకి మీరైనా చెప్పండి: కేకేకి కేటీఆర్ రిక్వెస్ట్...
posted on: Sep 12, 2014 2:38PM

మీడియావాళ్ళ మెడలు విరిచేస్తాం, పది కిలోమీటర్ల గొయ్యి తీసి పాతేస్తాం.. తెలంగాణలో వుండాలంటే మాకు సెల్యూట్ చేయాలి లాంటి కామెంట్లు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ స్థాయిలో అప్రతిష్ఠ మూటగట్టుకున్నారు. వందరోజుల పాలనలో చేసిందేమీ లేకపోయినా, వందరోజుల పాలన పూర్తయిన సందర్భంగా కేసీఆర్ ఇచ్చిన ‘మాటల కానుక’ ఇప్పుడు తెలంగాణకు జాతీయ స్థాయిలో ఇబ్బందులు తెచ్చిపెట్టింది. కేసీఆర్‌కి ఒక ప్రత్యేకమైన శైలి వుంది. కొంతకాలం ఆయన బయట ఎవరికీ కనపడరు. సడెన్‌గా ఒకరోజు బయటకి వస్తారు. ఆరోజు తాను ఎవర్ని తిట్టాలనుకుంటారో వాళ్ళని తిట్టేసి మళ్ళీ గప్‌చుప్‌గా వుండిపోతారు. ఆయన మళ్ళీ బయటకి వచ్చేవరకూ ఆయన మాట్లాడిన మాటల ప్రభావం వుంటుంది.
అయితే ఈ వ్యవహార శైలి ఆయన తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడిగా వున్నప్పుడు బాగా వర్కవుట్ అయింది. ఇప్పుడు ఆయన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఏ స్థాయిలో వున్న వ్యక్తి ఆ స్థాయిలోనే మాట్లాడాలి తప్ప తన స్థాయి నుంచి కిందకి దిగి మాట్లాడ్డం లేనిపోని ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. మొన్న కేసీఆర్ మీడియాని ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఇలాంటివే. కేసీఆర్ మాట్లాడిన మాటలు ఎంత ప్రమాదకరమైనవో ఆయన మాట్లాడేటప్పుడు ముందు, వెనుక నుంచుని ఇకిలించి చప్పట్లు కొట్టేవాళ్ళకి అర్థంకాకపోవచ్చుగానీ, కేసీఆర్ కుమారుడు - విద్యావంతుడు అయిన కేటీఆర్‌కి మాత్రం తన తండ్రి మాట్లాడుతున్న మాటలు ఎంత ప్రమాదకరమైనవో అర్థమైనట్టు తెలుస్తోంది. తన తండ్రి వాగ్ధాటిని తగ్గించాలని ప్రయత్నించిన కేటీఆర్ పూర్తిగా విఫలం అయినట్టు సమాచారం. తన తండ్రితో వాదించి ఒప్పించే శక్తి లేని కేటీఆర్ ఈ విషయంలో మరో పెద్దమనిషికి తన బాధ చెప్పుకున్నట్టు తెలుస్తోంది. ఆ పెద్దమనిషి ఎవరో కాదు.. కె.కేశవరావు.
కేకే అంకుల్.. నాన్నగారు మీడియాతో పెట్టుకుంటున్నారు. ఇరుక్కుపోయే కామెంట్లు చేశారు. నాన్నగారు మీడియా వాళ్ళ మెడలు విరగ్గొడతాం, పాతిపెడతాం లాంటి కామెంట్లు చేయడంతో జాతీయ స్థాయిలో పరువు పోయింది. ఇంకా ముందు ముందు ఆయన ఎలాంటి కామెంట్లు చేస్తారో, ఏం కొంప ముంచుతారోనని భయంగా వుంది. ఆయన్ని అదుపు చేయడం మా వల్ల కావడం లేదు. పెద్దవారు కనీసం మీరు చెప్పిన మాటయినా ఆయన వింటారన్న నమ్మకం వుంది. మీరే ఎలాగైనా నాన్నగారి దూకుడు తగ్గించండని కేటీఆర్ కేకేని రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. మరి కేకే కేసీఆర్ని ఎలా కంట్రోల్ చేస్తారో చూడాలి.


.jpg)
.jpg)


