Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...చంద్రబాబుని చూసి కేసీఆర్ నేర్చుకోవాల్సింది ఇదే!
posted on: Jun 2, 2014 5:31PM
.jpg)
కేసీఆర్ని ఏమైనా అంటే టీఆర్ఎస్ వాళ్ళకి ఇంత పొడుగున రోషం పొడుచుకుని వస్తుందిగానీ, హుందాతనం విషయంలో చంద్రబాబు నాయుడిని చూసి కేసీఆర్ నేర్చుకోవాల్సింది చాలా వుంది. సీమాంధ్రలో అధికారం వచ్చినా చంద్రబాబు ఇప్పటి వరకు ఒక్క మాట కూడా అహంకారపూరితంగా మాట్లాడలేదు. అదే కేసీఆర్ అయితే అధికారం దక్కినప్పటి నుంచి మాట్లాడిన మాటలు సీమాంధ్రుల గుండెల్ని మండించాయి. ఇదిలా వుంటే, మర్యాద, మన్నన, ఇరుగు పొరుగు రాష్ట్రాల వారితో స్నేహ సంబంధాలు నెలకొల్పుకునే విషయంలో కూడా చంద్రబాబు కంటే కేసీఆర్ చాలా కిలోమీటర్లు వెనుకబడి వున్నారన్న విషయం కేసీఆర్ ప్రమాణ స్వీకార సందర్భంగానే అందరికీ అర్థమైపోయింది.
కేసీఆర్ తన ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రిని ఆహ్వానించలేదు. తనకు రాజకీయంగా శుభారంభాన్నిచ్చిన, పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్న చంద్రబాబు నాయుడిని కూడా వ్యక్తిగతంగా ఆహ్వానించలేదు. ఇది కేసీఆర్‌లో పెరిగిపోయిన అధికార గర్వానికి అద్దం పట్టే అంశమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అయితే కేసీఆర్ ఇలా వ్యవహరించినప్పటికీ, చంద్రబాబు నాయుడు మాత్రం ఎంతో హుందాగా వ్యవహరించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్‌కి చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఈనెల 8వ తేదీన సీమాంధ్రలో జరిగే తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా కేసీఆర్‌ని ఆహ్వానించారు.
చంద్రబాబు చేసిన ఈ పని కేసీఆర్ కళ్ళు తెరిపించిందో లేదో గానీ, చాలామంది తెరాస నాయకులు సిగ్గుతో తలలు వంచుకునేలా చేసింది. చంద్రబాబు కేసీఆర్‌తోపాటు జగన్‌కి కూడా స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. చంద్రబాబు వ్యవహరించిన తీరు పరిణతి కలిగిన రాజకీయ నాయకుడిని, పాలకుడిని ప్రతిఫలిస్తోంది.


.jpg)
.jpg)


