Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కేసీఆర్‌కి పురుగులు పడతాయా?
posted on: Apr 18, 2014 11:09AM
.jpg)
టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒకళ్ళతో మరొకళ్ళు పోటీపడి ఒకరినొకరు తిట్టుకుంటూ జనాల బుర్రలు ఖరాబు చేస్తున్నారు. ఈరోజు ఆయన ఒక తిట్టు తిడితే మర్నాడు ఇంకొకాయన ఆయన్ని రెండు తిట్లు తిడుతున్నారు. ఇలా తెలంగాణలో రాజకీయం మూడు తిట్లు, ఆరు చీవాట్లు అన్నట్టుగా సాగుతోంది. వీళ్ళ తిట్లు వింటూ వుంటే కొన్నిసార్లు కామెడీగా అనిపిస్తూ వుంటుంది. మరికొన్ని సార్లు పరిస్థితి సీరియస్ అయిపోయిందన్నట్టు అనిపిస్తుంది. ఇంకోసారి వీళ్ళిద్దరూ కూడబలుక్కుని తిట్టుకుంటూ జనాన్ని పిచ్చోళ్ళని చేస్తున్నారా అనిపిస్తూ వుంటుంది. వీళ్ళ తిట్లు మండ.. మునిసిపాలిటీ ట్యాప్ దగ్గర నీళ్ళు పట్టుకునే ఆడోళ్ళకంటే ఘోరంగా తిట్టుకుంటున్నారు. కేసీఆర్ పొన్నాలని ఎప్పుడు తిట్టినా ఆ బోలెడన్ని తిట్లలో ‘సన్నాసి’ అనే తిట్టు తప్పకుండా వుంటుంది. అలాగే పొన్నాల కేసీఆర్ని ఎప్పుడు తిట్ల ప్రవాహంలో ‘నువ్వే సన్నాసి’ అనే మాట తప్పకుండా కనిపిస్తుంది. లేటెస్ట్ గా కేసీఆర్ మరోసారి పొన్నాలని ‘సన్నాసి’ అని తిట్టాడు. దానికి పొన్నాల రెస్పాండ్ అవుతూ, ఈసారి ‘నువ్వే సన్నాసి’ అనే మాట వాడలేదు. ‘నన్ను సన్నాసి అంటే కేసీఆర్‌కి పురుగులు పడతాయ్. దేవుడు అన్నీ చూస్తున్నాడు’ అని శాపం విధించాడు. పొన్నాల విధించిన శాపం ఫలిస్తుందో ఏం పాడో!


.png)
.jpg)


