Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రెండు చోట్ల కేసీఆర్ పోటీ : అపనమ్మక ప్రభావం!
posted on: Apr 8, 2014 5:51PM
.jpg)
తెలంగాణలో తెరాస అధికారంలోకి రాగలిగినంత మెజారిటీ సాధించే అవకాశం లేదని రాజకీయ పరిశీలకులు ఎప్పుడూ చెబుతూనే వున్నారు. ఆ విషయం కేసీఆర్‌కి కూడా తెలుసు. ఉత్తర తెలంగాణలో తప్ప దక్షిణ తెలంగాణలో పట్టులేని తెరాస తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం అనేది కలలో మాట. ఈ విషయం కేసీఆర్‌కి కూడా తెలుసు. ఇప్పుడు తెలుగుదేశం, బీజేపీ పొత్తు కుదిరిన తర్వాత తన పార్టీకి మెజారిటీ రావడం సంగతి దేవుడెరుగు, అసలు ఎన్నిసీట్లు గెలుస్తామో కూడా ఊహించలేని పరిస్థికి కేసీఆర్ చేరుకున్నారు. ఇంతకాలం తెలంగాణ ముఖ్యమంత్రి పీఠం మీద కేసీఆర్ పెంచుకున్న ఆశల మంచు చాలా వేగంగా కరిగిపోయింది. ఇప్పుడు కేసీఆర్ కళ్ళ ముందు వాస్తవ పరిస్థితి కనిపిస్తోంది. తన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదన్న వాస్తవ అపనమ్మకి కేసీఆర్‌లో నిండిపోయింది. అందుకే అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంట్ స్థానాలకు పోటీ చేయాలన్న ఆలోచనకి కార్యరూపం తీసుకొచ్చారు. గజ్వేల్ అసెంబ్లీకి, మెదక్ పార్లమెంట్‌కి పోటీ చేస్తున్నారు. పొరపాటున, ఊహించని విధంగా, అనుకోకుండా తెరాసకి మెజారిటీ వస్తే అసెంబ్లీ సీటు ఆధారంగా ముఖ్యమంత్రి అయిపోవచ్చు. మెజారిటీ రాకపోతే ఢిల్లీలో హడావిడి చేయడానికి ఎంపీ సీటు ఉపయోగపడుతుందని కేసీఆర్ భావిస్తున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.


.jpg)
.png)


