Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్!
posted on: Mar 27, 2026 4:15PM
.webp)
తండ్రి కేసీఆర్ స్థాపించిన పార్గీ నుంచి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత కొత్తపార్టీ స్థాపనకు రంగం సిద్దం చేసుకున్నారు. తెలంగాణ ప్రజా పార్టీగా నామకరణం చేసిన నూతన పార్టీని ఏప్రిల్ 25 తేదీన ఉదయం 10గం.లకు అధికారికంగా ప్రకటించనున్నట్లు వెల్లడించారు. మేడ్చల్‌లోని మునిరాబాద్‌లో పార్టీ ప్రకటిస్తానని, అదే రోజు పార్టీ జెండా ఆవిష్కరించనున్నట్లు ప్రకటించారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు మంచి ముహూర్తం ఉందన్నారు. రాముని ఆశీర్వాదంతో పార్టీ ప్రకటన తేదీని నిర్ణయించామని ముహుర్తాలపై తనకున్న నమ్మకాన్ని చాటుకున్నారు. వారణాసి వెళ్లి గంగా స్నానం చేసి పార్టీ నీ లంచ్ చేస్తామని జాగృతి అధ్యక్షురాలు స్పష్టం చేశారు.
వాస్తవానికి ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవానికి రెండు రోజుల ముందు పార్టీని, జెండాను ఆవిష్కరించనున్నట్లు కవిత ప్రకటించడం విశేషం. ఏఏ అంశాలపై కొత్త పార్టీ పోరాటం చేయాలో తమ దృష్టికి తీసుకురావాలని కవిత శ్రీరామ నవమి సందర్భంగా విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర రాజకీయాలను మార్చాల్సిన అవసరం ఉందంటున్న కవిత, తెలంగాణ వచ్చినప్పటి నుంచి యువత ఉద్యోగాల కోసం వేచి చూడాల్సి వస్తోందని పరోక్షంగా బీఆర్ఎస్‌పై మండిపడ్డారు. తమ కొత్తపార్టీ ద్వారా యువత కోసం ఏం చేయబోతున్నామో చెబుతామని. యువత, మహిళలకు పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని కవిత వెల్లడించారు.
జాగృతి సంస్థ ద్వారా బీసీలు, దళితుల హక్కుల కోసం పోరాటం చేశామని, పార్టీ ఆవిర్భావం నాడు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు,యువత పెద్ద ఎత్తున తరలిరావాలని కవిత కోరారు. మొత్తానికి తెలంగాణ జాగృతి సంస్ధ...రాజకీయ పార్టీగా మారబోతుందిప్పుడు. తమ పార్టీ ఎవరికీ బీ పార్టీ కాదని ....తమది నెంబర్ వన్ పార్టీగా ఉండబోతుందని కవిత ధీమా వ్యక్తం చేశారు. కొత్త పార్గీ నుంచి ప్రజలు ఏమి ఆశిస్తున్నారో సలహాలు ఇవ్వాలని , అందుకోసం ఒక వాట్సాప్ నంబర్ ఏర్పాటు చేస్తామని, అలాగే మెయిల్‌కి మేసేజ్ చేయవచ్చన్నారు. ఏప్రిల్ 25న పార్టీ ప్రకటిస్తామన్న కవిత, అప్పటిలోగా.. అంటే రానున్న 28 రోజుల్లో ప్రతి ఒక్కరినీ కలుస్తానని ప్రకటించారు.. తెలంగాణ ఉద్యమకారులు, యువత, మహిళలు, మెథావులు, కవులు, పాత్రికేయులు అందరితో చర్చిస్తామన్నారు.



.webp)


