Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కన్నాకు ఆఫర్స్... మళ్లీ కన్ఫ్యూజన్
posted on: May 7, 2018 6:51PM

కన్నా లక్ష్మీ నారాయణ మళ్లీ కన్ఫ్యూజన్ లో పడినట్టు తెలుస్తోంది. ముందు బీజేపీ నుండి వైసీపీ లోకి జంప్ అవుదామని చూసిన కన్నాకు అమిత్ షా నుండి ఫోన్ రావడం ఆ తరువాత ఆకస్మికంగా బీపీ పెరిగిందంటూ ఆస్పత్రిలో చేరి.. ‘జంపింగ్’ ఎపిసోడ్ కి కొంత విరామం ఇవ్వడం జరిగింది. ఆ తరువాత మళ్లీ కన్నా టీడీపీకి జంప్ అవుతున్నట్టు వార్తలు వచ్చాయి. చంద్రబాబుతో చెప్పి మంచి ‘రోల్’ ఇప్పిస్తామంటూ టీడీపీ నేతల నుంచి లాబీయింగ్ జరిగింది. ఇక రేపో మాపో కన్నా టీడీపీలో చేరుతారు అనుకునే లోపే మళ్లీ కన్నా ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. బీజేపీలోనే కొనసాగమని కమలం నేతలు ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు వైసీపీ నుంచి సైతం కొన్ని ప్రెజర్ గ్రూప్స్ కసరత్తు మొదలుపెట్టేశాయి. ఒక ముహూర్తం దాటిపోతేపోయింది.. మరో ముహూర్తం పెట్టుకుందాం అంటూ జగన్ క్యాంపు నుంచి కన్నా మీద ఒత్తిడి షురూ అయ్యిందట. ఇక దీంతో ప్రధాన పార్టీలన్నీ ఆఫర్స్ మీద ఆఫర్స్ ఇవ్వడంతో కన్నా బుర్ర మరింత వేడెక్కిపోయిందట.. అంతేకాదు.....హైదరాబాద్ వెళ్లి బీపీ చెక్ చేయించుకుని.. తిరిగొచ్చిన తర్వాత ‘తన భవిష్యత్ కార్యాచరణ’ ప్రకటిస్తానని కన్నా సున్నితంగా ఎస్కేప్ అవుతున్నారట. మొత్తం మీద కన్నాకు ఆఫర్స్ మీద అఫర్స్ వస్తున్నాయి. మరి ఆఖరికి కన్నా ఏం నిర్ణయం తీసుకుంటారో చూద్దాం..!


.jpg)
.jpg)


