Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...టీడీపీలోకి కన్నా... ఇప్పుడెవరికి ఫోన్ చేస్తారు షా జీ..
posted on: Apr 27, 2018 12:55PM

ఏపీ రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తిరిగి ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా తయారయ్యాయి. ఇప్పుడు తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. నిన్న మొన్నటి వరకూ బీజేపీ నేత మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వైసీపీ చేరుతున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అమిత్ షా ఫోన్ చేశారని.. కన్నా వైసీపీలోకి తీసుకోవద్దని చెప్పారన్న టాక్స్ వినిపించాయి. అంతేకాదు... కన్నా కు కూడా షా ఫోన్ చేసి వైసీపీలోకి వెళ్లొద్దని.. పార్టీలోనే ఉండాలని చెప్పినట్టు తెలిసింది. అందుకే కన్నా కూడా వెనక్కి తగ్గారని... తన మనసును మార్చుకున్నారని... అందుకనే.. ఆరోగ్యం బాలేదని.. ఏదో సాకు చెప్పి వైసీపీలో చేరే కార్యక్రమాన్ని ఆపేసి, ఆసుపత్రిలో చేరారని అంటున్నారు.
ఇవి నిన్నటి వరకూ వచ్చిన ఆరోపణలు.. కానీ ఈరోజు మరో ఆసక్తికరమైన విషయం ఒకటి బయటకు వచ్చింది. కన్నా టీడీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారట. నిజానికి కన్నా వైసీపీ కంటే ముందు టీడీపీలోకే వచ్చేందుకే ఆసక్తి కనపరిచారట. కానీ టీడీపీ నుంచి సరిగా స్పందన రాకపోవడంతో... వెంటనే వైసీపీ నాయకులతో టచ్‌లోకి వెళ్లారట. ఇక వాళ్లు కన్నా కోరుకున్న సీటుతో పాటు ఆయన అనుచరుడుకి కూడా ఓ సీటు ఇచ్చేందుకు ఓకే చెప్పడంతో కన్నా వైసీపీలోకి వెళ్లేందుకు ముహూర్తం పెట్టేసుకున్నారు. కానీ బీజేపీ నుండి వ్యతిరేకత రావడంతో.. ఆయన టీడీపీలోకే రావాలని నిర్ణయించుకున్నారట. దీంతో కాపు సామాజిక వర్గంలో గట్టి పట్టు ఉన్న కన్నా లక్ష్మీనారాయణ వంటి బలమైన నాయకుడిని వైసీపీలోకి వెళ్లనివ్వకుండా చూడటానికి టీడీపీ నాయకులు రంగంలోకి దిగారట. విశాఖపట్నానికి చెందిన ఓ మంత్రి, గుంటూరు జిల్లాకు చెందిన ఓ మంత్రి, కొంతమంది గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు కన్నాతో మంతనాలు జరిపారని తెలిసింది. ఇక కన్నా కూడా వైసీపీ కంటే టీడీపీయే బెటర్ అని ఆలోచిస్తున్నారట. అయితే ఆయన డిమాండ్లు ఒప్పుకుంటే పసుపు కండువా కప్పుకునేందుకు పెద్ద అభ్యంతరం లేదన్నట్టుగా తెలుస్తోంది. మరి కన్నా పెదకూరపాడు సీటు అడుగుతారా ? లేదా ? గుంటూరు వెస్ట్ సీటు అడుగుతారా ? అన్నది చూడాల్సి ఉంది. దీనిపై క్లారిటీ రావాలంటే వెయిట్ చేయాల్సిందే...మరి కన్నా వైసీపీ వెళ్లాలనుకున్నప్పుడు షా జగన్ కు ఫోన్ చేసి పార్టీలోకి తీసుకోవద్దని చెప్పారు. మరి ఇప్పుడు ఎవరికీ ఫోన్ చేస్తారో..






