కవిత కొత్త పార్టీ పేరు టీఆర్ఎస్

posted on: Apr 25, 2026 10:31AM

తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత కొత్త ప్రకటించారు.   మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో ఏర్పాటు చేసిన  సభలో ఆమె తన పార్టీ జెండాను ఆవిష్కరించి, అజెండాను ప్రజల ముందుంచారు.   పార్టీ పేరు తెలంగాణ  రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.  

రాబోయే రోజుల్లో తాను  తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అవుతానని కవిత ధీమా వ్యక్తం చేశారు.  తన నివాసం నుంచి బహిరంగ సభకు బయలుదేరే ముందు ఆమె మీడియాతో మాట్లాడిన కవిత..  రాష్ట్రంలో సరికొత్త విప్లవం ప్రారంభమైందని, ఈ మార్పులో ప్రజలందరూ తనను ఆశీర్వదించాలని  కోరారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...