Top Stories

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ  స్వల్పంగా ఉంది. ఉంది.  బుధవారం (ఫిబ్రవరి 26) ఉదయం భక్తుల క్యూకాంప్లెక్స్ లో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు.  టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఆరుగంటల కంటే తక్కువ సమయం పడుతోంది. ఇక టైమ్ స్లాట్ భక్తులకైతే శ్రీవారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు రెండు గంటలలోపే శ్రీవారి దర్శన భాగ్యం కలుగుతోంది.   ఇక మంగళవారం(ఫిబ్రవరి 25) శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4.23 కోట్ల రూపాయలు వచ్చింది. మంగళవారం శ్రీవారిని 65,127 మంది దర్శించుకున్నారు. వారిలో 19,307 మంది భక్తులు తలనీ లాలను సమర్పిం చుకున్నారు.మహా శివరాత్రి కావడం వల్ల తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉందని టీటీడీ అధికారులు తెలిపారు.  
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ Publish Date: Feb 26, 2025 9:08AM

ముగింపు దశకు మహా కుంభమేళా.. అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుక

ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో గత 45 రోజులుగా అత్యంత వైభవోపేతంగా, ఆశేష భక్త జనవాహినితో జరుగుతున్న మహా కుంభమేళా బుధవారం (ఫిబ్రవరి 26) శివరాత్రి తో ముగియనున్నది. ఈ మహాకుంభమేళా ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుకే కాకుండా.. అంచనాలకు అందని వ్యాపార సామ్రాజ్యంగా కూడా చెప్పుకోవచ్చు.  మహాకుంభమేళాలో ఫిబ్రవరి 22 నాటికే    పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించిన వారి సంఖ్య 60 కోట్లకు చేరింది. బుధవారంతో ఈ కుంభమేళా ముగియనున్నది. కుంభమేళా ముగిసే సరికి పుణ్యస్నానాలు చేసినవారి సంఖ్య 65 కోట్లు దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.  గంగ,యమునా,సరస్వతి నదుల పవిత్ర సంగమంలో పుణ్యస్నానాలు అచరించడానికి  దేశవిదేశాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ఇంతటి మహోత్తర ఆధ్మాత్మిక పండుగ మళ్లీ  144 ఏళ్ల తరువాత గానీ రాదు. దీతో  జనం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ముగింపు సమీపిస్తున్నప్పటికీ మహాకుంభ్ కు వస్తున్న భక్త జనం పోటెత్తుతూనే ఉన్నారు.  మహాకుంభ మేళా కోసం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. భక్తులకు అసౌకర్యం కలగకుండా చేయగలిగినంతా చేసింది. అయితే మౌనీ అమావాస్య రోజు న అంచనాలకు మించి భక్త జనం పోటెత్తడంతో దురదృష్ట వశాత్తూ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో  30 మంది చనిపోయారు.  రెండు మూడు సార్లు టెంట్లలో అగ్నిప్రమాదాలు సంభవించాయి. వీటి వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ చిన్నచిన్న అపశ్రుతులు వినా మహాకుంభమేళా నిర్వహించడంలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సక్సెస్ అయ్యిందనే చెప్పాలి.  అధ్యాత్మిక సౌరభాల సంగతి అలా ఉంచితే.. మహా కుంభమేళా  అతి పెద్ద వ్యాపార కేంద్రంగా నిలిచిందని  కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) అంచనా వేసింది. ఈవేడుక సందర్భంగా వస్తువులు,సేవలు ద్వారా 3లక్షలకోట్ల రూపాయలకు పైగా వ్యాపారం జరిగిందని సీఏఐటీ పేర్కొంది.ఆతిథ్యం, వసతి, ఆహారం, పానీయాలు, రవాణా, దుస్తులు, పూజా సామాగ్రి, హస్తకళలు, ఆరోగ్యరక్షణ, ప్రకటనలు, పౌరసేవలు,టెలీకం,మోబైల్,సీసీ టీవీకేమెరాలు,ఇతర పరికరాల వ్యాపారాలు భారీ స్థాయిలో జరిగాయని గణాంకాలతో సహా వివరించింది.  ఉత్తర ప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థ పరిపుష్టతకు మహాకుంభమేళా ఎంతగానో దోహదపడింది. .యూపీ ప్రభుత్వం మహా కుంభమేళా నిర్వహణలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను విస్తృతంగా ఉపయోగించింది. కుంభమేళా ప్రదేశం 4 వేల ఎకరాల వైశాల్యంలో 2750 సీసీ కెమెరాలు పర్యవేక్షణలో ఉంది.ఇందులో 250 ఏఐ ఆధారిత కెమెరాలు ఉన్నాయి. ఇవన్నీ సమాచారాన్ని కమాండ్ సెంటర్ కు నిరంతరం అందించాయి. ఎంతమంది వస్తున్నారు,పార్కింగ్ స్థలంలో వాహనాలు సంఖ్య, కూడళ్లలో రద్దీ పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా యూసీ సర్కార్ ఈ ఏర్పాట్లు చేసింది.    మహాకుంభ్ సందర్బంగా 45 రోజులపాటు 24X7 దేదీప్యమానంగా వెలుగొందిన ప్రయాగ్ రాజ్  మహాశివరాత్రి తరువాత వెలవెలబోతుంది. దేశ జనాభా 45 కోట్లు. వీరిలో  110 కోట్ల మంది హిందువులు. మహాకుంభ్ ముగిసే సరికి  65 కోట్లమంది పైగా పుణ్య స్నానాలు ఆచరించారంటే.. దాదాపు దేశంలోని హిందువులలో దాదాపు సగం మందికి పైగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని పునీతులయ్యారని ధార్మిక సంఘాలు చెబుతున్నాయి. 
ముగింపు దశకు మహా కుంభమేళా.. అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుక Publish Date: Feb 26, 2025 8:52AM

బొత్స ప‌వ‌న్ జ‌పం‌.. వైసీపీలో టెన్ష‌న్‌?

మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స స‌త్య‌నారాయ‌ణ రూట్ మార్చారా..?  వైసీపీలో ఉంటే రాజ‌కీయ భ‌విష్య‌త్తు ఉండ‌ద‌ని  భావిస్తున్నారా..? వెంటనే కాకపోయినా కొంత కాలం తరువాతైనా  జ‌న‌సేన గూటికి చేరే దిశగా బొత్స వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారా.. అంటే రాజకీయవర్గాల నుంచే కాకుండా వైసీపీ వర్గాల నుంచీ అవున‌నే సమాధానమే వస్తోంది. గ‌తంలోనూ బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ వైసీపీని వీడుతార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోర పరాజయం తరువాత బొత్స స‌త్య‌నారాయాణ కొద్ది కాలం పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉన్నారు. ఈ క్ర‌మంలో అత‌ను జ‌న‌సేన పార్టీలో చేరతార‌ని ప్ర‌చారం జ‌రిగింది. జ‌న‌సేన పార్టీకి చెందిన ముఖ్య‌ నేత‌లు కొంద‌రు బొత్స ను క‌లిసి పార్టీలోకి  ఆహ్వానించార‌న్న వార్త‌లూ వ‌చ్చాయి. ఆ స‌మ‌యంలో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు రావ‌డంతో వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అల‌ర్ట్ అయ్యారు. ఉమ్మడి విశాఖపట్టణం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును ప్ర‌క‌టించారు. తెలుగుదేశం కూటమి నుంచి ఎవరూ పోటీ చేయకపోవడంతో ఆయన ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్ప‌ట్లో .. విజయనగరం జిల్లాకు చెందిన వ్యక్తికి విశాఖపట్టణం నుంచి ఎమ్మెల్సీ ఇవ్వడంపై వైసీపీలో కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినప్పటికీ బొత్సకే జ‌గ‌న్ ప్రాధాన్యత  ఇచ్చారు. త‌ద్వారా వైసీపీని వీడ‌కుండా బొత్స‌కు జ‌గ‌న్ అడ్డుక‌ట్ట వేశార‌న్న ప్ర‌చారం అప్పట్లో గట్టిగా జ‌రిగింది. ఎమ్మెల్సీగా ఎన్నిక‌యిన త‌రువాత బొత్స స‌త్య‌నారాయ‌ణ వైసీపీలో కీల‌క భూమిక పోషిస్తున్నారు. మండ‌లిలో విప‌క్ష నేత‌గా కూట‌మి ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌పై మంత్రుల‌ను నిల‌దీస్తున్నారు. వైసీపీ త‌ర‌పున గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి గైర్హాజ‌రు కావ‌డంతో.. శాస‌న మండ‌లిలోనే ప్ర‌భుత్వాన్ని నిల‌దీయాల‌ని వైసీపీ నిర్ణ‌యించింది. దీంతో విప‌క్ష నేత‌గా మండ‌లిలో వైసీపీ వాయిస్ను బొత్స బ‌లంగానే వినిపిస్తున్నారు. అయితే, వైసీపీలో అంత‌ర్గ‌తంగా జ‌రుగు తున్న ప‌రిణామాల‌తో బొత్స అసంతృప్తితో ఉన్న‌ట్లు తెలుస్తోంది. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీసుకుంటున్న ప‌లు నిర్ణ‌యాలను ఆయ‌న త‌ప్పుబ‌డుతున్నారని, అయినా జ‌గ‌న్ బొత్స‌ సూచ‌న‌లు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌టం లేద‌న్న ప్ర‌చారం వైసీపీ వ‌ర్గాల్లో జ‌రుగుతున్నది. ప్ర‌ధానంగా అసెంబ్లీ స‌మావేశాల‌కు జ‌గ‌న్ స‌హా వైసీపీ ఎమ్మెల్యేలు హాజ‌రు కావాల‌ని బొత్స సూచించార‌ని స‌మాచారం. అసెంబ్లీలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ప్ర‌శ్నించాల‌ని త‌ద్వారా ప్ర‌జ‌ల్లోకి మంచి మెస్సేజ్ వెళ్తుంద‌ని, అసెంబ్లీకి వెళ్ల‌కుండా ఉండ‌టం ద్వారా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై వైసీపీ ప‌ట్ట‌డంలేద‌న్న భావ‌న క‌లుగు తుంద‌ని జ‌గ‌న్ దృష్టికి బొత్స తీసుకెళ్లార‌ని, కానీ, బొత్స సూచ‌న‌ను జ‌గ‌న్  ఏమాత్రం ప‌ట్టించుకోలేద‌ని వైసీపీ వ‌ర్గాల్లో గతంలో చ‌ర్చ జ‌రిగింది.  బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉంది. ఆయ‌నకు అన్ని పార్టీల నేతలతోనూ సత్సంబంధాలు ఉన్నాయి. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్ లో మంత్రి కొన‌సాగిన బొత్స‌.. రాష్ట్ర రాజ‌కీయాల్లో కీల‌క భూమి పోషించారు. వైఎస్ఆర్ మ‌ర‌ణం త‌రువాత కూడా కాంగ్రెస్ పార్టీలో ముఖ్య‌నేత‌ల్లో ఒక‌రిగా కొన‌సాగారు. ఉత్త‌రాంధ్ర ప్రాంతంలో ప్ర‌జాబ‌లం క‌లిగిన నేత‌గా బొత్స ఎదిగారు. కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన బొత్స‌కు ఆ సామాజిక వ‌ర్గం ఓట‌ర్ల మ‌ద్ద‌తు ఎక్కువే. 2014 ఎన్నికల తరువాత వైసీపీలో చేరిన బొత్స‌కు జ‌గ‌న్ ప్రాధాన్య‌త ఇచ్చా రు. వైసీపీ ప్ర‌భుత్వంలో విద్యాశాఖ మంత్రిగా బొత్స ప‌నిచేశారు. వైసీపీ ప్ర‌భుత్వం తీసుకున్న ప‌లు నిర్ణ‌యాల‌ ప‌ట్ల అప్ప‌ట్లో బొత్స అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ముఖ్యంగా సినీ హీరోల ప‌ట్ల జ‌గ‌న్ ప్ర‌వ‌ర్త‌న‌ను బొత్స ఖండించిన‌ట్లు అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. చిరంజీవి కుటుంబంతో బొత్స‌కు స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ తోనూ బొత్సకు మంచి సంబంధాలు ఉన్నాయి. గ‌త అసెంబ్లీ స‌మావేశాల స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ద్ద‌కు వెళ్లి బొత్స ప్ర‌త్యేకంగా మాట్లాడారు. అంతే కాదు.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను బొత్స విమ‌ర్శించిన సంద‌ర్భాలు చాలా త‌క్కువే. దీంతో వైసీపీలోని ప‌లువురు నేత‌లు బొత్స తీరును త‌ప్పుబ‌డుతున్నారు. జగన్ కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సిందేనని  వైసీపీ ఎమ్మెల్యేలంతా బాయ్ కాట్ చేస్తే.. జగన్ కు కాకపోతే కనీసం పవన్ కు అయినా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని బొత్స అన‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. శాసనమండలిలో కానీ.. మరో చోట కానీ పవన్ కు  వ్యతిరేకంగా బొత్స‌ మాట్లాడకపోవడం వైసీపీలోనూ చర్చనీయాంశమవుతుంది. జగన్ మోహన్ రెడ్డి  తన పార్టీ నేతలంతా పవన్ ను దూషించాలని  కోరుకుంటారు. కానీ, బొత్స మాత్రం మా మంచి పవన్ అంటుండటంతో ఆయన చూపు జనసేన వైపు ఉందన్న భావన వైసీపీ వర్గాల్లోనే వ్యక్తం అవుతోంది.  బొత్స స‌త్య‌నారాయ‌ణ రాజ‌కీయంగా ఢక్కామొక్కీలు తిన్న రాజకీయ నేత. సరైన సమయంలో సరైన నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఆయన తీరు ఉంద‌ని ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ రోజు కాకపోతే రేపైనా బొత్స జ‌న‌సేన‌సేలో చేర‌డం ఖాయ‌మ‌న్న వాద‌న వైసీపీ వ‌ర్గాల నుంచి గట్టిగా వినిపిస్తోంది.  మ‌రోవైపు.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌ట్ల‌ బొత్స‌ ప్రేమ‌గా ఉండ‌టానికి మ‌రో కార‌ణం కూడా ఉందంటున్నారు.  బొత్స‌కు బ‌ల‌మైన ఓటు బ్యాంకు కాపులే. ప్ర‌స్తుతం ఆ సామాజిక‌వ‌ర్గం ప్ర‌జ‌లు ఎక్కువ‌గా జ‌న‌సేన వైపే ఉన్నారు. ప‌వ‌న్ ను విమ‌ర్శిస్తే త‌న‌కు బ‌ల‌మైన ఓటు బ్యాంకుగా ఉన్న ఆ సామాజిక వ‌ర్గం ఓటర్లు దూర‌మ‌వుతార‌న్న భావ‌న‌లో బొత్స‌ ఉన్నార‌ట‌. మొత్తానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ పై బొత్స ప్రేమ‌.. వైసీపీ వ‌ర్గాల‌ను టెన్ష‌న్ పెడుతుంది. 
బొత్స ప‌వ‌న్ జ‌పం‌.. వైసీపీలో టెన్ష‌న్‌? Publish Date: Feb 26, 2025 5:59AM

300 కి.మీ. దూరం 30 నిమిషాల్లోనే.. ముంబై- అహ్మదాబాద్‌ల మధ్య హైపర్‌లూప్ ట్రాక్

దేశంలో మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ముంబై- అహ్మదాబాద్ నగరాల మధ్య సిద్ధమవుతోంది. దీనికోసం ట్రాక్ పనులు కూడా జరుగుతున్నాయి. మరోవైపు దేశంలో మొట్టమొదటి హైపర్‌లూప్ ట్రాక్ కూడా రెడీ అయింది. ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారికంగా వెల్లడించారు. ఐఐటీ మద్రాస్ సహకారంతో భారతీయ రైల్వే, ఈ హైపర్‌లూప్ ట్రాక్‌ను 422 మీటర్ల మేరకు సిద్ధం చేసినట్లు తెలిపారు. అంటే మీరు ఢిల్లీ నుంచి జైపూర్ వరకు దాదాపు 300 కి.మీ. దూరాన్ని కేవలం 30 నిమిషాల్లోనే ప్రయాణించవచ్చన్నారు. హైపర్‌లూప్ ట్రాక్‌లో గరిష్ట వేగం గంటకు 600-1200 కి.మీ. కావడం విశేషం. భారతదేశంలో ప్రజా రవాణాను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే హైపర్ లూప్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. హైపర్‌లూప్ ప్రాజెక్టులో ఓ రైలును ప్రత్యేకంగా రూపొందించిన ట్యూబ్‌లో నడిపిస్తారు. అది కూడా అధిక వేగంతో నడుస్తుంది. ఇది ప్రజా రవాణాను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది. ఇప్పుడు దేశంలో మొట్టమొదటి హైపర్‌లూప్ రైలు ట్రాక్ సిద్ధమైనందున, త్వరలో దానిపై ట్రయల్ రన్స్ ప్రారంభమవుతాయి. దేశంలో వాక్యూమ్ ట్యూబ్ ఆధారిత హైపర్‌లూప్ రైలు ప్రయాణం మొదలవుతున్న నేపథ్యంలో, ఇది దేశంలో ఐదో వేగవంతమైన రవాణా విధానం కానుంది. హైపర్‌లూప్‌లో రైలు ప్రయాణ వేగం గంటకు 600-1200 కి.మీ. వరకు ఉంటుంది. నివేదికల ప్రకారం ఇండియన్ హైపర్‌లూప్ టెస్ట్ ట్రాక్‌ను గంటకు 600 కిలోమీటర్ల వేగంతో పరీక్షించనున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా 300 కిలోమీటర్ల ప్రయాణాన్ని కేవలం 30 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. మరోవైపు దేశంలో ఇప్పటికే బుల్లెట్ రైలును ప్రారంభించేందుకు సన్నాహాలు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. గత సంవత్సరం ఏప్రిల్ 2024లో రైల్వే మంత్రి సమాచారం ఇస్తూ, భారత రైల్వేలు 2026 నాటికి దేశంలో మొదటి బుల్లెట్ రైలును నడుపుతాయన్నారు. ఈ నేపథ్యంలో దేశంలో మొదలయ్యే హై స్పీడ్ బుల్లెట్ రైలు వేగం గంటకు 320 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అలా చూసినా కూడా హైపర్‌లూప్ ద్వారా ఈ ప్రయాణ దూరాన్ని కేవలం 30 నిమిషాల్లోనే చేరుకోవచ్చు.
 300 కి.మీ. దూరం 30 నిమిషాల్లోనే.. ముంబై- అహ్మదాబాద్‌ల మధ్య హైపర్‌లూప్ ట్రాక్ Publish Date: Feb 25, 2025 5:02PM