Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఆఫీస్ కాదది..రాసలీలకు కేరాఫ్
posted on: Mar 10, 2017 4:50PM

వృత్తిని దైవంగా..పనిచేసే చోటును దేవాలయంగా భావించే దేశం మనది..ఇలాంటి చోట్ల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అక్కడ పనిచేసే వారిదే. ఉద్యోగులను బట్టే ఇలాంటి ప్రాంతాలకు పవిత్రత చేకూరుతుంది. అలాంటి చోటును బెడ్‌రూంగా మార్చేసి..తమ ఛాంబర్లలో సరసాలు ఆడుతూ కార్యాలయ పవిత్రతను మంట కలుపుతున్నారు కొందరు కామాంధులు. ఇది ఎక్కడో జరిగింది కాదు..పౌరుషాల గడ్డ కడపలో. నగర ప్రజల బాగోగులు చూసే మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలోనే జరుగుతోంది ఈ బూతు పురాణం.
కార్యాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లోని రెండు ఛాంబర్లలో, రెండవ అంతస్తులోని ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఒక ఛాంబర్‌లో రాసలీలలు సాగుతున్నట్లు ఇక్కడి ఉద్యోగులు చెవులు కోరుక్కుంటున్నారు. ఇద్దరు అధికారులు, ఒక జూనియర్ అసిస్టెంట్ ఇలాంటి పనులు చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఉద్యోగులు మంచి వాతావరణంలో పనిచేయాలనే ఉద్దేశ్యంతో లక్షల రూపాయలు ఖర్చు చేసి చిన్న చిన్న ఛాంబర్లు ఏర్పాటు చేసి అధికారులకు కేటాయించింది ప్రభుత్వం.
సర్కార్ చేసిన ఆ మంచి పని వీరిని చెడ్డ పనులు చేసేలా ప్రేరేపించింది. ప్రతి ఛాంబర్‌కు ఏసీలు ఉండటంతో తలుపులు తప్పనిసరిగా మూసివేస్తారు. దీనిని ఆసరాగా తీసుకున్న కొందరు అధికారులు ఛాంబర్లలో రాసలీలలు సాగిస్తున్నారు. ఇది తోటి ఉద్యోగులకు ఇబ్బందికరంగా మారింది. ఏదైనా పనిమీద కొందరు ఉద్యోగులు ఛాంబర్‌లోకి వెళ్లినప్పుడు అధికారులు "మాంచి పని"లో ఉంటున్నారు. దీనిని చూసిన వారు తలదించుకొని బయటకు వచ్చేస్తున్నారు. మహిళా ఉద్యోగుల పరిస్థితైతే మరీ దారుణం. ఇదంతా పక్కనబెడితే ఏకంగా కమీషనర్ ఛాంబర్‌నే బెడ్‌రూమ్‌గా మార్చేయటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సమావేశాలనో, రివ్యూ మీటింగ్‌లనో కమీషనర్ తరచూ అమరావతి వెళ్తుండటంతో ఉద్యోగులు ఆడింది ఆట, పాడింది పాట అన్నట్లు సాగుతోంది. ఇంత జరుగుతున్నా విషయం కమీషనర్ దృష్టికి వెళ్లకపోవడం ఆలోచించాల్సిన విషయం..దీనిని బట్టి ఆ కామాంధులు ఎంత తెలివిగా మేనేజ్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే కొందరు ఉద్యోగులు మాత్రం వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే బెడ్‌రూంలుగా మారిన ఛాంబర్ల తలుపులు తెరిచిపెట్టాలని వారు కోరుతున్నారు.






