Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జడ్జ్ గారు జంప్! అరెస్ట్ చేసే పనిలో మూడు రాష్ట్రాల పోలీసులు!
posted on: May 11, 2017 10:17AM
.jpg)
జ్యోతిష్యం నిజమో కాదోగాని… గుడ్ టైం, బ్యాడ్ టైం మాత్రం నిజమే! మన ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా లైఫ్ లో బ్యాడ్ పీరియడ్స్ వస్తుంటాయి. ఇప్పుడు అలాంటి కష్ట కాలమే ఆ జడ్జ్ గారికొచ్చింది! తన కెరీర్లో ఎందరికో జైలు శిక్షలు వేసిన ఆయన మరో నెల రోజుల్లో రిటైర్ కాబోతున్నారు. పాపం… సరిగ్గా క్లైమాక్స్ దశలో ఆయనకు శని మహాదశ మొదలైనట్టుంది! రకరకాల మలుపుల మధ్య జడ్జిగారికే జైలు శిక్ష పడింది! అయితే, ఆర్నెళ్లే కదా వెళ్లి వచ్చేద్దాం అనుకోలేదు పెద్దాయన. మూడు రాష్ట్రాల పోలీసులకి మూడు చెరువుల నీళ్లు తాగిస్తూ అదృశ్యమైపోయాడు! ఇప్పుడిక ఎప్పుడూ దొంగల్ని వేటాడే ఖాకీలకి గౌరవనీయులైన న్యాయమూర్తిగార్ని దొరకబుచ్చుకోవటం పెద్ద సవాలే అయి కూర్చుంది!
జస్టిస్ కర్ణన్ కేసు ఇప్పుడు దేశంలో పెద్దగా చర్చగా మారింది. ఆయన సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తితో సహా చాలా మంది జడ్జీలను అవినీతిపరులంటూ కామెంట్ చేశాడు. అంతే కాదు, తాను దళితుడ్ని కాబట్టి కుల వివక్ష చూపిస్తున్నారని కూడా ఆరోపించాడు. ఇక ఆ తరువాత జరిగిన పరిణామాల్లో సుప్రీమ్ కు, కోల్ కతా హైకోర్ట్ న్యాయమూర్తి అయిన కర్ణన్ కు తీవ్రమైన యుద్ధం జరిగింది. ఎప్పుడూ అనూహ్యంగా ప్రవర్తించే జస్టిస్ కర్ణన్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తికే ఐదేళ్లు కఠిన కారాగారా శిక్ష విధించాడు. దానికి బదులుగా సుప్రీమ్ కూడా జస్టిస్ కర్ణన్ కు ఆరు నెలల జైలు శిక్ష వేసింది! కాని, మొండి పట్టుదలకి బాగా ఫేమస్ అయిన కర్ణన్ కోర్టు వేసిన శిక్షను గంభీరంగా అంగీకరించలేదు! వున్నట్టుండీ ప్రభుత్వ అతిథి గృహం నుంచీ మాయమైపోయాడు! పోలీసులు అవాక్కైపోయారు!
సుప్రీమ్ కోర్టు ఒక పదవిలో వున్న జడ్జీకి శిక్ష వేసి సంచలనం రేపితే… స్వయంగా జడ్జీ అయి వుండి పోలీసులకి చిక్కకుండా అదృశ్యమై కర్ణన్ కలకలం రేపుతున్నాడు. ఆయన కోల్ కతా హైకోర్ట్ న్యాయమూర్తి కాగా సుప్రీమ్ తీర్పు సమయంలో చెన్నైలో వున్నాడు. అక్కడ్నుంచి కోల్ కతా పోలీసులు అరెస్ట్ చేసేందకు వచ్చేటప్పటికి కనిపించకుండాపోయాడు. కోల్ కతా పోలీసు బృందం తమిళ పోలీసుల్ని వెంటబెట్టుకుని వచ్చి నెల్లూరులో సోదాలు జరిపింది. ఇందుకు ఏపీ పోలీసులు కూడా సహకరించారు! మొత్తానికి మూడు రాష్ట్రాల పోలీసులు వేట కొనసాగించిన సార్ వారు ఎక్కడ దొరకలేదు!
జస్టిస్ కర్ణన్ కేసులో కొసమెరుపు ఏంటంటే… తమిళనాడులోని ఆయన స్వగ్రామంలో ఊరి జనం తమ జడ్జీగారికి జైలు శిక్ష రద్దు చేయాలని ధర్నా చేశారట! ఏది ఏమైనా మరో నెల రోజుల్లో రిటైర్ అవ్వనున్న సీనియర్ న్యాయమూర్తి సుప్రీమ్ తీర్పును గౌరవిస్తూ అరెస్ట్ అయిపోయి వుంటే ఎంతో బావుండేది అంటున్నారు విశ్లేషకులు. ఎన్నో తీర్పులిచ్చిన ఆయన దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు అమలు విషయంలో పోలీసులకి సహకరించాల్సింది!


.jpg)



