జూబ్లీహిల్స్ ‌లో అత్యల్ప పోలింగ్ నమోదు

 

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఫైనల్ పోలింగ్ శాతం 48.43%  నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కును వినియోగించుకోవడంలో హైదరాబాదీలు వెనకడుగు వేస్తున్నారు. ఇది మరోసారి నిరూపించారు. సెలవు ఇచ్చి రండి వచ్చి తమకు నచ్చిన నాయకులను ఎన్నుకొమని చెప్పిన జూబ్లీ ఓటర్ల ఆమడ దూరం పోయారు. దేశంలో 8 స్థానాలకు ఉప ఎన్నిక జరగగా అత్యల్పంగా జూబ్లీహిల్స్‌లోనే 48.43 శాతం నమోదు అయింది.

దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యం సమస్యతో మృతి చెందటంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది.  ఓట్ల లెక్కింపు ఈ నెల 14న జరగనుంది. జూబ్లీహిల్స్‌ బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు నిలిచారు. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు.  ప్రధానంగా పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఉన్నాట్లు తెలుస్తోంది.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu