ముగిసిన జూబ్లీ పోలింగ్... ఎగ్జిట్ పోల్స్‌పై ఉత్కంఠ
posted on Nov 11, 2025 5:18PM

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో సాయంత్రం 5 గంటల వరకూ 47.16 శాతం నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఆయా పోలింగ్ బూత్‌లలో ఓటర్లు తమ హక్కును వినియెగించుకుంటున్నారు. మరో అరగంట పోలింగ్ అవకాశం ఉండడంతో పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. మొత్తం 4,01,365 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తుది ఫలితం ఈ నెల 14వ తేదీన తెలుస్తుంది.
పలు సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్‌ను ప్రకటించేందుకు రెడీగా ఉన్నాయి.. ఈ పోల్స్ ఫలితాలు ప్రధానంగా రెండు పార్టీల మధ్యే పోటీ ఉంది. అనేక సంస్థల అంచనాల ప్రకారం.. అధికార కాంగ్రెస్ పార్టీ లేదాబీఆర్‌ఎస్ ల మధ్యే గెలిచే ఛాన్స్ ఉంది. తక్కువ పోలింగ్ శాతం కారణంగా పోల్స్ అంచనాలలోనూ కొంత భిన్నత్వం కనిపించనుంది.