కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కేసు నమోదు

 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ సంద‌ర్భంగా ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియామ‌వ‌ళిని ఉల్లంఘించిన ప‌లువురిపై హైద‌రాబాద్ సిటీ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యేలు బీర్ల ఐల‌య్య,  రామ‌చంద్ర‌నాయ‌క్‌,  రాందాస్ పై మ‌ధురాన‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్‌లో రెండు కేసులు , మాజీ ఎమ్మెల్యేలు  దాస్యం విన‌య్ భాస్క‌ర్,  మెతుకు ఆనంద్‌పై బోర‌బండ పోలీస్ స్టేష‌న్‌లో ఒక కేసు న‌మోద‌య్యాయి.

ఎన్నికల కోడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చ‌ట్ట‌ప్ర‌కారం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు హైదరాబాద్ సిటీ పోలీసులు స్ప‌ష్టం చేస్తున్నారు. ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికలు శాంతియుతంగా, పారదర్శకంగా జరగాలంటే ప్రతి ఒక్కరూ ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియామ‌వ‌ళిని గౌర‌వించాల‌ని సూచిస్తున్నారు.

ఎవరైనా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినట్లు గ‌మ‌నిస్తే వెంటనే డయల్ 100 ద్వారా సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు పోలింగ్ మధ్యాహ్నం 3 గంటల వరకు 40.20 శాతం మాత్రమే నమోదైంది. పోలింగ్ మొదలై సుమారు 9 గంటలు గడుస్తున్నా ఓటింగ్ శాతం పెరగలేదు. చివరి రెండు గంటల్లో పోలింగ్ పెరిగే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu