Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జయలలిత మా అమ్మ... డీఎన్ఏ టెస్ట్ కు రెడీ...
posted on: Nov 27, 2017 3:01PM
.jpg)
తమిళనాడులో ఇప్పుడు మరో ఆసక్తికరమైన అవసరం మీద చర్చ జరుగుతుంది. అదేంటంటే..తాను జయలలిత కూతురునని అమృత అనే యువతి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణకు రావడమే. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణించిన అనంతరం.. పలువురు తాము జయలలిత సంతానం అని తెరపైకి వచ్చి హడావుడి చేసిన సంగతి తెలిసిందే కదా. కృష్ణమూర్తి అనే వ్యక్తి తాను జయలలిత కుమారుడినని.. జయలలిత, నటుడు శోభన్ బాబులకు జన్మించానని, ఆమె ఆస్తులకు తానే వారసుడినని.. కోర్టును ఆశ్రయించాడు. ఏమైంది... ఆ వ్యక్తి తప్పుడు పత్రాలు సృష్టించాడని... జడ్జి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. జైలుకు పంపించారు.
అయితే ఇప్పుడు అమృత అనే యువతి మాత్రం ఏకంగా సుప్రీంకోర్టునే ఆశ్రయించడంతో అందరూ షాకవుతున్నారు. ఎన్నోఅనుమానాలు..మరెన్నో సందేహాలకు తెరలేపారు. ఎందుకంటే.. ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించడమే కాదు.. దీనిపై రాష్ట్రపతి, ప్రధాన మంత్రులకు సైతం లేఖలు కూడా రాసింది. అక్కడితో ఆగకుండా... ఏకంగా తనకు డీఎన్ఏ టెస్ట్ కూడా చేసుకోమని ఆఫర్ ఇచ్చింది. ఆస్తి పాస్తుల కోసం నేనమి పోరాడటం లేదు.. నేను జయలలిత బిడ్డను అని తెలిసిన తరువాతే ఆమెపై ప్రేమ కలిగింది అని చెబుతుంది. దీంతో ఇప్పుడు డీఎన్ఏకు టెస్ట్ కు కూడా రెడీ అని అమృత చెబుతుండటంతో అన్నాడీఎంకే డైలమాలో పడింది. ఈమె చెబుతున్నది నిజమేనా అన్న అనుమానాలు మొదలయ్యాయి వారిలో. అసలు దీనిపై ఎలా స్పందించాలో కూడా తెలియడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు... దీనివల్ల జయలలితకు ఎక్కడ చెడ్డ పేరు వస్తుందా అని కూడా భయపడుతున్నారు. అంత ధైర్యంగా ఆమె డీఎన్ఏ టెస్ట్ కు రెడీ అయ్యిందంటే.. ఆమెకు అంత కాన్ఫిడెన్స్.. అంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది అని అనుకుంటున్నారు.
అసలు అమృత అనే యువతి పేరు గతంలో కూడా ఒకసారి బయటకు వచ్చింది. 1996 లో తాను జయను మొదటిసారిగా కలిసినట్టు చెప్పారు. దానిని పోయెస్ గార్డెన్ వర్గాలు కూడా ధ్రువీకరించాయి. ఆ తరువాత కూడా రెండు మూడుసార్లు ఆమె పోయెస్ గార్డెన్ కు వెళ్లారని.. ఇక జయపై కేసులు నమోదైన సమయంలో అమృత కొన్ని రోజుల పాటు అక్కడే ఉన్నారని... అన్నాడీఎంకే సీనియర్ నేత ఒకరు తెలిపారు. అంతేకాదు ఇక జయలలిత మరణానంతరం ఆమె... కుటుంబం గురించి బయటి ప్రపంచానికి తెలియడం జయలలితకు ఇష్టం ఉండదు... ఆమెతో ఎంత దగ్గరి బంధుత్వమున్నా బయటకు చెప్పుకోలేని దీనస్థితి మాది అని వాపోయారు. అయితే జయలలిత తనకు పెద్దమ్మ అని మాత్రమే అప్పట్లో చెప్పారు. ఇప్పుడు మాత్రం ఏకంగా తాను జయలలిత కూతురినని ముందుకొచ్చింది. సుప్రీంకోర్టులో ఈరోజు ఆమె పిటిషన్ విచారణకు రానుంది. మరి చూద్దాం... కోర్టు ఏం తీర్పునిస్తుందో.. డీఎన్ఏ టెస్ట్ కు ఓకే చెబుతుందో.. లేదో...?



.jpg)



