Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...లోక్ సత్తాలో ఏం జరుగుతోంది?
posted on: Nov 10, 2014 3:17PM

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుంది లోక్ సత్తా పరిస్థితి. ఎందుకనో అనుకున్న స్థాయిలో లోక్ సత్తా ఎదగలేకపోయింది. ఒక్కరంటే ఒక్క ఎమ్మెల్యే కూడా ఆ పార్టీకి లేడు. చివరకు జేపీ కూడా దారుణమైన ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. ఎన్నికల ముందు టీడీపీతో పొత్తు ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. జేపీ కొంత చొరవ చూపిస్తే ఈ పొత్తు పట్టాలెక్కేదని ఇప్పటికీ చాలామంది చెబుతుంటారు. జేపీ లాంటి క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడు చట్టసభలో లేకపోవడం దారుణమన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికైనా లోక్ సత్తా విధానాలు మార్చుకోవాల్సిన అవసరమైతే ఖచ్చితంగా ఉంది.
అసలే గడ్డు పరిస్థితి అంటే దీనికి తోడు లోక్ సత్తా కుమ్ములాటలు కూడా పెరిగిపోయాయి. ఏకంగా జేపీనే పార్టీ నేతలు నిలదీసే పరిస్థితి వచ్చింది. మొన్న ఆ మధ్య జేపీని కొందరు బహిరంగంగానే తప్పుబట్టారు. దీంతో ఏం చేయాలో తెలియక ఆయన బిక్కమొహమేశారు. అప్పటికప్పుడు ఎలాగోలా కవర్ చేసుకున్నారు కానీ ఈ ఇష్యూతో ఆయనకు పార్టీపై పట్టు లేదన్న మాట మాత్రం స్పష్టమైపోయిందంటున్నారు పరిశీలకులు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పొత్తులు అనివార్యం. ఏ పార్టీ కూడా సొంతంగా ఎదగలేదు. ఈ చిన్న లాజిక్ కూడా జేపీకి తెలియదా? పార్టీ నేతలకంటే అంత అనుభవం లేదు. వారు పొత్తులు వద్దంటారు. కానీ లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడిగా పార్టీకి ఏది మంచి నిర్ణయమో జేపీకి తెలియకపోతే ఎలా? ఇంకా పాతకాలపు పద్దతులనే ఫాలో అవుతామంటే లోక్ సత్తా ఎదిగేదెప్పుడు? మన దగ్గర ఏ ఆధారం లేనప్పుడు దొరికిన ఏదో ఒక వస్తువును పట్టుకొని పైకొచ్చే ప్రయత్నం చేయాలి. అంతేకానీ దానికి ముక్కు లేదు. మూతి లేదంటూ కూర్చుంటే ఎలా? చివరకు లోక్ సత్తా నేతలే జేపీని నిలదీస్తున్నారంటే ఆ పార్టీలో ఇంటర్నల్ ఏం జరుగుతోంది ఎవరైనా ఊహించుకోవచ్చు.
జేపీకి మంచి పేరుంది. ఇతర పార్టీల నేతలు కూడా ఆయన మంచి గౌరవమిస్తారు. అలాంటి నేత తమతో చట్టసభల్లో కూర్చొని ఉండాల్సిందని ఇప్పటికీ చింతించే ఎమ్మెల్యేలు చాలామంది. కానీ ఏం చేస్తాం? ఎన్నికల్లో ఏదో ఒక పెద్ద పార్టీతో కలిసి పోటీ చేయకపోతే ఎలా గెలుస్తారు? అందుకే ఇప్పటికైనా జేపీ అంతర్మథనం చేసుకోవాలి. పార్టీని బతికించుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే లోక్ సత్తా ఉనికికే ప్రమాదం పొంచి ఉందంటున్నారు విశ్లేషకులు.


.jpg)



