Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రోజూ నవ్వి తీరాల్సిందే.. జపాన్‌లో కొత్త చట్టం!
posted on: Jul 12, 2024 12:22PM
జపాన్‌లో ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం ప్రజలు రోజుకు ఒక్కసారైనా నవ్వితీరాల్సిందే. జపాన్‌లోని యమగట ప్రాంతానికి చెందిన స్థానిక ప్రభుత్వం ఈ చట్టం చేసి, ఆర్టినెన్స్ జారీ చేసింది. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. రోజుకు ఒక్కసారి నవ్వడం మాత్రమే కాకుండా, నవ్వుతో కూడిన వాతావరణాన్ని ప్రోత్సహించాలని కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది. ప్రతినెలా ఎనిమిదో తేదీని ప్రత్యేకంగా ‘హాస్యంతో ఆరోగ్యం’ కోసం కేటాయించాలని జీవోలో పేర్కొంది. అయితే, ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. నవ్వాలంటూ చట్టం ఏంటయ్యా బాబూ అని ప్రతిపక్షాలవాళ్ళు అంటుంటే, ఇదేమీ జరిమానాలు విధించే చట్టం కాదు కాబట్టి లైట్‌గా తీసుకుని నవ్వుకోండి అని అధికారపక్షం అంటోంది.






