Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...టీడీపీ తమ్ముళ్లు ముందు వీటికి సమాధానం చెప్పండి....
posted on: May 4, 2018 6:35PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా దేవ్ ను నియమించిన సంగతి తెలిసిందే. ఇక ఎప్పుడుతే దేవ్ ని నియమిస్తున్నట్టు ప్రకటించారో అప్పటినుండి దేవ్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. దేవ్ అసలు పేరు ఏమనగా.. వాసుదేవ్ అని...పుట్టింది, పెరిగింది కేరాఫ్ చింతల్ బస్తీ అని.. తెలుగులో మాట్లాడటం భేషుగ్గా వచ్చని వార్తలు వచ్చాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే... గతంలో ఈయన భారతీయ జనతా పార్టీకి ప్రతినిధిగా కూడా పనిచేశారని.. అంతే కాదు.. ఈయన తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు దామోదర్ రాజనరసింహకి బంధువు అని పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. దీంతో మరోసారి పవన్ వెనుక బీజేపీ ఉందని వార్తలు వచ్చాయి. ఇత టీడీపీ బీజేపీనే దేవ్ ను పంపిందని అన్నారు. ఇక తనపై వస్తున్న వార్తలపై స్పందించిన దేవ్.. టీడీపీకి ఓ బహిరంగ లేఖ రాసినట్టు తెలుస్తోంది..
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా మొదట కాంగ్రెస్ పార్టీ ఉండేవారు... ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు. అంటే టీడీపీ వెనకాల కాంగ్రెస్ ఉన్నట్టా..? రాష్ట్ర విభజనని తెలుగుదేశం పార్టీనే కాంగ్రెస్ పార్టీ చేత చేయించిందా..? ఎన్టీఆర్ గారి కూతురు పురుంధరేశ్వరి బీజేపీలో ఉన్నాయి.. అంటే బీజేపీ-టీడీపీ ఇంకా కలిసిఉన్నట్టేనా.. రెండూ కలిసి ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా నాటకాలు ఆడుతున్నాయా..? ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని రెండో పెళ్లి చేసుకున్నారు.. ఇప్పుడు ఆమె వైసీపీలో ఉన్నారు.. అంటే వైసీపీ-టీడీపీకి పోలవరంలో జరుగుతున్న అవినీతిలో భాగస్వామం ఉందా...? అని ముందు వీటికి క్లారిటీ ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. మరి దేవ్ వ్యాఖ్యలపై టీడీపీ ఎలా స్పందిస్తుందో చూద్దాం.


.jpg)
.jpg)


