Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కంటతడి పెట్టుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి
posted on: Feb 17, 2026 3:05PM

మహబూబాబాద్ జిల్లా తోర్రూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం సాధించడంపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌కు మెజార్టీ ఉన్నప్పటికీ అధికార బలంతో కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులను దక్కించుకుందని ఆయన ఆరోపించారు.
ఎన్నికల ప్రక్రియలో అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని, తమ పార్టీకి చెందిన నేతలను అక్రమంగా అరెస్ట్ చేసి ఎన్నికలను నిర్వహించారని ఎర్రబెల్లి విమర్శించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనైన ఎర్రబెల్లి దయాకర్ రావు కంటతడి పెట్టుకున్నారు. క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు ఇప్పుడు తాము ఏమి సమాధానం చెప్పాలని ప్రశ్నిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ నేతలు, కార్యకర్తలు ఎదుర్కొన్న పరిస్థితులు బాధ కలిగించాయని, ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే రాజకీయాలు జరగాలని ఆయన అన్నారు.



.webp)


