Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బలూచిస్థాన్ భారత్ అనుకూల నినాదాలు.. టీమ్ ఇండియా విజయంపై హర్షాతిరేకాలు
posted on: Feb 16, 2026 10:43AM

టి20 వరల్డ్ కప్ లో భాగంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఆదివారం (ఫిబ్రవరి 15) జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్ లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంపై దేశ వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. వరల్డ్ కప్ విజయంతో సమానమైన విజయంగా భారత అభిమానులు దీనిని అభివర్ణిస్తున్నారు. దాయాది దేశంపై తన విజయాల సంఖ్యను టీమ్ ఇండియా మెరుగుపరుచుకుంది. దేశం నలుమూలలా పాకిస్థాన్ పై భారత్ విజయాన్ని పురస్కరించుకుని సంబరాలు చేసుకున్నారు.
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ దేశంలోని అన్ని ప్రాంతాలలోనూ టీమ్ ఇండియా విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. జనంరోడ్లపైకి వచ్చి త్రివర్ణ పతకాన్ని చేతపట్టి జైభార్, జయహో భారత్ అంటూ నినాదాలు చేస్తూ టపాసులు కాలుస్తూ తమ ఆనందాన్ని, హర్షాతిరేకాన్ని వ్యక్తం చేశారు. ఇది సహజం. అయితే పాకిస్థాన్ భూ భాగంలో కూడా ఇండియా గెలుపును వేడుకగా జరుపుకున్నారు. ఔను బలుచిస్తాన్ లో జనం రోడ్లపైకి వచ్చి టి20 వరల్డ్ కప్ మ్యాచ్ లో పాకిస్థాన్ పై టీమ్ ఇండియా విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. రోడ్లపై డ్యాన్సులు చేశారు. టీమ్ ఇండియాకు, భారత్ కు అనుకూలంగా నినాదాలు చేశారు.
బలూచిస్థాన్ లో పరిస్థితి ఇలా ఉంటే.. పాకిస్థాన్ లోని మిగిలిన ప్రాంతాలలో పాకిస్థాన్ ఓటమిపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. జనం తీవ్ర ఆగ్రహంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డును, జట్టు ఆటగాళ్లను దుమ్మెత్తి పోస్తున్నారు. కొన్ని చోట్ల పాకిస్థాన్ జట్టు ప్రదర్శనపై ఆగ్రహంతో టీవీలను పగులగొట్టిన సంఘటనలు జరిగాయి. ఇందుకు సంబంధించిన వార్తలన పాకిస్థాన్ జాతీయ మీడియా ప్రసారం చేసింది కూడా.






