Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పవన్ కళ్యాణ్.. జగ్గారెడ్డి మధ్య భావసారూప్యం
posted on: May 19, 2014 2:32PM
.jpg)
ప్రభుత్వ మాజీ విప్, కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి భావాలు తనకెంతో నచ్చాయని, తమ ఇద్దరి భావాలూ ఒకేలా వున్నందున ఆయనతో కలిసి పని చేస్తానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. సోమవారం మధ్యాహ్నం పవన్ కళ్యాణ్‌తో జగ్గారెడ్డి సమావేశమైన అనంతరం పవన్ కళ్యాణ్ ఈ భావసారూప్య మేటర్ని బయట పెట్టారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, జగ్గారెడ్డి భావాలు తనకెంతో నచ్చాయని చెప్పారు. ఒకవైపు తెలంగాణవాదం గురించి మాట్లాడుతూనే ఇరుప్రాంత ప్రజల శ్రేయస్సు కోసం జగ్గారెడ్డి తపించారని కొనియాడారు.జగ్గారెడ్డి వంటి వారు ప్రజలకు అవసరమన్నారు. భవిష్యత్తులో జగ్గారెడ్డి, తాము కలసి పనిచేస్తామని చెప్పారు. జనసేన ద్వారా పనిచేయాలా? లేక ఇతర పార్టీలతో కలసి పనిచేయాలా? అనే విషయాన్ని త్వరలోనే నిర్ణయిస్తామని చెప్పారు. అలాగే, పవన్ కళ్యాణ్‌తో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు జగ్గారెడ్డి కూడా ప్రకటించారు.


.jpg)
.jpg)


