పరీక్ష పాసైన వాళ్లకే ప్రొబేషన్!.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

ఏపీ గ్రామ సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం ప్రొబేషన్ డిక్లేర్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇదేమంత హ్యాపీ న్యూస్ కాదని గ్రామ, వార్డుసచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత  పరీక్ష నిర్వహించి మరీ లక్షా 17వేల మందిని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులుగా నియమించింది.

నియామకం సమయంలో వారిని అప్రెంటిస్ ఉద్యోగులుగా పేర్కొంటూ రెండేళ్ల పాటు రూ.15వేల వేతనానికి పని చేయాలని పేర్కొంది. ఆ తరువాత అందరికీ ప్రొబేషన్ ఇస్తామని పేర్కొంది. అయితే ఇప్పుడు మాట మార్చి ప్రభుత్వం నిర్వహించిన డిపార్ట్ మెంట్ పరీక్ష లో పాసైన వారు మాత్రమే ప్రొబేషన్ కు అర్హులంటూ షరతు పెట్టింది. ప్రభుత్వం నిర్వహించిన డిపార్ట్ మెంట్ పరీక్షలో కేవలం 56 వేల మంది మాత్రమే పాసయ్యారంటూ మిగిలిన వారికి ప్రోబేషన్ ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ కు ఆమోదముద్ర వేసినప్పటికీ వారిలో దాదాపు సగం మందికి పైగా ప్రొబేషన్ కు అర్హత లేని వారే కావడంతో వారందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాగా ప్రొబేషన్ ఇచ్చిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు పే స్కేలును ఖరారు చేసిన జగన్ వార్డు సచివాలయ ఉద్యోగులకు పేస్కేలును 23, 120 నుంచి 74 వేల 770 రూపాయలకు, ఇతర సచివాలయ ఉద్యోగులకు 22, 460 నుంచి 72, 810 రూపాయలయకు అటు సచివాలయ ఉద్యోగులకు పే స్కేల్‌ను ఖ‌రారు చేస్తూ కూడా ప్రభుత్వం మ‌రో కీల‌క నిర్ణయం తీసుకుంది పంచాయతీ సెక్రటరీ, వార్డు సెక్రటరీల పే స్కేల్‌ను రూ.23,120 నుంచి రూ.74,770కు, ఇతర సచివాలయ ఉద్యోగుల పే స్కేల్‌ను రూ.22,460 నుంచి రూ.72,810 పెంచుతూ  ఉత్తర్వులు జారీ చేసింది.

దీంతో ప్రోబేషన్ దక్కని సచివాలయ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. జగన్ సర్కార్ విభజించి పాలించు అన్న విధానాన్ని సచివాలయ ఉద్యోగుల విషయంలో అవలంబించి వారి ఐక్యతను దెబ్బతీయాలని చూస్తోందని ఆరోపిస్తున్నారు.