Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జగన్ పొలిటికల్ కామెడీ...
posted on: Jan 20, 2015 8:44PM

కొంతకాలం తర్వాత గూగుల్‌లోకి వెళ్ళి Political comedian అనే మాట కొట్టి ఎంటర్ చేస్తే వైసీపీ అధినేత జగన్ ఫొటోలు కొన్ని లక్షలు కనిపించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఆయన చేస్తున్న కామెడీ స్థాయి అలా వుంది మరి. జగన్ తాను చేసే కామెడీలో బోలెడన్ని విన్యాసాలను ప్రదర్శిస్తున్నారు. వాటన్నిటి గురించి వీలువెంబడి మెల్లమెల్లగా ప్రస్తావించుకుందాం. ఇప్పుడు మాత్రం జగన్ చేస్తున్న ఒక కామెడీ స్కిట్ గురించి ముచ్చటించుకుందాం.
జగన్ ఎప్పుడు జైల్లోకి వెళ్తాడో అనే సందేహాలు ఆయన పార్టీ ఎమ్మెల్యేలలోనే వుంది. అతి త్వరలోనే జగన్ పార్టీ షట్టర్ క్లోజ్ చేసే అవకాశం కూడా వుందన్న అనుమానాలు వారిలో కలుగుతున్నాయి. అందుకే కలుగులోంచి బయటకి వచ్చే ఎలుకల మాదిరిగా జగన్ పార్టీ నుంచి బయటపడిపోతున్నారు. ఇప్పటికే కొంతమంది నాయకులు వైసీపీకి బైబై చెప్పేశారు. మరికొంతమంది తెలుగుదేశం, బీజేపీలతో బేరసారాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ నాయకుడైనా ఏం చేస్తాడు? పార్టీలోంచి బతుకుజీవుడా అనుకుంటూ పారిపోతున్న వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తాడు. వాళ్ళలో తనమీద నమ్మకం పెంచుకునేలా చేస్తాడు. అయితే జగన్ మాత్రం అలా లేడు. పార్టీలోంచి పారిపోతున్నవాళ్ళని ఆపే ప్రయత్నాలు ఎంతమాత్రం చేయడం లేదు. అయినా మన అమాయకత్వంగానీ, జగన్ ఆపినా వాళ్ళు ఆగుతారా...! తన పార్టీలో పరిస్థితి ఇలా వుంటే, జగన్ మాత్రం మరోలా ఆలోచిస్తూ కామెడీ చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో వున్న తెలుగుదేశం పార్టీలో చీలిక తెచ్చి, చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చడానికి పావులు కదుపుతున్నాడు.
నేను ముఖ్యమంత్రినైతే 30 ఏళ్ళు పరిపాలిస్తా అని జగన్ స్టేట్‌మెంట్ ఇచ్చినప్పుడు ఆలు లేదు చూలు లేదు అల్లుడిపేరు జగన్ అనే కొత్త సామెత జనాల మైండులో తక్షణం పుట్టుకొచ్చింది. ఇప్పుడు జగన్ తాను ముఖ్యమంత్రి అయ్యే ఆలోచనను పక్కన పెట్టేసి, చంద్రబాబుని ముఖ్యమంత్రి సీటు మీద నుంచి దించేసే పనిలో బిజీగా వున్నాడు. కొంతమంది తెలుగుదేశం ఎమ్మెల్యేలతో ‘టచ్’లోకి వెళ్ళిన జగన్ వారికి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడట. ఆ ఆఫర్ సారాంశం ఏంటంటే, కొంతమంది తెలుగుదేశం ఎమ్మెల్యేలందరూ ఒక్కటై తెలుగుదేశం పార్టీ నుంచి విడిపోయి బయటకి రావాలి. అలా బయటకి వచ్చిన గ్రూపుకి జగన్ మద్దతు ఇస్తాడు. అలా ఆ గ్రూపు ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని స్థాపించవచ్చు. అప్పుడు ముఖ్యమంత్రి పదవి జగన్‌కి ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీలోంచి విడిపోయిన గ్రూపు నాయకుడే ముఖ్యమంత్రి అయిపోవచ్చు.... ఇదీ జగన్ సార్ ఐడియా. ఆ ఐడియా విన్న సదరు టీడీపీ ఎమ్మెల్యేలు జగన్‌ని కిందనుంచి పైకి, పైనుంచి కిందకి ఎగాదిగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయారట. వెళ్తూ వెళ్తూ తమ చెవుల్లో జగన్‌కి పూలుగానీ కనిపిస్తున్నాయా అనుకుంటూ, చెవులు తడుముకుంటూ వెళ్ళిపోయారట. ఇదండీ జగన్ పథకం. వేరే పార్టీ వాళ్ళని తన పార్టీలోకి వచ్చేలా చేయడాన్ని ‘ఆకర్ష’ పథకం అంటారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఒక గ్రూపును చీల్చి, తాను ఆ గ్రూపుకి తోకలాగా వుండాలనుకుంటున్న జగన్ పథకాన్ని ‘తోకర్ష’ పథకం అనొచ్చేమో!


.jpg)
.jpg)


