జగన్ రాజీనామా వెనుక ఇంత ప్లానా...?


 

జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ చెప్పేదొకటి... చేసేదొకటి. తన పనులకు ఆటంకం రాకుండా ఏవో కుంటిసాకులు వెతుక్కుంటూ..ఏవో చెబుతుంటాడు. తన పాదయాత్ర కోసం అలాంటి సాకే చెప్పాడు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేస్తేనే కానీ అసెంబ్లీ సమావేశాలకు వచ్చేది లేదని చెప్పాడు. అయితే ఆ తరువాత పాదయాత్ర కోసమే జగన్ ఈ ప్లాన్ వేశాడులే అని అందరికీ అర్దమైపోయింది. అయితే ఇప్పుడు మరోసారి అలాంటి ఓ ప్లానే వేయడానికి రెడీ అయ్యాడు. అదేంటంటే... ప్రత్యేక హోదా కోసం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాడట. వినడానికి కాస్త కామెడీగా ఉంది కదా. కామెడీగా ఉన్నా జగన్ వేసిన ప్లాన్ చూస్తే దిమ్మతిరగాల్సిందే. అసలు జగన్ ఉన్నట్టుండి రాజీనామా పల్లవి ఎందుకు అందుకున్నాడబ్బా అని ఆరా తీయగా అసలు నిజం బయటపడింది. అదేంటంటే.. గత డిసెంబర్ లో సుప్రీంకోర్టు.. ఫాస్ట్‌ట్రాక్‌ ప్రత్యేక కోర్టులకు కొన్ని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే కదా. తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న క్రిమినల్‌ కేసుల విచారణను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మార్చి నుంచే పని ప్రారంభించాలని ఆదేశించింది. దీనిలో భాగంగానే...  తెలుగురాష్ట్రాలు, కేరళలో వంద మందిపై ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో విచారణ జరగనుంది. ఇక లిస్టులో పులివెందుల ఎమ్మెల్యే జగన్ గారు కూడా ఉన్నారు.

 

కేంద్రానికి సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయడంతో.. తెలంగాణ ప్రభుత్వం కూడా.. ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన క్రిమినల్‌ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయనుంది. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసులన్నీ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి కాబట్టి... ఆయన ఎక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నా… ఎమ్మెల్యే కాబట్టి.. సీరియస్ కేసులు కాబట్టే విచారణ జరగడం ఖాయం. ఇక దీన్ని నుంచి తప్పించుకునేందుకు జగన్ రాజీనామా అంటూ కొత్త పాట అందుకున్నాడని రాజకీయ విశ్లేషకలు చర్చించుకుంటున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ప్రారంభమై… కేసుల బదిలీ జరిగే లోపు.. తాను ఎమ్మెల్యేను కాదు.. ప్రజాప్రతినిధిని కాదని నిరూపించాలని జగన్ డిసైడయ్యాడట. అందుకే జగన్ ఏ క్షణమైనా రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి జగన్ బాగానే ప్లాన్ వేశాడు కానీ.. అది వర్కవుట్ కావాలి కదా. తాను ఆవేశపడి రాజీనామా చేసినా... దాన్ని స్పీకర్ ఆమోదించాలి కదా. జగన్ ఆలోచన ఏంటో తెలుసు కాబట్టి.. ఆమోదించకపోవడానికి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి. దీన్నిబట్టి చూస్తే జగన్ జాతకం ఏంటో ఎన్నికలలోపే తేలిపోయేటట్టే కనిపిస్తోంది.