దావోస్ వేదికగా జగన్, కేటీఆర్ రహస్య చర్చలు?

ఆంధ్ర ప్రదేదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు బయలు దేరారు.. అయన కంటే ముందే తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వయా యూకే, దావోస్’ కు పయనమయ్యారు. అయితే, ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన ఈ ఇద్దరు ముఖ్యనేతలు విదేశీ గడ్డమీద కలవడం యాదృచ్చికమా,లేక వ్యుహత్మకమా? జగన్ రెడ్డి, కేటీఆర్ ముందుగా అనుకునే దావోస్ ఎకనమిక్ ఫోరం వేదికను రాజకీయ చర్చలు, సంప్రదింపులకు వేదిక చేసుకున్నారా? అంటే, అదే నిజమని అంటున్నారు, రెండు పార్టీల లోగుట్టు తెలిసిన రాజకీయ విశ్లేషకులు. నిజానికి, కేటీఆర్’కు ఎకనమిక్ ఫోరం ఇన్విటేషన్ లేదని, జగన్ రెడ్డితో రహస్య చర్చలు జరిపేందుకు మేనేజ్ చేసి ఇన్విటేషన్ తెచ్చుకున్నారని అంటున్నారు.  

ఉభయ తెలుగు రాష్ట్రాలో అధికార పార్టీలు ప్రజాగ్రహాన్ని ఎదుర్కుంటున్నాయి. అందులో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఏపీలో వైసీపీ, తెలంగాణలో తెరాస ఓటమి తధ్యం అనేది గోడ మీద రాతలా స్పష్టంగా, క్లిస్టర్  క్లియర్ గా అందరికీ కనిపిస్తోంది. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు.అదే, సమయంలో ఏపీలో చంద్రబాబు నాయుడు, తెలంగాణలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, రాజకీయ దూకుడు ప్రదర్శిస్తున్నారు.వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.ఎ

న్నికకు ఇంకా సమయం ఉన్నా, ఐదేళ్ళు పాలించే  సత్తా ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి /వైసీపీ లేదని తేల్చి చెప్పిన చంద్రాబాబు ముందస్తుకు సిదమై సత్తా చూపుతున్నారు. ఆయన ఎక్కడికి వెళితే అక్కడ ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. అదే విధంగా కేసీఆర్ ముందస్తుకు పోవడం ఖాయమని ముందుగానే నిర్ణయానికి వచ్చిన రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. అధిష్టానం అండదండలతో దూసుకు పోతున్నారు. కేసీఆర్’ని ఓడించే సత్తా ఒక్క రేవంత్ రెడ్డికి మాత్రమే ఉందని ప్రజలు సైతం ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, ఆ ఇద్దరే .. ఈ ఇద్దరు జగన్ రెడ్డి, కేసీఆర్’కు ప్రధాన, ప్రమాదకర రాజకీయ ప్రత్యర్ధులుగా మారారు.. అందుకే ఆ ఇద్దరిని  కట్టడి చేసేందుకు,గుట్టుచప్పుడు కాకుండా, ఉమ్మడి వ్యూహ రచన చేసేందుకు, జగన్ రెడ్డి, కేటీఆర్ దావోస్’ వేదికను ఎంచుకున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఇందులో ప్రధానంగా, పరస్పర సహకారంతో పాత కేసులను తిరగతోడి అటు చంద్రబాబును, ఇటు రేవంత్  రెడ్డిని రాజకీయంగా దెబ్బతీసే ప్రణాళికను సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య, అధికార పార్టీల నడుమ సాగుతున్న పొలిటికల్’ క్విట్ ప్రొ కో గురించి రాజకీయ వర్గాల్లో  ఆసక్తికర చర్చ జరుగుతోంది. వివరాలోకి వెళితే .. ఉభయ తెలుగు రాష్టాల ముఖ్యమంత్రుల మధ్య రాజకీయ సయోధ్య మూడు పూవులు, ఆరు కాయలుగా విలసిల్లుతోందా? రాజకీయ అవసరాలు, ఓటమి భయం ఉభయ రాష్ట్రాల అధికార  పార్టీలను దగ్గర చేసిందా? ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు,’నీకు నేను, నాకు నీవు’ అని యుగళ  గీతాలు పాడుకుంటున్నారా ? అంటే, రాజకీయ విశ్లేషకులు అవుననే అంటున్నారు.

రాజ్యసభ అభ్యర్ధుల ఎంపిక విషయంలో ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య కనిపించిన ఇచ్చి పుచ్చుకునే ధోరణి భవిష్యత్ రాజకీయాలకు సంకేతమనే మాట కుడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అంతే కాదు, మునకేసేందుకు సిద్దంగా ఉన్న ఓటి పడవలో పయనిస్తున్న ఇద్దరు ముఖ్యమంత్రులు  ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఒకే సారి ఎన్నికలు నిర్వహించే దిశగా వ్యూహ రచన చేస్తున్నారని కూడా  రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. 

నిజానికి, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసేఅర్ మధ్య అది నుంచి కూడా, పైకి కనిపించక పోయినా, రాజకీయ స్నేహ సంబంధాలు ఒకే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో, ఒకరికొకరు సహకరించుకుంటూనే ఉన్నారు. మధ్య మధ్యలో కాసింత ఎడం పాటించినా ఇద్దరు ఒకటిగానే అడుగులు వేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే, 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వైసీపీకి సంపూర్ణ స్నేహ హస్తం అందించారని అంటారు. జగన్ రెడ్డికి కేసీఆర్ వందల కోట్లలో ఆర్థిక సహాయం అందించారని, అంటారు. అందుకు ప్రతిఫలంగానే ఏపీలో అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే  జగన్ రెడ్డి. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ పై ఏపీకి ఉన్న సర్వ హక్కులను, ఆస్తులను ఉదారంగా వదిలేసుకున్నారు.

ఎన్నికల నిధులు సమకూర్చి నందుకు కృతజ్ఞతగా రాష్ట్ర ప్రయోజనాలను, ఆంద్ర ప్రజల ఆస్తులను తెలంగాణకు ధారాదత్తం చేశారు. ఆ విధంగా ఎన్నికల  ఋణం తీర్చుకున్నారు. ఇప్పడు కూడా ముందస్తు ఎన్నికలకు సిద్దమైతే, ఎన్నికల ఖర్చులో మేజర్ షేర్ ఇచ్చేందుకు తెరాస నుంచి స్పష్టమైన హామీ ఉందని వైసీపీ నాయకులే పిచ్చాపాటి ముచ్చట్లలో బయట పడి పోతున్నారు.

సరే అదలా ఉంటే ఇప్పుడు, ఏపీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు, తెలంగాణలో పీసీసీ చీఫ్ రేవత్ రెడ్డి ఆయా రాష్ట్రాలలో అధికార పార్టీలకి గట్టి సవాలు విసురుతున్నారు. ఏపీలో చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. గత (2019 ఎన్నికల) అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని, అధికార వైసీపీ ఓటు చీలకుండా ఇతర పార్టీలతో పొత్తుకు సిద్డంవుతున్నారు.రాష్ట్రంలో మూడవ శక్తిగా అవతరిస్తున్న జనసేనతో పాటుగా, ఇతర ప్రతిపక్ష పార్టీలతో పొత్తుకు సిద్దమయ్యారు. అందుకే అవసరం అయితే త్యాగాలు సిద్దం కావాలని పార్టీ నాయకులకు పిలుపు నిచ్చారు. మరో వంక జనసేన కూడా తెలుగుదేశంతో పొత్తుకు సానుకులతను వ్యక్తపరిచింది. నిజానికి వైసేపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలనే ప్రతిపాదనను ముందుగా జనసేన అధినేత పవన్ కళ్యాణే తెరమీదకు తెచ్చారు.  ఇక తెలంగాణ విషయానికి వస్తే, ముందస్తు ఎన్నికలను ముందుగానే పసిగట్టిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అగ్ర యువ నేత రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటన తర్వాతా పార్టీలో మరింత జోష్ పెరిగింది.

అదికార పార్టీ నేతలు సైతం కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే టీఆర్‌ఎ్‌సకు చెందిన మంచిర్యాల జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మి, ఆమె భర్త మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఇందతా ఒకెత్తు అయితే, రాహుల్ గాంధీ చేతుల మీదుగా విదుదల చేసిన వరంగల్ డిక్లరేషన్, హస్తం చేతిలో పాశుపదాస్త్రంగా మారుతోందని పరిశీలకులు అంటున్నారు. రైతులు, వ్యవసాయ దారులు, గ్రామీణ ప్రజానీకం అందరూ, వరంగల్ డిక్లరేషన్’ కు జేజేలు పలుకుతున్నారు. 

ఇలా అక్కడ ఏపీలో చంద్రబాబు చాణక్యంతో ఇక్కడ రేవంత్ దూకుడు, రాహుల్ సంధించిన  వరంగల్ డిక్లరేషన్ పాశుపతాస్త్రాన్ని తట్టుకునేందుకు, కేసేఆర్, జగన్ రెడ్డి ఉమ్మడి వ్యూహంతో ముందుకు వెళుతున్నారు. అందులో భాగంగా దావోస్’ వేదికగా వ్యూహ రచన సాగుతోందని విస్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే, ఇప్పటికే  చంద్రబాబు నిప్పులాగా బతికిన తనను ఎవరూ ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. అలాగే రేవంత్ రెడ్డి కూడా కేసులకు భయపడే వ్యక్తి కాదని, అంటున్నారు. అయితే, ఓటమి భయం వెంటాడుతున్నకేసీఆర్, జగన్ రెడ్డి కలిసి ఏమి చేస్తారు.... జగన్ రెడ్డి, కేటీఆర్ వ్యూహం ఏమిటి అనేది  అనేది ఇప్పడు అందరి ముందున్న ప్రశ్న.