Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...దువ్వాడ శ్రీనివాస్‌ని జగన్ ఓదార్చాలి!
posted on: Aug 10, 2024 4:20PM
శవం దొరికితే చాలు.. ఓదార్పు పేరుతో పీక్కుతినడానికి రెడీ అయిపోతున్న వైసీపీ నాయకుడు జగన్ ఇప్పుడు జస్ట్ ఫర్ ఛేంజ్ మరో ఓదార్పు యాత్ర చేపట్టాలి. అర్జెంటుగా టెక్కలికి బయల్దేరాలి. ఆయన ప్రస్తుతం ఓదార్చాల్సింది ఎవర్నో కాదు.. తన పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ని.
భర్త, ముగ్గురు ఆడపిల్లలు వున్న దివ్వెల మాధురి అనే వైసీపీ నాయకురాలిని పాపం దువ్వాడ శ్రీనివాస్ ఎంతో పెద్దమనసుతో, చక్కగా తన ఇంట్లోనే పెట్టుకుని ఆదుకుంటుంటే, ఓర్వలేని అతని భార్య, కూతుళ్ళు గొడవ పడుతున్నారు. దువ్వాడ శ్రీనివాస్‌ని రోడ్డు మీదకి లాగుతున్నారు. దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి ఇద్దరూ రాసుకుని పూసుకుని తిరుగుతూ వుంటే, గుళ్ళో గోపురాలకు వెళ్తుంటే, విహారయాత్రలకు చెక్కేస్తుంటే చూసి ఓర్చుకోలేని దువ్వాడ శ్రీనివాస్ భార్య, కూతుళ్ళు వాళ్ళిద్దరికీ సంబంధం వుందని అన్యాయంగా ఆరోపించారు. దివ్వెల మాధురి కుటుంబం మొత్తం మాధురిని తిట్టారు. దాంతో దివ్వెల మాధురి బాగా హర్టయింది. ఆ తర్వాత దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ ఒక హోటల్ గదిలో కలిశారు. ‘‘ఏంటి సార్ ఈ అన్యాయం.. అన్నెం పున్నెం ఎరుగని నా మీద మీ భార్య లేనిపోని ఆరోపణలు చేస్తోంది. మనిద్దరం కలసి గుళ్ళూగోపురాలకి, విహారయాత్రలకి తిరిగామే తప్ప అంతకన్నా ఏమైనా చేశామా? నేనేమో సంప్రదాయిని.. మీరేమో సుద్దపూస. అలాంటి మనిద్దరికీ సంబంధం వుందని మీ భార్య వాణి ఆరోపిస్తోంది. నా కుటుంబంలో నేను బద్నామ్ అయిపోయాను. ఇక నాకు చావే శరణ్యం’’ అని వెంటనే తాడుతో ఉరేసుకోబోయింది. ఉరితాడులో తల పెట్టేసి కిందకి దూకేసింది. అది చూసి బిత్తరపోయిన దువ్వాడ శ్రీనివాస్ ఉరితాడుకి, దివ్వెల మాధురి గొంతుకి మధ్య తన చేతిని అడ్డుగా పెట్టాడు. ఆ తర్వాత చాలా తంటాలు పడి ఆమెని ఉరితాడు నుంచి తప్పించి కిందకి దించాడు. ఆత్మహత్య చేసుకోవడం తప్పు అని ఆమెని వారించాడు. నీకు ఎవరూ లేకుండా పోయారు కాబట్టి నీకు అండగా నేనుంటాను అని మాటిచ్చాడు. అప్పటి నుంచి ఆమెను తన ఇంట్లోనే వుంచుకుంటూ ప్రేమగా చూసుకుంటున్నాడు. ఇద్దరు వివాహితులు వేరేవాళ్ళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నా తప్పుకాదని సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పిందంట. ఆ సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ, ఇద్దరూ ‘అడల్ట్రీ’ అనే సంబంధం పెట్టుకుని సంతోషంగా జీవిస్తుంటే, ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ భార్య, పిల్లలు నానా రచ్చ చేస్తున్నారు.
ఒక మంచి పని చేస్తుంటే ఇలా రచ్చ రంబోలా అవుతున్నందుకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎంత హర్టయ్యాడో ఏం పాడో.. మరోవైపు ఆ నిప్పులాంటి మహాతల్లి దివ్వెల మాధురి కూడా ఎంత బాధపడుతోందో ఏంటో! దివ్వెల మాధురి జగన్‌కి ఆల్రెడీ తెలుసు. 2022 అక్టోబర్‌లో ఆమెని జగన్‌కి దువ్వాడ శ్రీనివాస్ పరిచయం చేసి, పార్టీలో చేరిస్తే, జగన్ వెంటనే ఆమెకి శ్రీకాకుళం జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలి పదవి కూడా ఇచ్చేశాడు. దువ్వాడ శ్రీనివాస్‌తోపాటు అమె కూడా హర్టయి వుంటుంది కదా.. అందుకే ఆ ఇద్దరు పవిత్ర ప్రేమ పక్షులను ఓదార్చడానికి జగన్ అర్జెంటుగా టెక్కలికి బయల్దేరాలి. బెంగళూరు నుంచి టెక్కలికి ట్రావెల్ చేసే సమయంలోనే, ఈ ‘కేసు’లో టీడీపీని ఎలా ఇరికించవచ్చో కూడా ఆలోచించాలి.



.webp)


