Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పిచ్చికుక్కలా మాట్లాడకు.. నోరు కంట్రోల్ లో పెట్టుకో
posted on: Apr 26, 2018 3:04PM

యధా రాజ.. తధా ప్రజా అన్న సామెత వినే ఉంటారు కదా... ఇప్పుడు ఈ సామెత వైసీపీ నేతలకు బాగా సూటయ్యేలా కనిపిస్తోంది. ఎందుకంటే.. తమ అధినేత ఎలా ఉంటే.. అనుచరులు కూడా అలానే ఉంటారు కదా. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై జగన్ ఏ రేంజ్ లో విమర్శలు గుప్పిస్తారో తెలుసుకదా. కనీసం ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారని కానీ..వయసులో పెద్ద అని కానీ ఆలోచించకుండా.. ఆయనను నడిరోడ్డుపైనే కాల్చిపారేయాలని.. ఉరితీయాలని అబ్బో నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తుంటారు. మరి ఒక పార్టీ అధినేత స్థానంలో ఉన్న ఆయనే అలా మాట్లాడితే.. మిగిలిన నేతలు మాత్రం ఎందుకు ఉంటారు. వారు కూడా చంద్రబాబును కనీసం మర్యాద కూడా లేకుండా మాట్లాడేస్తున్నారు.
ఇంతకీ అసలు సంగేతంటంటే...వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా గన్నవరం నియోజకవర్గంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మాములుగా కొంత మంది వైసీపీ నేతలకు మైకు చూస్తే పూనకాలు వచ్చేస్తుంటాయి కదా. ఏం మాట్లాడుతున్నాం.. ఎలా మాట్లాడుతున్నాం అని ఒక్కసారి కూడా ఆలోచించకుండా మైకు దొరికింది కదా అని తమ నోటికి పని చెప్పేస్తుంటారు. అలా నాని కూడా జగన్ పాదయాత్రలో భాగంగా మాట్లాడుతూ.. టీడీపీ పై ముఖ్యంగా చంద్రబాబు నాయుడిపై విమర్శలు గుప్పించారు. అంతేకాదు ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా.. ఆడు ఈడు అంటూ, బూతులు తిట్టారు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే.. ఒక పక్క చంద్రబాబును తిడుతూ... మరోపక్క వంశీ నా సన్నిహితుడని చెప్పుకొచ్చారు.
అంతే నాని చేసిన వ్యాఖ్యలపై స్పందించిన వంశీ... ‘నోరు అదుపులో పెట్టుకో, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’ అని వార్నింగ్ ఇచ్చారు. ఒకప్పుడు ఇద్దరం స్నేహితులమే కావచ్చు.. ఇప్పుడు కాదు.. టీడీపీ, చంద్రబాబుతో తప్పితే నానితో స్నేహమే లేదు.. పిచ్చికుక్కలా మాట్లాడితే సహించబోమని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న నానిని, వైసీపీలో బరితెగించి మాట్లాడేవారిని జగన్ కంట్రోల్ చేయాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. మరి చూద్దాం.. వంశీ మాటలకు నాని ఎలా రియాక్ట్ అవుతాడో..


.jpg)



